ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా..ఆయనను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే, విచారణ జరపవచ్చని ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కావాలని కేటీఆర్ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
కేటీఆర్ పాటు హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ లకూ నోటీసులు జారీ అయ్యాయి. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని విచారణ జరపబోతున్నారని తెలుస్తోంది.
మరోవైపు, ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లను జనవరి 2,3 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం లేకుండానే ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే నిధులు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఏసీబీ ఎఫ్ ఐఆర్ ఆధారంగా పీఎమ్ఎల్ చట్టం కింద ఈడీ విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్ఈవోకు 55 కోట్లు నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఆర్థికపరమైన అవకతవలు జరిగాయని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on January 3, 2025 7:09 pm
టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్కు…
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి అభిమానులకు కొత్తగా చెప్పేందుకు ఏం లేదు కానీ పబ్లిక్…
చాలామంది సినీ నటుల నట జీవితాన్ని వారు నటించిన సినిమాలను లెక్క చూపించి.. దానికి ముందు.. దాని తర్వాత అంటూ…
అన్నయ్య చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కు ఎంత ప్రేమో ఇప్పటికే లెక్కలేనన్ని సందర్భాల్లో బయటపడినా ప్రతిసారి కొత్తగా అనిపించడం…
పెరుగు వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. అయితే పెరుగు తియ్యగా ఉంటేనే తినడానికి చాలామంది…
ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ప్రతిసారి విపరీతంగా ఆలస్యం కావడం గతంలో చూశాం. అయితే గత…