Political News

పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టాలి.. ఏం చేస్తారో తెలీదు.. టీడీపీ మాస్ట‌ర్ ప్లాన్‌

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు ఎప్పుడు ఎలా తెర‌మీదికి వ‌స్తారో తెలియ‌దు. అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే. ఈ విష‌యంలో చంద్ర‌బాబు అదే వైఖ‌రిని అవ‌లంబిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల కాలంలో టీడీపీ ప్ర‌ధానంగా టార్గెట్ చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌ల‌ను రాజ‌కీయంగా వాడుకున్న చంద్ర‌బాబు వాటి వెనుక మంత్రి పెద్దిరెడ్డి ఉన్నార‌ని ప‌దే ప‌దే ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కుమారుడు, వైసీపీ ఎంపీ.. మిథున్‌రెడ్డి స‌హా పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టేలా చంద్ర‌బాబు వ్యూహం సిద్ధం చేసుకున్నార‌ని అంటున్నారు.

తాజాగా పార్ల‌మెంట‌రీ పార్టీ జిల్లాల‌కు అధ్య‌క్షుల‌ను నియ‌మించిన చంద్ర‌బాబు.. అటు క‌డ‌ప జిల్లాలోనే ఉన్న‌ప్ప‌టికీ.. చిత్తూరులోని కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు వ‌చ్చే రాజంపేట విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. రాజంపేటలో పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి.. వ‌రుస విజ‌యాల‌తో దూకుడు చూపిస్తున్నారు. ఈయ‌న‌కు చెక్ పెట్ట‌డం ద్వారా పెద్దిరెడ్డిని టార్గెట్ చేయొచ్చ‌ని.. బాబు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. రాజంపేట‌ పార్ల‌మెంట‌రీ జిల్లా ఇంచార్జ్‌గా రెడ్డెప్ప‌గారి శ్రీనివాస‌రెడ్డిని చంద్ర‌బాబు నియ‌మించారు. వాస్త‌వానికి శ్రీనివాస‌రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కూడా ప‌నిచేశారు.

2014 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఆయనే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక‌, శ్రీనివాస్ తండ్రి రాజగోపాల్‌రెడ్డి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన సోదరుడు ఆర్‌.రమేష్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంత హిస్ట‌రీతో పాటు.. నియోజ‌క‌వర్గం ప‌రిధిలోనూ.. ఆయ‌న‌కు మంచి ప‌లుకుబ‌డి ఉన్న‌మాట వాస్త‌వ‌మే. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌ రాయుడు వంటి సీనియర్ నేత‌లను క‌లుపుకొని పోతే.. శ్రీనివాస‌రెడ్డికి వ్యూహం క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, చిత్తూరు జిల్లాలో మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజక వర్గాల ఇన్‌చార్జీలను కూడా కలుపుకొని పోతే.. బాబు వ్యూహం స‌క్సెస్ అయ్యే అవ‌కాశం ఉంది. కానీ, అసంతృప్తుల జాబితా ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో శ్రీనివాస్ ఏమేర‌కు విజ‌యం సాధిస్తారు? అనేది మాత్రం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో!!

This post was last modified on October 5, 2020 10:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago