Political News

ఆఫీసులోకి అడుగు పెట్టాలంటే భయపడుతున్నాడా ?

తెలుగుదేశంపార్టీ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి కొత్తగా అధ్యక్షుడిగా అపాయింట్ అయిన మాజీ ఎంఎల్ఏ పల్లా శ్రీనివాస్ భయపడిపోతున్నారట. విశాఖ నడిబొడ్డున ఉన్న పార్టీ కార్యాలయంలోకి రాకుండా గాజువాకలోని తన కార్యాలయంలోనే ఉంటున్నారట. గాజువాక నుండి గతంలో గెలిచిన పల్లాకు స్వతహాగా ఇంజనీరు కూడా. అందుకే కాస్త వాస్తు విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. నగరం మధ్యలో ఉన్న పార్టీ కార్యాలయానికి వాస్తుదోషం ఉన్న కారణంగా తాను నగరంలోని కార్యాలయంలోకి అడుగుపెట్టేది లేదని చెప్పేశారట.

ఎలాగూ గాజువాకలోని తన కార్యాలయం ఉంది కాబట్టి తనను ఎవరు కలవాలన్నా అక్కడికే రావాలంటు సీనియర్లకు, కార్యకర్తలకు ఇఫ్పటికే చెప్పేశారట. పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఉన్న పల్లా ఎక్కడో గాజువాక కార్యాలయంలో కూర్చుని పార్టీ కార్యక్రమాలు చూస్తానంటే కుదురుతుందా ? ఇదే విషయాన్ని చాలామంది సీనియర్లు అడిగితే ఎవరేమి చెప్పినా తాను మాత్రం నగరంలోని కార్యాలయానికి వచ్చేది లేదంటూ తెగేసి చెబుతున్నారట.

నగరంలోని పార్టీ కార్యాలయానికి బాగా వాస్తుదోషాలున్నట్లు పల్లా మొత్తుకుంటున్నారు. పార్టీకి వీధిపోటు చాలా ఎక్కువగా ఉన్న కారణంగా ఏ కార్యక్రమం పెట్టినా, అందులో ఎవరు బాధ్యతలు నిర్వర్తించినా కలిసి రవాటం లేదని పల్లా బలంగా నమ్ముతున్నారు. అలాగే గతంలో అధ్యక్షులుగా పనిచేసిన ఇద్దరు నేతలు రాజీనామాలు చేయకుండానే పార్టీని వదిలేయటం కూడా పల్లా సెంటిమెంటుగా చూస్తున్నారట. ఇంతకుముందు నగర అధ్యక్షులుగా పనిచేసిన మాజీ ఎంఎల్ఏలు ఎస్ఏ రహ్మాన్, వాసుపల్లి గణేష్ కుమార్ వైసిపిలో చేరిపోయిన విషయాన్ని పల్లా గుర్తు చేస్తున్నారట.

పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ విగ్రహం కూడా రాంగ్ ప్లేసులో ఉందని పల్లా చెబుతున్నారట. తాను గనుక నగరంలోని పార్టీ కార్యాలయంలోనే బాధ్యతలు నిర్వర్తించాలంటే ముందు పార్టీ కార్యాలయానికి వాస్తుదోషాలను సరిచేయాల్సిందే అని సీనియర్లకు స్పష్టం చేస్తున్నారట. ప్రతిపక్షంలో ఉన్నపుడు, అందులోను సంక్షోభంలో ఉన్న సమయంలో పార్టీ కార్యాలయానికి వాస్తుదోషాలు సరిచేసేందుకు ఎవరు ముందుకొస్తారు ? వాస్తుదోషాలు సరిచేసే పేరుతో ఒకసారి పనెత్తుకుంటే చాలా ఖర్చవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రస్తుతానికైతే పల్లా కేరాఫ్ గాజువాకే.

This post was last modified on October 9, 2020 4:05 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు?

హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…

14 mins ago

చిన్న దర్శకుడి మీద పెద్ద బాధ్యత

మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…

24 mins ago

తీన్మార్ మ‌ల్ల‌న్న ఆస్తులు ప్ర‌భుత్వానికి.. సంచ‌ల‌న నిర్ణ‌యం

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. నిత్యం మీడియాలో ఉంటూ..త‌న‌దైన శైలిలో గ‌త కేసీఆర్ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింత‌పండు న‌వీన్ గురించి…

2 hours ago

ఆవేశం తెలుగు ఆశలు ఆవిరయ్యాయా

ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…

2 hours ago

అమిత్ షా మౌనంపై ఆశ్చర్యం !

తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…

2 hours ago

తమన్నా రాశిఖన్నా ‘బాక్’ రిపోర్ట్

ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్‌మనై 4 మీద కాస్తో కూస్తో…

2 hours ago