Movie Reviews

సమీక్ష – నా సామిరంగ

గత కొంత కాలంగా యాక్షన్ ఎంటర్ టైనర్ల వైపు మొగ్గు చూపించిన నాగార్జున దానికి తగ్గ ఫలితాలు అందుకోలేకపోవడంతో నిరాశలో ఉన్నఅభిమానులకు నా సామిరంగ మీద ముందు నుంచి మంచి ఆశలున్నాయి. షూటింగ్ ప్రారంభం కావడంలో ఆలస్యం జరిగినా పూర్తి చేయడంలో మాత్రం జెట్ స్పీడ్ చూపించారు. ఇలాంటి ప్రాజెక్టుకి డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేయడం ఆశ్చర్యపరిచినా ట్రైలర్ చూశాక ఒక్కసారిగా అంచనాల్లో మార్పొచ్చింది. మరి పండగని కోరి మరీ కోరుకున్న రంగ మెప్పించేలా ఉన్నాడా

కథ

నేపథ్యం 1988లో జరుగుతుంది. కోనసీమలో ఒక చిన్న గ్రామంలో కిష్టయ్య(నాగార్జున), అంజి(అల్లరి నరేష్) రక్తం పంచుకోకపోయినా అన్నదమ్ముల కన్నా ప్రేమగా పెరుగుతారు. ఇల్లు జఫ్తు కాకుండా కాపాడిన పెద్దయ్య(నాజర్)ను దేవుడిలా చూస్తుంటారు. పక్కూరి అమ్మాయిని ఇష్టపడి చిక్కుల్లో పడ్డ భాస్కర్(రాజ్ తరుణ్) వీళ్ళ స్నేహితుడు. చిన్నప్పటి నుంచే వరాలు(ఆశికా రంగనాథ్)ని ప్రేమించిన కిష్టయ్య ఆమె తండ్రి(రావు రమేష్) వల్ల పెళ్లి చేసుకోకుండా ఉన్న ఊళ్ళోనే దూరంగా గడిపేస్తాడు. పెద్దయ్య చిన్న కొడుకు దాస్ (షబ్బీర్) దుబాయ్ నుంచి వచ్చాక గొడవలు మొదలవుతాయి. ప్రశాంతంగా ఉన్న వీళ్ళ జీవితాల్లో అలజడి మొదలవుతుంది.

విశ్లేషణ

మలయాళం రీమేకులు ఈ మధ్య కత్తి మీద సాములా మారాయి. యధాతథంగా తీస్తే తేడా కొడుతుంది. మార్పులు చేస్తే ఒరిజినల్ ఫీల్ పోతోంది. గాడ్ ఫాదర్ తో మొదలుపెట్టి బుట్టబొమ్మ దాకా ఈ విషయంలో వర్కౌట్ కానివే ఎక్కువ. అందుకే పోరంజు మరియం జోస్ మీద విపరీతంగా మనసుపడ్డ నాగార్జున లేట్ అవుతున్నా సరే స్క్రిప్ట్ ని లాక్ చేయించేందుకు ఎక్కువ టైం తీసుకున్నారు. దర్శకుడు విజయ్ బిన్నీ మొదటిసారి తనకిచ్చిన దర్శకత్వ బాధ్యతను వీలైనంత మేర సిన్సియర్ గా చేసేందుకే ప్రయత్నించాడు. పాత్రల పరిచయంతో మొదలుపెట్టి ఇంటర్వెల్ బ్లాక్ ని డిజైన్ చేయడం వరకు ఎలాంటి రిస్కు చేయకుండా తనకిచ్చిన పేపర్ నే తెరకెక్కించేందుకు చూశాడు.

కిష్టయ్య, అంజిల స్నేహాన్ని రిజిస్టర్ చేసేదాకా మంచి ఫ్లో ఉంటుంది. వరాలు ఎంట్రీ, పెద్దయ్య కుటుంబ పరిచయం త్వరగా పూర్తి చేసి ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ మొదలుపెడతారో అక్కడి నుంచి కథనం అతి మాములుగా జరుగుతుంది. ఎందుకు విడిపోయారనే పాయింట్ సబబుగానే ఉంది కానీ ఆ ట్విస్టు జరిగే దాకా క్రమాన్ని వినోదాత్మకంగా చెప్పి ఉంటే బాగుండేది. ఎంతసేపూ నాగ్ ని రొమాంటిక్ గా చూపించడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడంతో లవ్ ట్రాక్ మొత్తం సోసోగా వెళ్తుంది. ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుందే పాట వినడానికే కాదు చూసేందుకు కూడా బాగుండటం ఈ ఎపిసోడ్ ని మరీ డ్యామేజ్ కాకుండా కాపాడింది. ఇంటర్వెల్ ముందు వరకు ఇలాగే వెళ్తుంది.

