తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇటీవల కాలంలో తెలంగాణ నేతల నుంచి ప్రధాన డిమాండ్ వినిపిస్తోంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా.. అందరూ తమ సిఫార్సు లేఖలను అనుమతించాలని కోరుతున్నారు. తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తులకు సౌకర్యాల కల్పనలోనూ ప్రాధాన్యం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ సహా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సిఫార్సు లేఖల వ్యవహారంపై తరచుగా కామెంట్లు చేస్తున్నారు.
దీనిపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రుల నుంచి వచ్చే సిఫార్సు లేఖలను అనుమతించాలని సీఎం ఆదేశించారు. అయితే.. ఎవరి నుంచి వచ్చినా.. ఎన్ని వచ్చినా.. వారానికి నాలుగు సిఫార్సు లేఖల మేరకే దర్శనాలు కల్పించాలని తేల్చిచెప్పారు. వీటిలోనూ రెండు బ్రేక్ దర్శనాలు, రెండు రూ.300 ప్రత్యేక దర్శనాలకు పరిమితం కావాలని చంద్రబాబు సూచించారు.
ఈ మేరకు టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడుకు చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో ఉన్న సీఎం చంద్రబాబును బీఆర్ నాయుడు సోమవారం మధ్యాహ్నం కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై ఆయనతో చర్చించారు. వారానికి నాలుగు లేఖలను మాత్రమే అనుమతించాలని ఈ సందర్భంగా సీఎం తేల్చి చెప్పారు. అదేసమయంలో మాజీ ప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధుల డిమాండ్ నెరవేరినట్టయింది.
This post was last modified on December 30, 2024 3:52 pm
టాలీవుడ్ అనే కాక ఇండియన్ బాక్సాఫీస్లో ఈ వేసవి పెద్దగా ఉత్సాహం నింపలేకపోయింది. మామూలుగా సమ్మర్లో పెద్ద సినిమాలు రిలీజై…
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు…
వైసీపీ హయాంలో పదవులు దక్కించుకున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెలకు 3 లక్షలకు పైగానే వేతనాల రూపంలో…
నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్,…
జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…
ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…