ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగానే సెగ తగులుతున్నట్టుగా ఉంది. దీంతో ఆయన సరిచేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. ముఖ్యంగా మూడు విషయాల్లో చంద్రబాబుకు ఇబ్బందులు వస్తున్నాయి. అది కూడా ఒక్క మద్యం విషయంలోనే కావడం గమనార్హం. దీంతో వెంటనే అలెర్ట్ అయిన చంద్రబాబు చర్యలకు దిగారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం విధానాన్ని రద్దు చేసి.. ప్రైవేటు మద్యం విధానాన్ని తీసుకువచ్చిన తర్వాత.. అనేక ఆరోపణలకు వేదిగా ఈ నూతన మద్యం విధానం నిలబడింది. ప్రధానంగా తమ్ముళ్ల ప్రమేయం ఎక్కువగా ఉండడం గమనార్హం.
పదే పదే ఈ విషయంపై చంద్రబాబు తమ్ముళ్లను హెచ్చరించారు. మద్యం విషయంలో జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారు. అయినా.. తమ్ముళ్లు వినిపించుకోలేదు. దీనికితోడు.. వ్యాపారం ప్రారంభించి.. పట్టుమని పది రోజులు కూడా కాకముందే.. తణుకు, తుని తదితర నియోజకవర్గాల్లో బెల్టు షాపులు తెరమీదికి రావడం మరో ఇబ్బందిగా మారింది. ఇలా వెలుగు చూడగానే.. అలా సోషల్ మీడియాలో ఈ బెల్టు షాపులపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పలుపత్రికల్లోనూ కథనాలు కూడా వచ్చాయి. ఈ పరిణామం సర్కారుకు సెగ పెట్టేలా తయారైంది.
ఇక, గుంటూరు, విజయవాడ, విశాఖ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మద్యం ధరలు ఆకాశానికి ఎగబాకాయి. సర్కారు ముందుగానే చెప్పినట్టు మద్యం బాటిళ్లను ఎంఆర్‌పీకి విక్రయించాల్సి ఉన్నా.. స్థానికంగా ఉన్న రాజకీయ వివాదాలు.. నేతల జోక్యంతో పెరిగిపోయిన వాటాల కారణంగా.. క్వార్టర్ బాటిల్‌పై 10-15 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. ఇక, ఫుల్లు బాటిల్‌పై 40-50 రూపాయలు(రౌండ్‌గా ఏది ఎక్కువ ఉంటే అది. ఉదాహరణకు 260 ఉంటే 40 కలిపి.. 300) తీసుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో మందు బాబులు ఆధారాలతో సహా చూపించి నానా రచ్చ చేస్తున్నారు.
ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నా.. సర్కారుకు మాత్రం సెగ పెంచుతున్నాయి. అంటే.. బెల్టు షాపులు ఒకవైపు, ఎంఆర్ పీ కంటే ఎక్కువగా విక్రయించడం మరోవైపు, తమ్ముళ్ల వాటాలు ఇంకోవైపు.. ఇలా మూడు రకాలుగా నూతన మద్యం పాలసీ.. నానా కష్టాలు పడుతోంది. దీనిపై స్పందించిన చంద్రబాబు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్ పీ కంటే ఎక్కువకు అమ్మితే దుకాణ దారులపైనే చర్యలు తీసుకునే అధికారులు ఇచ్చారు. రూ.5 లక్షల జరిమానా విధించాలన్నారు. ఇక, వాటాలు అడిగినట్టు తేలిన తమ్ముళ్లపై పార్టీపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. మరి ఈ చర్యలు ఏమేరకు.. సక్సెస్ అవుతాయో చూడాలి.
This post was last modified on October 29, 2024 3:23 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…