Movie Reviews

సమీక్ష – రాయన్

తమిళ హీరోనే అయినప్పటికీ ధనుష్ కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా రఘువరన్ బిటెక్ తర్వాత ఇతనికంటూ ఇక్కడ అభిమానులు వచ్చారు. ఆ తర్వాత వచ్చిన వాటిలో అధిక శాతం ఫెయిల్యూర్స్ కావడంతో క్రమంగా మార్కెట్ తగ్గుతూ వచ్చిన సార్ బ్లాక్ బస్టర్ కావడంతో తిరిగి పుంజుకున్నాడు. నేనే వస్తున్నా, కెప్టెన్ మిల్లర్ లు అంచనాలు అందుకోకపోయినా రాయన్ మీద ఆసక్తి కలగడానికి కారణం అతని స్వీయ దర్శకత్వం. తమిళ తెలుగు భాషల్లో ఇవాళ ఒకేసారి రిలీజైన రాయన్ మెప్పించేలా ఉన్నాడా

కథ

చిన్నప్పుడే తల్లితండ్రులు దూరమైన కార్తవరాయన్ (ధనుష్) తమ్ముళ్లు ముత్తువేల్ (సందీప్ కిషన్), మాణిక్యవేల్ (కాళిదాస్ జయరాం) లతో పాటు చెల్లి దుర్గ (దషారా విజయన్) ని ప్రాణంగా చూసుకుంటూ పెంచి పెద్ద చేస్తాడు. మొబైల్ క్యాంటీన్ నడుపుకునే రాయన్ గొడవలకు దూరంగా తన మానాన తనకు వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ముత్తువేల్ వల్ల పలు సమస్యలు ఎదురై లోకల్ గూండా సేతు (ఎస్జె సూర్య) తో శత్రుత్వం పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కుటుంబం మొత్తం రిస్కులో పడుతుంది. దుర్గకు పెళ్లి కుదిరిన సమయంలో రాయన్ కత్తి పట్టాల్సి వస్తుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది, చివరికి అతని గమ్యం ఎటు వెళ్లిందనేది స్టోరీ

విశ్లేషణ

ఒకవైపు నటిస్తూనే మరోవైపు దర్శకత్వమనే క్లిష్టమైన బాధ్యతను నిర్వహించడం చాలా కష్టం. గతంలో ఎన్టీఆర్, కృష్ణ లాంటి వాళ్ళు దీన్ని విజయవంతంగా చేసి చూపించారు. ధనుష్ కూడా డైరెక్షన్ డెబ్యూ పా పాండితో ఋజువు చేసుకున్నా అటుపై చాలా గ్యాప్ తీసుకున్నాడు. స్టోరీగా చూస్తే రాయన్ లో కొత్తదనం ఏమీ లేదు. మొదలైన కాసేపటికే కథ ఎటు పోతుందో సులభంగా ఊహించేలా జరుగుతుంది. వెట్రిమారన్ తో పలుమార్లు పని చేసిన అనుభవం వల్ల ధనుష్ మీద ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. చాలా ఫ్రేమ్స్ ని అతనిలా తీర్చిదిద్ధేందుకు పడిన తాపత్రయం గమనించివచ్చు. కానీ అంత బలమైన కంటెంట్ రాయన్ లో లేకపోవడం మైనస్.

రాయన్ పాత్ర పరిచయం, తమ్ముళ్ల నేపథ్యం, స్థానిక గూండా రాజకీయాలు వీటిని మెల్లగా రిజిస్టర్ చేస్తాడు. నెమ్మదిగా సాగినా సరే వాటిలో ఉన్న డెప్త్ మరీ విసుగు రాకుండా కాపాడాయి. చైల్డ్ ఎపిసోడ్ లో చెల్లి కోసం ఏమైనా చేసే అన్నగా రాయన్ ని రిజిస్టర్ చేసిన ధనుష్ ఆ తర్వాత ఇద్దరు తమ్ముళ్ల క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడంతో దుర్గతో బాండింగ్ అంతగా కనెక్ట్ కాలేకపోయింది. దీని వల్ల రెండో సగంలో ఆమె తాలూకు కీలక ట్విస్టుని హ్యాండిల్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. దానికి తోడు ఇంటర్వెల్ దాకా ఏదీ ఊహాతీతంగా జరగదు. మెయిన్ విలన్ ఎస్జె సూర్య అక్కడి దాకా చేయడానికి ఏమీ లేక నిస్సహాయుడిగా మిగిలిపోవడం ప్రభావాన్ని తగ్గించింది.

