Political News

షెల్ట‌ర్ కోస‌మే వైసీపీ నేత‌లు: చంద్ర‌బాబు

గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. కేవ‌లం 11 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ నుంచి ప‌లువురు నాయ‌కులు కాదు.. ఎక్కువ సంఖ్య‌లోనే నాయ‌కులు ప‌క్క‌దారి ప‌డుతున్నారు. వారి వారి రాజ‌కీయాల‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుని.. కూట‌మి పార్టీల్లోకి చేరుతున్నారు. అయితే.. ఈ చేరిక‌ల వ్య‌వ‌హారం.. కూట‌మి పార్టీలుగా ఉన్న టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు పెంచుతోంది. నిన్న మొన్నటి వ‌ర‌కు టీడీపీని తిట్టిపోసిన వారిని.. జ‌న‌సేన తీసుకుంటోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక‌, బీజేపీ కూడా వైసీపీ నేత‌లను తీసుకుంటోంద‌ని.. ఇది స‌రికాద‌ని.. టీడీపీ కీల‌క నాయ‌కుడి కుమారుడు ఇటీవ‌ల హాట్ కామెంట్లు చేశారు. ఇలాంటివారిని చేర్చుకోవాల‌ని తాము కూడా అనుకుంటే.. బీజేపీ నేత‌లు ఇబ్బందులు ప‌డ‌తార‌ని కూడా ఆ యువ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదేస‌మ‌యంలో టీడీపీలో చేరేవారిపై జ‌న‌సేన‌, జ‌న‌సేన‌లో చేరేవారిపై టీడీపీ నాయ‌కులు అంత‌ర్గ‌తంగా చిన్న‌పాటి విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఈ ప‌రిణామాల‌పై తాజాగా సీఎం చంద్ర‌బాబు స్పందించారు. వైసీపీ నేత‌ల చేరిక‌ల‌పై ఆయ‌న మాట్లాడుతూ.. వారంతా “షెల్ట‌ర్” కోస‌మే పార్టీలు మారుతున్నార‌ని చెప్పారు.

వైసీపీలో ఉన్నవారు షెల్టర్ తీసుకోవడానికి ఈ మూడు పార్టీల్లోకి వస్తున్నారని చంద్ర‌బాబు అన్నారు. అయితే.. పార్టీల్లోనూ ఈ చేరిక‌ల‌పై చ‌ర్చ సాగుతోంద‌ని తెలిపారు. ఈ విష‌యంపై మూడు పార్టీలలో చర్చ జరుగుతుందని.. కూట‌మిగా ఉన్నప్పుడు ఇటు వంటివి జరుగుతుంటాయని పేర్కొన్నారు. అయితే.. చేరిక‌ల విష‌యంలో ఎవ‌రి ఇష్టం వారిదేన‌న్నారు. అయితే.. చేర్చుకునే ముందు క‌లిసి చ‌ర్చించుకుంటే బాగుంటుంద‌ని వ్యాఖ్యానించారు. కొంద‌రు షెల్ట‌ర్ కోసం వ‌స్తుంటే.. మ‌రికొంద‌రు కేసుల నుంచి త‌ప్పించుకునేందు కూడా జంప్ చేస్తున్నార‌ని తెలిపారు. ఈ విష‌యంలో కూట‌మి పార్టీలుగా తాము క‌లిసి చ‌ర్చించుకుంటామన్నారు.

కాగా.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల వైసీపీ నేత‌లు పార్టీ మారి.. జ‌న‌సేన‌లోకి చేరారు. ముఖ్యంగా గ‌తంలో టీడీపీలోనే ఉన్న గంజి చిరంజీవి.. స‌తీమ‌ణితో క‌లిసి.. పార్టీ మారారు. ఈ వ్య‌వ‌హారం.. టీడీపీలో చర్చ‌నీయాంశం అయింది. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం.. ఆయ‌న‌పైనే గ‌తంలో గంజి చిరంజీవి విమ‌ర్శ‌లు చేయ‌డం వంటి ప‌రిణామాల రీత్యా.. టీడీపీ నేత‌లు గుస్సాగా ఉన్నారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 2, 2025 9:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిల్ రావిపూడి చూపించే చిరంజీవి ఎలా ఉంటాడంటే

టాలీవుడ్ లో అసలు అపజయమే ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్…

7 hours ago

నిజం కాబోతున్న శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తో తన కంబ్యాక్ ఇస్తానని అభిమానులను ఊరిస్తున్న దర్శకుడు శంకర్ దానికి తగ్గట్టే ట్రైలర్ ద్వారా…

7 hours ago

డబుల్ బొనాంజా కొట్టేసిన అంజలి

కొన్నిసార్లు సినిమాల పరంగా జరిగే సంఘటనలు యాదృచ్చికమే అయినా విచిత్రంగా అనిపిస్తాయి. అలాంటిదే ఇది కూడా. జనవరి 10 విడుదల…

9 hours ago

USA: భారతీయులను భయపెడుతున్న ఓపీటీ రచ్చ

అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు వృత్తి అవకాశాల కోసం ఓపీటీపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నారు. హెచ్‌1బీ వీసాలు పొందేందుకు ఈ…

9 hours ago

వరుస ఫ్లాపులు.. అయినా చేతిలో 4 సినిమాలు

టాలీవుడ్లో పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారసులకు కూడా లేని అరంగేట్రం బెల్లకొండ సాయి శ్రీనివాస్‌కు దక్కింది. బెల్లంకొండ సురేష్…

10 hours ago

జేసీ కామెంట్లపై తగ్గేదేలే అంటోన్న మాధవీ లత

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల…

11 hours ago