రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. నిన్నటి మిత్రుడు నేడు శత్రువు కావొచ్చు. నేటి శత్రువు రేపటికి మిత్రుడూ కావొచ్చు. కానీ, ఎటొచ్చీ.. ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గానికి చెందిన సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచు గరటయ్య కుటుంబం విషయంలో మాత్రం కరణం బలరామకృష్ణమూర్తి.. ఎప్పటికప్పుడు చిచ్చు పెడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో అంటే టీడీపీ ప్రారంభించిన సమయంలో గరటయ్య.. టీడీపీలో చేరి.. అద్దంకి నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1983, 1985 ఎన్నికల్లో టీడీపీ తరఫున అద్దంకిలో విజయం సాధించారు.
1994, 1999లోనూ గరటయ్య అద్దంకిలో విజయం సాధించారు. ప్రజా నేతగా ఆయన గుర్తింపు కూడా పొందారు. అప్పటికి కరణం బలరాం.. కాంగ్రెస్‌లో ఉన్నారు. ఎంపీగా గెలిచారు. బలమైన నాయకత్వం కూడా ఉంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం.. కేడర్ బలంగా ఉండడంతో ఆయన అన్ని పార్టీలూ ప్రాధాన్యం ఇచ్చేవి. తర్వాత ఆయన టీడీపీలోకి వచ్చి.. అద్దంకి టికెట్ కోసం పట్టుబట్టడంతో.. చంద్రబాబు గరటయ్యను తప్పించి కరణంకు అవకాశం ఇచ్చారు. దీంతో 2004లో కరణం విజయం సాధించారు. ఇక, ఆ తర్వాత.. గరటయ్య పరిస్థితి ఎవరూ పట్టించుకునేలా కనిపించలేదు.
ఈ నేపథ్యంలో ఆయనకు టీడీపీలో ప్రాధాన్యం తగ్గింది. ఇక, వైసీపీలో మారిన పరిస్థితుల నేపథ్యంలో గత 2014 ఎన్నికలకు ముందు నుంచి ఆయన వైసీపీలో ఉన్నారు. అయితే, అప్పట్లో గొట్టిపాటి రవి పోటీకి రావడంతో గరటయ్యకు జగన్ అవకాశం ఇవ్వలేకపోయారు. అయినా ఆయన పార్టీలో ఉన్నారు. గత ఏడాది ఎన్నికల్లో గరటయ్యకు జగన్ ఛాన్స్ ఇచ్చారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సునామీ ప్రభావం కనిపించినా.. అద్దంకిలో గరటయ్య గెలుపుగుర్రం ఎక్కలేక పోయారు. వయో వృద్ధుడు కావడం, గొట్టిపాటి ప్రబావం ఎక్కువగా ఉండడంతో ఆయన గెలవలేక పోయారు. అయితే, వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు కృష్ణచైతన్యను రంగంలోకి దించేందుకు గరటయ్య పావులు కదుపుతున్నారు.
అద్దంకిలో వైసీపీకి ఇప్పుడు కృష్ణచైతన్య యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లోతనకే టికెట్ ఖాయమని ఆయన అనుకున్నారు. అయితే.. ఇప్పుడు మళ్లీ కరణం అడ్డుపుల్ల వేశారు. ఆయన గత ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరఫున గెలిచి కూడా వైసీపీలోకి చేరి.. తన కుమారుడికి అద్దంకి సీటు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో జగన్ కూడా ఓకే చెప్పారు. దీంతో నిన్న మొన్నటి వరకు ఈ సీటు తమదే అనుకున్న గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్య కరణం ఎఫెక్ట్‌తో ఏం చేయాలో తెలియక.. ఇబ్బంది పడుతున్నారు.
మరి జగనే తమను ఆదుకోవాలని ఇటీవల గరటయ్య.. సీఎం కు లేఖ రాసినట్టు నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. మంచి నాయకుడు, పేదల డాక్టర్‌గా పేరున్న గరటయ్య కు జగన్ న్యాయం చేస్తారని వైసీపీ నాయకులు కూడా అంటున్నారు. ఎటొచ్చీ.. కరణం ఎఫెక్ట్‌తో గతంలో టీడీపీలోను, ఇప్పుడు వైసీపీలోను గరటయ్య కుటుంబం ఇబ్బంది పడుతుండడం గమనార్హం.
This post was last modified on October 9, 2020 4:16 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…