విశ్రాంతి తర్వాత అసలు డ్రామాని మొదలుపెట్టిన ధనుష్ సేతు క్యారెక్టర్ ద్వారా ప్రతీకారాన్ని కావాల్సిన ఒక థీమ్ అయితే సృష్టించాడు కానీ దాన్ని నిలబెట్టేందుకు బలమైన సెటప్ మాత్రం రాసుకోలేకపోయాడు. దీని వల్ల విడివిడిగా సన్నివేశాలు బాగానే అనిపిస్తున్నా కలిపి చూస్తే మాత్రం సాధారణంగా కనిపిస్తాయి. ముత్తువేల్, మాణిక్యవేల్ తాలూకు కీలక మలుపు కూడా పెద్దగా షాక్ అనిపించదు. పైగా అక్కడ నాటకీయత ఎక్కువైపోవడంతో సోసోగా నడుస్తుంది. రాయన్, సేతుల మధ్య క్లాష్ కు సరిపడా ఎంగేజింగ్ ఎపిసోడ్స్ లేకపోవడం రాయన్ కథనంలోని పెద్ద బలహీనత. రాయన్ ని మట్టుబెట్టేందుకు, కట్టడి చేసేందుకు సేతు వేసే స్కెచ్చులు జమానా కాలం నాటివి.

అసలు కాంఫ్లిక్ట్ ని దుర్గతో ముడిపెట్టడం బాగానే ఉంది కానీ అది కూడా సరైన రీతిలో సాగక ఎగుడుదిగుడుగా సాగుతుంది. వీక్ అనిపించే ఎన్నో సీన్లు ఏఆర్ రెహమాన్ వల్ల ఎలివేట్ అయ్యాయి కానీ లేదంటే డ్యామేజ్ మరింత పెరిగేది. యాక్షన్ లవర్స్, రివెంజ్ డ్రామాలను విపరీతంగా ఇష్టపడే వాళ్ళను ధనుష్ ఒక టెక్నీషీయన్ గా అక్కడక్కడా మెప్పిస్తాడు కానీ సామాన్య ప్రేక్షకుడు మాత్రం అంతగా ఏముందబ్బా అని ప్రశ్నించుకునేలా స్క్రీన్ ప్లే నడిపించాడు. క్లైమాక్స్ లో వచ్చేది ఊహించేలా ఉంటుంది. రాయన్ చిన్నతనంలో జరిగిందే మళ్ళీ అతని మధ్య వయసు జీవితంలోనూ మొదలైందనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం ఓ మాదిరిగానే ముగిసింది.

ధనుష్ లోని యాక్టర్ ని హ్యాండిల్ చేయడంలో ధనుష్ లోని దర్శకుడు పడిన తడబాటు వల్ల రాయన్ ఎలాంటి ప్రత్యేకత లేకుండా ఒక మాములు గ్యాంగ్ స్టర్ డ్రామాగా మిగిలిపోయింది. ముందే ప్రిపేరైపోయి ఎలాంటి సర్ప్రైజులు ఆశించకుండా, ఒకింత నిరాశ పడేందుకు కూడా ముందే సిద్ధపడితే జస్ట్ ఓకే అనిపిస్తాడు. అలా కాకుండా వడ చెన్నై, అసురన్, కర్ణన్ చూసిన కళ్ళతో ఏవేవో ఊహించుకుంటే మాత్రం రాయన్ నుంచి ఎక్కువ ఆశించకపోవడం మంచిది. ఆర్టిస్టుల పెర్ఫార్మన్సులు, సాంకేతిక వర్గం అండదండలతో తమిళంలో పెద్దగా ఆడొచ్చేమో కానీ మహారాజా లాంటి వైవిధ్యమైన ప్రయత్నాలను ప్రోత్సహిస్తున్న తెలుగు ఆడియన్స్ ని మెప్పించడం కొంత డౌటే

