గత ఏడాది ఎన్నికల్లో గుంటూరులోని మూడు కీలక పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ.. రెండు చోట్ల వైసీపీ విజయం సాధించింది. నరసారావుపేట, బాపట్ల నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు, యువ నేతలు లావు కృష్ణదేవరాయలు, నందిగం సురేశ్‌లు విజయం సాధించారు. వీరిపై స్థానికంగా ఎంతో బాధ్యత ఉంది. పైగా రాజధాని వివాదం నేపథ్యంలో ఇక్కడ పార్టీ తిరిగి పుంజుకునేలా.. ప్రస్తుత వ్యతిరేకతను తగ్గించి, మూడు రాజధానులపై ప్రజలను ఒప్పించే బాధ్యత కూడా అంతో ఇంతో ఉందనేది వాస్తవం. కానీ, ఇప్పుడు ఈ ఇద్దరి వ్యవహారం గరంగరంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.
తాజాగా లావు కృష్ణదేవరాయలు.. సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఇదివివాదానికి దారి తీసింది. తనకు సంబంధం లేని విషయంపై ఇలా లేఖ సంధించడం ఏంటని సొంత పార్టీలోనే నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విదేశీ విరాళాలు తీసుకోవడానికి అనుమతులను మరింత కఠినం చేసింది. విదేశీ విరాళాలు తీసుకుంటూ.. ఉగ్ర, మత పరమైన కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారనే ఉద్దేశంతోను, రాజకీయ పార్టీలు కూడా వినియోగించుకుంటున్నాయనే కారణంగా.. వీటికి కేంద్రం నిబంధనలు కఠినం చేసింది. అయితే, ఈ ప్రభావం తిరుమల క్షేత్రం నిర్వహించే బర్డ్ ఆసుపత్రిపై పడిందని, పేదలకు వైద్యం నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటూ లావు లేఖ సంధించారు.
ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని.. కేంద్రానికి ఈ విషయం తెలియజేయాలని ఎంపీ లావు కోరారు. అయితే, వాస్తవానికి తన నియోజకవర్గంలో లేని వ్యవహారం.. పైగా టీడీపీ ఈవో వైవీ ఇప్పటికే తిరుమల విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. అయినా.. లావు ఇలా లేఖ రాయడం ఏంటనేది వైసీపీ నేతల మాట. నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి విషయాన్ని పట్టించుకోకుండా ఇలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నియోజకవర్గాన్ని వదిలేసి.. సొంత పనులు చేసుకుంటున్నారని, ఢిల్లీలోనే ఉంటున్నారని సొంతపార్టీ నాయకులు తిట్టిపోస్తున్నారు.
ఇదిలావుంటే, ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. తన నియోజకవర్గంలో ఎంపీ వేలు పెడుతున్నారంటూ. సీఎంకు లేఖ రాశారు. తన ఆడియో టేపు ఒకటి బయటకు వచ్చి వివాదం కావడం వెనుక కీలక నాయకులు ఉన్నారని.. ఆమె ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఈ ఇద్దరు ఎంపీల వ్యవహారం కూడా పార్టీలోనే విమర్శలు వచ్చేలా చేసిందని అంటున్నారు పరిశీలకులు. ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on October 9, 2020 2:50 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…