బాబాయ్ అశోక్ గజపతిరాజుపై ట్విట్టర్ వేదికగా సంచైతా గజపతిరాజు ఫుల్లుగా ఫైర్ అయ్యారు. మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలోని ఎంఆర్ కాలేజి వివాదంలోకి ట్రస్టును అనవసరంగా లాగుతున్నారంటూ ట్రస్టు ఛైర్ పర్సన్ మండిపోయారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ట్రస్టు ఆధ్వర్యంలో ఎయిడెడ్ హోదాలో ఎంఆర్ కాలేజి నడుస్తోంది. ఈ కాలేజికి సుమారు 150 సంవత్సరాల చరిత్రుంది. విద్యార్ధుల అడ్మిషన్లు, రిజల్ట్స్ విషయంలో కూడా మంచి ట్రాక్ రికార్డు కూడా ఉందని సమాచారం.
దశాబ్దాల నుండి కాలేజీకి ఉన్న ఎయిడెడ్ హోదాను అన్ ఎయిడెడ్ గా మార్చాలంటూ ట్రస్టు తరపున ప్రభుత్వానికి లేఖ వెళ్ళింది. ఎయిడెడ్ విద్యాసంస్ధ అంటే అందులోని సిబ్బంది జీతబత్యాలను ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి విద్యాసంస్ధకు ఆర్ధికభారం చాలా వరకు తగ్గిపోతుంది. అందుకనే ప్రైవేటు మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ప్రారంభమైన విద్యాసంస్ధలను ఎయిడెడ్ గా మార్చేందుకు యాజమాన్యాలు నానా అవస్తలు పడుతుంటాయి.
అయితే ఎంఆర్ కాలేజి విషయంలో ట్రస్టు ఉల్టాగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఎప్పుడైతే ట్రస్టు తరపున ప్రభుత్వానికి లేఖ వెళ్ళిందని బయటపడిందో వెంటనే అశొక్ గజపతిరాజుతో పాటు టీడీపీ నేతల సంచైతపై తీవ్రమైన ఆరోపణలు మొదలుపెట్టేశారు. ఇదే విషయమై సంచైత తన బాబాయ్ పై ఫుల్లుగా ఫైర్ అయిపోయారు. ఎయిడెడ్ కాలేజీని అన్ ఎయిడెడ్ గా మార్చాలని ట్రస్టు తరపున లేఖ వెళ్ళలేదంటూ క్లారిటి ఇచ్చారు. కాలేజీ ఎయిడెడ్ హోదాను 2017 లో తన బాబాయ్ ఛైర్మన్ గా ఉన్నపుడే ప్రభుత్వానికి సరెండర్ చేసినట్లు స్పష్టం చేశారు.
తన బాబాయ్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు కంటిన్యు అవుతోంది కానీ కొత్తగా తాను చేసిందేమీ లేదన్నారు. మరి సంచైత చెబుతున్నదే నిజమైతే అప్పట్లో ఎయిడెడ్ హోదాను సరెండర్ చేస్తు అశోక్ రాసిన లేఖను బయటపెడితే సరిపోతుంది కదా. ట్రస్టు తరపున ప్రభుత్వానికి లేఖ వెళ్ళిందంటే దానికి సంబంధించిన ఫైలు, ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలు కచ్చితంగా ట్రస్టు ఆఫీసులో ఉంటాయి కదా. వాటిని బయటపెడితే మళ్ళీ టీడీపీ నేతలు నోరెత్తే అవకాశం కూడా ఉండదన్న విషయాన్ని సంచైత మరచిపోయారా ? కాబట్టి సంబంధిత డాక్యుమెంట్లను ఛైర్ పర్సన్ బయటపెడితే వివాదానికి ముగింపు పలికినట్లవుతుంది.
This post was last modified on October 3, 2020 2:23 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…