నటీనటులు

ధనుష్ సీరియస్ లుక్స్ తో ఎక్కువ డైలాగులు లేకుండా నడిపించేశాడు. ఛాలెంజింగ్ అనిపించే రేంజ్ లో స్కోప్ దక్కలేదు కానీ ఉన్నంతలో మెప్పిస్తాడు. సందీప్ కిషన్ మాత్రం గుర్తుంటాడు. బాడీ లాంగ్వేజ్, సంభాషణలు తనకు కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఇచ్చాయి. ఎస్జె సూర్య విలనీ జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది. ఒకటి రెండు చోట్ల తప్పించి తన ముద్ర లేదు. ప్రకాష్ రాజ్ కు కొట్టిన పిండి లాంటి రొటీన్ పోలీస్ ఆఫీసర్ వేషం ఇచ్చారు. అపర్ణ బాలమురళి బొద్దు దేహంతో యాక్టింగ్ బాగా చేసింది. దూశారా విజయన్ సెకండాఫ్ లో చెలరేగింది. సెల్వ రాఘవన్ మంచి ఛాయస్. వరలక్ష్మి శరత్ కుమార్ ని స్వంత డబ్బింగ్ లేకుండా చూడటం వింతగా ఉంది.

సాంకేతిక వర్గం

ఏఆర్ రెహమాన్ నేపధ్య సంగీతం రాయన్ కు దన్నుగా నిలిచింది. ఎప్పుడూ వినని సరికొత్త సౌండ్స్ తో ఆయన చేసిన ప్రయోగాలు థియేటర్లో మంచి ఫీల్ తీసుకొచ్చాయి. పాటలు మాత్రం అంతంతమాత్రమే. ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం ఘాడతను బాగా ప్రెజెంట్ చేసింది. కాకపోతే డ్రోన్ షాట్స్ మరీ ఎక్కువనిపిస్తాయి. ప్రసన్న జికె ఎడిటింగ్ ఇంకొంచెం లెన్త్ తగ్గించాల్సింది. పీటర్ హెయిన్ పోరాటాలు బాగానే కుదిరాయి. డబ్బింగ్ సంభాషణలు పర్వాలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువల పరంగా సన్ పిక్చర్స్ నిరాశపరచలేదు. పరిమిత లొకేషన్లే అయినప్పటికి, వందల కోట్లు ఖర్చు పెట్టకపోయినా క్వాలిటీ తగ్గకుండా కోరినంత బడ్జెట్ ఇచ్చారు.

ప్లస్ పాయింట్స్

ధనుష్ పాత్ర
సందీప్ కిషన్ నటన
ఇంటర్వెల్ బ్లాక్
ఏఆర్ రెహమాన్ బీజీఎమ్

మైనస్ పాయింట్స్

పాత కథే
నెమ్మదిగా సాగే కథనం
కుదరని ఎమోషన్స్
సోసో రివెంజ్ డ్రామా

ఫినిషింగ్ టచ్ : కొత్త సీసాలో పాత సారా

రేటింగ్ : 2.5 / 5

This post was last modified on July 26, 2024 3:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇక‌, ‘అదానీ పార్ల‌మెంటు’.. నేటి నుంచి స‌మావేశాలు!

భార‌త పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ స‌మావేశాల్లోనే వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు స‌హా..…

13 mins ago

అదానీ లంచాలు.. జ‌గ‌న్ మౌనం రీజ‌నేంటి?

ఒక‌వైపు దేశాన్ని మ‌రోవైపు ప్ర‌పంచ దేశాల‌ను కూడా కుదిపేస్తున్న అంశం… ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌.. ప్ర‌పంచ కుబేరుడు.. గౌతం అదానీ…

2 hours ago

ఐపీఎల్ వేలంలో వీరికి భారీ షాక్

సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోన్న ఐపీఎల్-2025 ఆక్షన్ సందర్భంగా కొందరు క్రికెటర్లు కాసుల పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో మరికొందరు…

9 hours ago

కిస్ కిసిక్కు…ఊ అనిపిస్తుందా ఊహు అనిపిస్తుందా?

పుష్ప 1లో సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన…

9 hours ago

ఏది సాధించినా చెన్నైకే అంకితం – అల్లు అర్జున్

కనివిని ఎరుగని జనసందోహం మధ్య బీహార్ లో జరిగిన ఈవెంట్ బ్లాక్ బస్టరయ్యాక పుష్ప 2 తాజాగా చెన్నైలో జరిపిన…

10 hours ago

నాకు కాబోయేవాడు అందరికీ తెలుసు – రష్మిక

టాలీవుడ్ లో అత్యంత బిజీగా టాప్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే ముందు గుర్తొచ్చే పేరు రష్మిక…

10 hours ago