Political News

ఏ ఎండ‌కు ఆ గొడుగు.. కృష్ణ కృష్ణా.. కృష్ణ‌య్య‌!

‘ఒక ఉద్య‌మం కోసం పోరాడిన వాళ్లు ఆ ఉద్య‌మానికే క‌ట్టుబ‌డాలి. అప్పుడే ప్ర‌జ‌ల్లో విశ్వాసం ఉంటుంది’- లోక్‌పాల్ కోసం.. ఉద్య‌మించిన స‌మ‌యంలో ప్ర‌ముఖ సంఘ సంస్క‌ర్త‌.. ఉద్య‌మ మేధావి అన్నా హ‌జారే చేసిన వ్యాఖ్య‌లు ఇవి. ఇవేవో ఎప్పుడో చేసిన వ్యాఖ్య‌లు కావు. మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చేసిన వ్యాఖ్య‌లే. కానీ, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు.. అలాంటి నాయ‌కులు క‌నుమ‌రుగు అవుతున్నారు. బీసీల హ‌క్కుల కోసం పోరాటం చేసిన ఆర్.కృష్ణ‌య్య ఇప్పుడు.. ప్లేటు మార్చారు.

మ‌రో మాట చెప్పాలంటే.. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌డుతున్నార‌న్న వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. “బీజేపీ నాకు పిలిచి టికెట్ ఇచ్చింది” అని తాజాగా మంగ‌ళ‌వారం ఆయ‌న చాలా గొప్ప‌గా చెప్పుకొచ్చారు. కానీ, ఇక్క‌డే ఓ విష‌యాన్ని ఆయ‌న మ‌రిచిపోయినా.. బీసీల చెవుల్లో వినిపిస్తున్న‌దేంటంటే.. 2022-23 మ‌ధ్య కాలంలో ఇదే కృష్ణ‌య్య‌కు వైసీపీ తొలిసారి పిలిచి మ‌రీ రాజ్య‌స‌భ‌కు పంపించిన‌ప్పుడు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు. “నా ప్రాణం పోయే వ‌ర‌కు.. వైసీపీలోనే ఉంటా. నేను పండుకుంటే.. లేపి మ‌రీ పంపించారు” అని వ్యాఖ్యానించారు.

కానీ, ఇప్పుడు త‌ను ప‌ద‌విని తానే వ‌దులుకుని.. బీజేపీ పిలిచి ఇచ్చింద‌ని చెప్ప‌డం కృష్ణ‌య్య‌కే చెల్లిందని బీసీ సంఘాల నాయ‌కులు చెబుతున్నారు. ఒక‌ప్పుడు బీసీల కోసం ఉద్య‌మాలు అవ‌స‌రం. కానీ, ఇప్పుడు బీసీల‌కు ప్ర‌భుత్వాలే అడ‌గ‌కుండా అన్నీ చేస్తున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రిజ‌ర్వేష‌న్ల నుంచి ప‌థ‌కాల వ‌ర‌కు కూడా.. వారికి అన్ని విధాలా ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో త‌న రాజ‌కీయ దారి తాను చూసుకున్నార‌నేది కృష్ణ‌య్య‌పై వ‌స్తున్న ప్ర‌ధాన విమ‌ర్శ‌లు.

ఇక‌, మంగ‌ళ‌వారం ఆర్‌. కృష్ణ‌య్య రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ వేశారు. ఈయ‌న విజ‌యం ద‌క్కించుకోవ‌డం స‌మ‌స్య‌కాదు. కూట‌మి ప్ర‌భుత్వానికి చాలి నంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబ‌ట్టి..ఆయ‌న పెద్ద‌ల స‌భ‌లో దిగ్విజ‌యంగా అడుగు పెట్ట‌నున్నారు. అయితే.. బీసీ ఉద్య‌మ నాయ‌కుడిగా చూస్తే.. మాత్రం ఆయ‌న ప్ర‌తిభ‌కు.. ప్రాభ‌వానికి కూడా మ‌చ్చ‌లు ఏర్ప‌డ్డాయ‌న్న‌ది ఉద్య‌మ నేత‌లు అంటున్న మాట‌. ఏదేమైనా.. ఇవ‌న్నీ.. ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో కృష్ణ‌య్య లేరు క‌దా!!

This post was last modified on December 10, 2024 4:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మానాన్న‌కు న్యాయం ఎప్పుడు? : సునీత‌

మా నాన్న‌కు న్యాయం ఎప్పుడు జ‌రుగుతుంది? మాకు ఎప్పుడు న్యాయం ల‌భిస్తుంది? అని వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ మ‌ర్రెడ్డి…

20 minutes ago

పవన్ ప్రసంగంతో ఉప్పొంగిన చిరంజీవి!

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆ పార్టీ అదినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని…

1 hour ago

ఈ ‘పోటీ’ పిచ్చి ఎంతటి దారుణం చేసిందంటే..?

నిజమే… ఈ విషయం విన్నంతనే.. ఈ సోకాల్డ్ ఆదునిక జనం నిత్యం పరితపిస్తున్న పోటీ… ఇద్దరు ముక్కు పచ్చలారని పిల్లల…

1 hour ago

స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్

జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…

11 hours ago

ఛావాకు రెండో బ్రేక్ పడింది

మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…

11 hours ago

ఖైదీ 2 ఎప్పుడు రావొచ్చంటే

సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…

11 hours ago