అమలాపురం మాజీ ఎంపీ.. సీనియర్ నాయకుడు, ఎస్సీ నేత.. జీవీ హర్షకుమార్ రాజకీయాలపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. పొలిటికల్ సర్కిళ్లలో మరోసారి ఆయన చర్చ నీయాంశంగా మారారు. ఒకప్పుడు కాంగ్రెస్ టికెట్‌పై అమలాపురం నుంచి రెండు సార్లు విజయం సాధించారు హర్షకుమార్. 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఎంపీగా విజయం సాదించారు. అప్పటి కీలక నాయకుడు వైఎస్‌కు అనుంగు అనుచరుడిగా కూడా హర్షకుమార్ పేరు తెచ్చుకున్నారు. తర్వాత.. రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు.
ఆ పార్టీ తరఫున 2014లో అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. నిజానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న హర్షకుమార్.. విజయం సాధించాలని అందరూ అనుకున్నారు. పైగా సమైక్య ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా ఇక్కడ ఓట్లు కూడా పడతాయని అనుకున్నారు. కానీ, కేవలం 9 వేల ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. ఇక, జై సమైక్యాంధ్ర పార్టీ కూడా పూర్తిగా ఎత్తేయడంతో హర్షకుమార్.. సైలెంట్ అయ్యారు. తర్వాత కాలంలో టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారని స్థానికంగా ప్రచారం సాగింది.
కానీ, దీనికన్నా ముందుగా వైసీపీ నుంచి హర్షకుమార్‌కు ఆహ్వానం అందింది. కానీ, ఆయన దూకుడుతో వైసీపీ నాయకులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత.. టీడీపీకి చేరువైన హర్షకుమార్.. గత ఏడాది ఎన్నికల్లో అమలాపురం టికెట్‌ను ఆశించారు. కానీ, చంద్రబాబు ఈ టికెట్‌ను దివంగత స్పీకర్ మోహనచంద్ర బాలయోగి కుమారుడికి ఇచ్చి.. సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడ్డాక.. మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ, హర్షకుమార్ మాత్రం.. దీనికి ససేమిరా అన్నారు. ఈ క్రమంలో అటు వైసీపీకి, ఇటు టీడీపీకి కూడా దూరంగానే ఉన్నారు.
వాస్తవానికి ఆయనను చేర్చుకుని, ఆయనను ఇముడ్చుకునే అవకాశం ప్రాంతీయ పార్టీలకు లేకే ఆయా పార్టీలు దూరం పెట్టాయని అంటారు పరిశీలకులు. ఇక, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్తానని ఆయన ప్రకటించారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్‌కు నాయకులు కావాలి. పైగా ఘర్ వాపసీ మంత్రాన్ని పఠిస్తున్న నేపథ్యంలో హర్షకుమార్ వంటి కీలక నాయకులు, ఫైర్ బ్రాండ్లు చాలా అవసరం ఉంది. అయితే, హర్షకుమార్ తాను తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్తానని ప్రకటించి 24 గంటలు గడిచినా.. ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం. ఏదేమైనా.. హర్షకుమార్ ఆలోచించి అడుగులు వేయాలని అంటున్నారు అమలాపురం ప్రజలు.
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…