ఎస్సీ వర్గీకరణకు సంబంధించి టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ను అనుసరించి.. దేశవ్యాప్తంగా ఎస్సీల రిజర్వేషన్‌కు సంబంధించి వర్గీకరణ చేయాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఈ వర్గీకరణను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి కమిటీ కూడా వేశారు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. అనేక కోణాల్లో దీనిపై చర్చలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణకు, ఏపీకి మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉండడంతో ఇది సంక్లిష్టంగా మారింది.
కూటమి పార్టీల మధ్య ఈ విషయంపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చివరకు ఈ విషయంలో ప్రధాన పాత్రను టీడీపీకే అప్పగించడంతో సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణపై దృష్టి పెట్టారు. జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నిర్ణయించారు. తద్వారా.. ఎలాంటి సమస్య ఉండబోదని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభాను పరిశీలిస్తే.. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో మాల లు ఎక్కువగా ఉన్నారు. మరికొన్న ఇజిల్లాల్లో మాదిగలు ఎక్కువగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా అమలు చేస్తే.. ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీంతో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన వెసులుబాటు మేరకు రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు.. సంబంధిత ఎస్సీ ఎమ్మెల్యేలు, మంత్రులతోనూ సీఎం చంద్రబాబు దీనిపై చర్చలు పూర్తి చేశారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా కాకుండా.. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని ముందుకు సాగడం మంచిదని నిర్ణయించారు.
తద్వారా.. మాలలు ఎక్కువగా ఉన్న చోట్ల వారికి అనుకూలంగా.,.. మాదిగలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వారికి అనుకూలంగా రిజర్వేషన్ వర్గీకరణ చేయనున్నారు. అయితే.. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని.. గతంలో ఉన్న రిజర్వేషన్లనే అమలు చేయనున్నారు. జిల్లాలస్థాయిలో మాత్రం మాదిగలకు, మాలలకు ఈ వర్గీకరణ ద్వారా అన్యాయం జరగకుండా చూడాలన్నది కీలక ఉద్దేశం. మొత్తానికిఇది సక్సెస్ అయితే.. పెద్ద ప్రయోజనం జరగనుంది.
This post was last modified on November 8, 2024 6:44 pm
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…