Political News

‘మ‌హా’ ఆనందాన్ని మింగేసిన ‘యూపీ’.. కిక్కురు మ‌న‌ని క‌మ‌లం!!

కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు మ‌హా ఆనందంగా పార్ల‌మెంటుకు వ‌చ్చారు. సోమ‌వారం నుంచి ప్రారంభ‌మైన‌.. పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగానే కాదు.. సంతోషంగానూ వారు భావించారు. దీనికి కార‌ణం.. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌హా ప్ర‌భంజ‌న విజ‌యాన్ని నమోదు చేయ‌డ‌మే. మూడు ద‌శాబ్దాల కాలంలో ఒక కూట‌మికి భారీ సంఖ్య‌లో సీట్లు క‌ట్ట‌బెట్టిన ప‌రిస్థితి మ‌హారాష్ట్ర‌లో ఇదే తొలిసారి. బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి 235 స్థానాల్లో అప్ర‌తిహ‌త విజ‌యం న‌మోదు చేసుకుంది. ఇదేస‌మ‌యంలో త‌మదే అధికారం అంటూ ఆది నుంచి ధీమా వ్య‌క్తం చేసిన కాంగ్రెస్ కూట‌మి కుప్ప‌కూలింది.

దీంతో స‌హ‌జంగానే క‌మ‌ల నాథులు నింగినంటే ఉత్సాహంతో.. అప‌ర‌మిత ఆనందంతో పార్ల‌మెంటుకు వ‌చ్చారు. ఈ సంతోషాన్ని ప్ర‌ధాని మోడీ మీడియా ముందు కూడా పంచుకున్నారు. “ఈ సారి పార్ల‌మెంటు స‌మావేశాలు ప్ర‌త్యేకం.” అంటూ ప్ర‌ధాని చెప్పుకొచ్చారు. అంద‌రూ స‌హ‌క‌రించాలని య‌ధావిధిగా చెప్పుకొచ్చారు. ఇక‌, ఇత‌ర బీజేపీ నేత‌లు, కేంద్ర మంత్రులు కూడా మిఠాయి డ‌బ్బాల‌తో స‌భ‌లోకి అడుగులు వేయ‌డం గ‌మ‌నార్హం. వారి ఉద్దేశం మ‌హా విజ‌యాన్ని స‌భ్యులంద‌రితోనూ పంచుకోవాల‌ని. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ కూట‌మి మ‌హా వికాస్ అఘాడీ నేత‌ల‌ను ఎద్దేవా చేయ‌డం! మొత్తానికి స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డి గెలుచుకున్న మ‌హారాష్ట్ర విజ‌యాన్ని పార్ల‌మెంటులో త‌నివి తీరా ఆస్వాదించాల‌ని వ‌చ్చారు.

కానీ, ఇక్క‌డే క‌మ‌ల నాథుల‌కు పెద్ద ఇబ్బంది ఎదురైంది. వారి మ‌హా ఆనందాన్ని, ఉత్సాహాన్ని స‌మూలంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మింగే సింది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని సంభ‌ల జిల్లాలో చోటు చేసుకున్న కాల్పులు, అల్ల‌ర్ల ఘ‌ట‌న‌లో సోమ‌వారం ఉద‌యానికి 50 మందికి పైగా ప్ర‌జ‌లు మ‌ర‌ణించారు. వంద‌ల మంది తీవ్ర గాయాల‌తో అక్క‌డ ఆసుప‌త్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో ఈ విష‌యం పైనే కాంగ్రెస్ స‌హా ప్ర‌తిప‌క్షాలు అడుగ‌డుగునా లేవనెత్తాయి. “జ‌న‌గ‌ణ‌మ‌న‌” అంటూ స‌భ ప్రారంభం అవుతూనే.. కాంగ్రెస్ స‌భ్యులు ఇరు స‌భ‌ల్లోనూ.. “యూపీ మార‌ణ‌హోమం.. ఈ బాధ్య‌త బీజేపీదే” అంటూ బిగ్గ‌ర‌గా అరుస్తూ.. నినాదాల‌తో స‌భ‌ను హోరెత్తించారు. ఇలా ఐదు నుంచి 10 నిమిషాలు సాగిందో లేదో..ఇక‌, స‌భ‌లో త‌మ ఆనందానికి అవ‌కాశం లేద‌నుకున్న బీజేపీ స‌భ్యులు స‌భ వాయిదా కోరుకున్నారు. ఆ వెంట‌నే ఇరు స‌భ‌లు కూడా బుధ‌వారానికి వాయిదా ప‌డ్డాయి.

ఏంటీ యూపీ వివాదం..?

యూపీలోని సంభ‌ల్‌లో ప్ర‌ఖ్యాత జామా మ‌సీదు ఉంది. దాదాపు ఆరేడు ద‌శాబ్దాలుగా ఇక్క‌డ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇది రాష్ట్రంలోనూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. ఉత్త‌రాది మ‌క్కాగా దీనిని పిలుచుకుంటార‌ట‌! అలాంటి చోట‌.. గ‌తంలో “హ‌రిహ‌ర మందిరం” ఉండేదంటూ.. కొంద‌రు స్థానిక‌ కోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్ల‌పై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. ‘అస‌లు అక్క‌డ ఏముందో తేల్చండి’ అంటూ పురావ‌స్తు అధికారుల‌ను ఆదేశించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.

అంతే.. ఒక్క పెట్టున‌.. ఎక్క‌డెక్క‌డ నుంచో త‌ర‌లి వ‌చ్చిన‌.. వారు అధికారులు, పోలీసుల‌పై విరుచుకుప‌డ్డారు. రాళ్ల వ‌ర్షం కురిపించారు. ఈ క్ర‌మంలో పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో.. అప్ప‌టిక‌ప్పుడు ముగ్గురు చ‌నిపోగా.. వంద‌ల మంది గాయ‌ప‌డ్డారు. ఈ తొక్కిస‌లాట‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌రో 50 మంది సోమ‌వారం మృతి చెందారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశాన్ని, పార్ల‌మెంటును కూడా కుదిపేస్తుండ‌గా.. బీజేపీకి మ‌హా ఆనందాన్ని దూరం చేసింది.

This post was last modified on November 26, 2024 10:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివేకా మ‌ర్ద‌ర్: డీఎస్పీ స‌హా అధికారుల‌పై కేసులు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు లో తాజాగా…

9 minutes ago

జాంబిరెడ్డి – 2 : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాదా?

గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…

12 minutes ago

ఏందిది మ‌ల్లన్నా.. స్వ‌ప‌క్షంలో విప‌క్షమా?

మాట‌ల మాంత్రికుడు.. సోష‌ల్ మీడియాలో దుమ్మురేపి.. ప్ర‌స్తుతం ప్ర‌జాప్ర‌తినిధిగా శాస‌న‌ మండ‌లిలో ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న త‌న వాయిస్ ద్వారా…

15 minutes ago

ఆమె లేకుండా మంగళవారం – 2?

‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…

1 hour ago

నెరవేరిన కల..విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు

విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…

1 hour ago

ట్రంప్ న్యూ ట్విస్ట్: గాజా భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…

1 hour ago