ఫ్ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనపై దాఖలైన ఏసీబీ కేసు క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఏసీబీని ఆదేశించింది. వారం వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, విచారణ కొనసాగించవచ్చని ఏసీబీ అధికారులకు హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది. అంతకుముందు, ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు, కేటీఆర్ తరపున న్యాయవాదులకు వాడీవేడీ వాదనలు జరిగాయి.
ఇది అత్యవసర పిటిషన్ విచారణ కాదని, ఇందులో కేటీఆర్‌కు ఎలాంటి లబ్ధి చేకూరింది అని ఏజీని ప్రశ్నించిన న్యాయమూర్తి. ఎఫ్ ఈవోకు డబ్బుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని ఏజీ వాదించారు.పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణ జరిగితే ఎవరెవరికి ఎలాంటి లబ్ధి చేకూరిందనేది తేలుతుందని చెప్పారు.
This post was last modified on December 20, 2024 5:49 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…
విజయ్ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్ కలయికలో రూపొందిన విడుదల పార్ట్ 2 ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. మొదటి భాగం…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అయితే, రద్దీ కారణంగా…
దశాబ్దాలుగా డోలీలలో గిరిజనులు పడుతున్న అవస్థలకు చరమగీతం పడేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుము బిగించిన సంగతి…