వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ట్రెండ్ అమల్లోకి తీసుకొచ్చింది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నంత కాలం జరిగిన పార్టీ ఫిరాయింపులు అందరికీ తెలిసిందే. అప్పట్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను నేరుగా తెలుగుదేశంపార్టీలోకి లాగేసుకున్నారు. ఈ విషయంలో అప్పట్లో వైసిపి ఎంత గగ్గోలు పెట్టిందో అందరు చూసిందే. కాలం ఐదేళ్ళు గడిచేసరికి సీన్ రివర్సయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. అయితే, కాస్త మార్పులు చేసి అమలు చేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో టీడీపీ ఎంఎల్ఏలను ఎవరినీ నేరుగా వైసిపిలోకి చేర్చుకోలేదు. కాకపోతే తెలుగుదేశంపార్టీలో తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏలు పార్టీకి రాజీనామాలు చేయటం లేకపోతే సస్పెండ్ అయిన తర్వాత వైసిపికి మద్దతుగా నిలబడుతున్నారు. మొదటగా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. దాంతో అయన వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. తర్వాత గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్ కూడా ఇదే దారిలో టీడీపీలో నుండి బయటకు వచ్చేశారు.
తర్వాత వంతు చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్. అయితే ఇక్కడే కొద్దిమార్పులు జరిగాయి. ఆయన నేరుగా వైసీపీతో చేతులు కలపకుండా తన కొడుకు వెంకటేష్ తో పాటు మద్దతుదారులను మాత్రం వైసిపిలోకి తోసారు. అంటే పరోక్షంగా కరణం కూడా వైసీపీలో చేరిపోయినట్లే. ఇదే రూటులో తర్వాత వైజాగ్ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కుమార్ నడిచారు. ఈయన కూడా తాను అధికారపార్టీలో చేరకుండా తన కొడుకు, మద్దతుదారులను పార్టీలోకి పంపారు. తర్వాత జరిగిన పరిణామాల్లో తాను కూడా వైసీపీలో చేరినట్లు ఆయనే ప్రకటించుకున్నారులేండి.
ఇపుడు మరో ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు వంతొచ్చింది. ఈనెల 3వ తేదీ అంటే శనివారం నాడు తన కొడుకు రవితేజను వైసిపిలోకి జాయిన్ చేస్తున్నట్లు సమాచారం. అసలు గంటాయే వైసిపిలో చేరాలని తెగ ప్రయత్నాలు చేశారు. కానీ ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలు ఎదురవుతుండటంతో చేరిక వాయిదాపడుతోంది. ఈ ప్రయత్నాలతో లాభం లేదనుకున్నట్లున్నాడు గంటా. అందుకనే ముందుగా తన కొడుకును పార్టీలోకి పంపుతున్నారు. ఇందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
అమరావతిలో ఇప్పటికే ఇందుకు ఏర్పాట్లు కూడా అయిపోయాయట. కొడుకు వైసిపిలో చేరిపోతే తర్వాత తాను కూడా అధికారపార్టీలోకి చేరిపోవటం పెద్ద కష్టం కాదన్నది గంటా ఆలోచనగా అర్ధమవుతోంది. అంటే ముందు వారసులను అధికారపార్టీలోకి పంపేస్తే తర్వాత తాము కూడా ఫాలో అవ్వచ్చన్నదే కొత్త ట్రెండుగా కనబడుతోంది.
This post was last modified on October 2, 2020 2:52 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…