తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, బీఆర్ఎస్ పార్టీ రథసారథి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఉప్పు-నిప్పు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయిన విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు.
ఈ ఇద్దరు నేతలు ఇరు రాష్ట్రాల సీఎంలుగా ఉండగా ఆ పార్టీ నేతలు సైతం అదే రీతిలో స్పందించే వారు. ఇందులో గులాబీ దళపతి కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టాప్ లో ఉండేవారు.
అయితే, తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటికీ అదే తరహా కామెంట్లను కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుపై చేస్తుండటం ఆసక్తికరమని తాజా పరిణామాలపై పలువురు కామెంట్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ గురించి, తెలంగాణలో ప్రస్తుత పరిపాలన గురించి, ఏపీ దేశ రాజకీయాల గురించి సైతం కేటీఆర్ స్పందించారు.
కాంగ్రెస్ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని నమ్మబలికి 300 రోజులైనా ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీల కన్నా గొప్పగా పనిచేసిందని తెలిపారు.
అయితే, పదేళ్లు పాలించిన ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకతే తమకూ ఎదురైందని, దీనికి తోడు సోషల్‌మీడియాలో అదేపనిగా విమర్శలు వెల్లువెత్తిందని కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఓటమి కారణాలపై సమీక్షించుకున్నామని కేటీఆర్ పేర్కొంటూ ప్రజలు మరోసారి కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లను కేటీఆర్ తప్పుపట్టారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకోవటం అసంబద్ధమైన విధానమని కేటీఆర్ పేర్కొన్నారు. జనాభాను పెంచుకోవాలనే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
ప్రస్తుత జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతులే లేని పరిస్థితి ఉన్నదని, ముందుగా వాటిని కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు. జనాభా నియంత్రణపై దక్షిణ భారతదేశానికి స్పష్టమైన అవగాహన ఉన్నదని చెప్పారు. జనాభా తగ్గించుకుని క్రమశిక్షణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలకు డీలిమిటేషన్ పేరుతో నష్టం చేయడం అన్యాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై సైతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతల ఫోన్‌లను కూడా రేవంత్‌రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రాష్ట్రంలో మంత్రుల ఫోన్లు.. మా ఫోన్లు ట్యాప్ చేయటం లేదని చెప్పాలి.. కెమెరాల ముందు ఓపెన్‌గా లైడిటెక్టర్ పరీక్షకు రావాలి’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్‌కు దమ్మూ ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించి ఫోన్లు ట్యాప్ చేయటం లేదని చెప్పాలని డిమాండ్ చేశారు.
This post was last modified on October 26, 2024 7:59 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…