ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్-2024’ సదస్సులో పాల్గొన్న నారా లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయి కీలక విషయాలు చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అట్లాంటాలో లోకేష్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల అన్నగారి విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, కాకర్ల సురేష్, గాలి భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ పై లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ లో ఆల్రెడీ రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని, మూడో చాప్టర్ ఓపెన్ కావాలంటే వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్టపడాలని లోకేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని, ఆ విషయంలో తగ్గేదేలే అని లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కొడాలి నాని, వల్లభనేని వంశీలను ఉద్దేశించి రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ చేస్తానని లోకేష్ పరోక్షంగా వ్యాఖ్యానించారని నెటిజన్లు అంటున్నారు.
ఇక, తాను యువగళం పాదయాత్ర సందర్భంగా గన్నవరం సభలో ఇచ్చిన హామీలు గుర్తున్నాయని, వాటి అమలులో ఎటువంటి సందేహం అవసరం లేదని లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం అరాచకాలకు తాను కూడా ఒక బాధితుడినేనని, పాదయాత్రలో తనకు ఎన్నో ఇబ్బందులు కలిగించారని, ఆ సమయంలో తనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. కానీ, ఆ రోజు రెడ్ బుక్ అంటుంటే జగన్ పట్టించుకోలేదని, ఇపుడు రెడ్ బుక్ కు భయపడుతూ గుడ్ బుక్ తెస్తానని జగన్ చెబుతున్నారని, చివరకు నోట్ బుక్ లో ఏం రాయాలో అర్థం కాక జగన్ తికమక పడుతున్నారని సెటైర్లు వేశారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాలో ఎంతోమందిని కలిశానని, ఈ సభ సూపర్ కిక్ ఇచ్చిందని చెప్పారు. రెడ్ బుక్ తో పాటు పెట్టుబడులు కూడా ఉంటేనే రాష్ట్రం ముందుకు వెళుతుందని తెలిపారు. ఎన్నారైలు అని అందరూ అంటుంటారని, కానీ తాను మాత్రం మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ ‘ఎంఆర్ఐ’ అంటానని లోకేష్ ఎన్నారైలపై ప్రశంసలు కురిపించారు. ఉపాధి కోసం అమెరికాకు వచ్చిన వారందరి ఆలోచన ఏపీ అభివృద్ధి పై ఉందని కొనియాడారు.
This post was last modified on %s = human-readable time difference 3:02 pm
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి నాలుగు మాసాలు అయింది. అయితే… వచ్చిన తొలినాళ్లలో చేయాలనుకున్న పనులను కొంత లేటుగా ప్రారంభించేవారు.…
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఈమధ్య మరింత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’లో నటిస్తున్నాడు.…
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం ధరలకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బీరు…
కొత్త ఆర్థిక, వినియోగ నియమాలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ),…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు ఎన్‌వీఎస్ ఎస్…
మాస్ హీరో గోపిచంద్ ఇటీవల విశ్వం సినిమాతో మరో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. అప్పుడెప్పుడో ‘లౌక్యం’తో కమర్షియల్ గా సక్సెస్…