దాస్ ఎంట్రీ జరిగాక అసలైన మలుపులు మొదలవుతాయి. అంజితో గొడవ నుంచి మైదానంలో ఇద్దరూ తలపడితే క్రిష్టయ్య వస్తాడని ముందే ఊహిస్తాం కానీ దాన్ని మాస్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా డిజైన్ చేయడంతో మంచి హైతో విశ్రాంతి కార్డు పడుతుంది. సైకిల్ చెయిన్ రెఫరెన్బ్ ని వాడుకోవడం తెరమీద పేలింది. సెకండ్ హాఫ్ కి తగిన మూడ్ ని సెట్ చేసిన విజయ్ బిన్నీ ఆ తర్వాత కాసేపు నెమ్మదిస్తాడు. దాస్ జాతరలో చేసిన పనికి కిష్టయ్యకు తర్వాత రగిలిపోయి మారిపోతాడనుకుంటే మందేసి చిందులు వేయడం అంతగా నప్పలేదు. ఇది మాస్ కోసమని ఇరికించినట్టుంది కానీ ట్యూన్ వీక్ గా ఉండటం వల్ల అంతగా క్లిక్ కాలేదు. కిక్కు కూడా అంతగా ఉండదు.

థియేటర్లో అల్లరి నరేష్ మీద దాడి జరిగినప్పటి నుంచి స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. ఎంత వద్దనుకున్నా రంగస్థలం షేడ్స్ అక్కడక్కడా ఫీలవుతాం కానీ నాగ్, అల్లరోడి కాంబినేషన్ ఫ్రెష్ కావడం వల్ల చూడాలనిపించేలా సన్నివేశాలు సాగుతాయి. ట్రాజెడీ ఎపిసోడ్ తర్వాత కిష్టయ్య శివతాండవం చేసే రేంజ్ లో శత్రువుల మీద విరుచుకుపడతాడనే అంచనాలకు భిన్నంగా కొంత అండర్ ప్లే చేయిస్తూ చివరి ఘట్టాన్ని ముగించిన తీరు కొంత అసంతృప్తిగా అనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే ఓకే అనే ఫీలింగ్ కలుగుతుంది. పోరంజులో ఉన్న అసలైన మలుపుని తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకోరనే ఉద్దేశంతో తెలివిగా మార్చేయడం మంచి ఆలోచన.

నా సామిరంగలో తగినంత డ్రామా ఉంది కానీ కొన్ని సన్నివేశాలకు సరైన ఎలివేషన్లు పడి ఉంటే నెక్స్ట్ లెవెల్ కు వెళ్లి ఉండేది. వరాలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లంచం ఇవ్వడం, ప్రభల తీర్థంని ఊరికి రానివ్వకుండా శత్రువులు అడ్డుకుంటే దాన్ని కిష్టయ్య సవాల్ చేయడం లాంటివి ఇంకా బెటర్ గా ఎక్స్ పెక్ట్ చేస్తాం. వీలైనంత వరకు నాగ్ ఎనర్జీ, కీరవాణి బీజీఎమ్ ఆ లోటు రానివ్వకుండా కాపాడుకుంటూ వచ్చాయి. అల్లరి నరేష్ ని మరింత మెరుగ్గా వాడుకుని ఉండాల్సింది. రాజ్ తరుణ్ ని సైతం మరీ క్యామియోకు ఎక్కువ గెస్టుకు తక్కువ తరహాలో డిజైన్ చేసుకోవడంతో అతని ఇంపాక్ట్ సున్నానే అయ్యింది. క్యాస్టింగ్ పరంగా కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవం.

పండగ సినిమాగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చిన నా సామిరంగ అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయినా సంతృప్తి పరచడంలో ఫెయిల్ కాలేదు. గన్నులు పట్టుకుని బాలీవుడ్ విలన్ల మధ్య ప్రయోగాలు చేస్తూ వచ్చిన నాగ్ ని ఇలా స్వచ్ఛమైన పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చూడటం కంటికి ఇంపుగా, ఫ్యాన్స్ కి పసందుగా ఉంది. సోగ్గాడే చిన్ని నాయనా తరహాలో అంత స్థాయిలో విజయం అందుకోవడం గురించి ఇప్పుడే చెప్పలేం కానీ నాగ్, చైతు, అఖిల్ వరస ఫ్లాపులతో నిరాశలో ఉన్న అక్కినేని ఫ్యాన్స్ కి ఒక పెద్ద ఊరట కలిగించడంలో మాత్రం నా సామిరంగ సక్సెసయ్యాడు. ఇక సామాన్య ప్రేక్షకులు ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారనే దాని మీద రేంజ్ ఆధారపడి ఉంది.

నటీనటులు

చాలా గ్యాప్ తర్వాత నాగార్జునని ఇంత ఊర మాస్ కిష్టయ్యగా చూడటం ఫ్యాన్స్ కి పండగే. పంచె కట్టు, బీడీ, మాసిన తల, పొగరుతో నిండిన వేషభాషలు అన్నీ బాగా కుదిరాయి. ఫైట్లలో పడిన కష్టం మంచి ఫలితం ఇచ్చింది. అల్లరి నరేష్ మరోసారి తన టాలెంట్ బయట పెట్టుకునే అంజిగా గుర్తుండిపోయేలా చేశాడు. రాజ్ తరుణ్ కు దొరికిన లెన్త్ చాలా తక్కువ. ఆషిక రంగనాథ్ అందం, అభినయం రెండూ బాగున్నయి, మిర్నా మీనన్ కు కాసిన్ని సీన్లు పడ్డాయి. రుక్సర్ ధిల్లాన్ మొక్కుబడిగా మిగిలింది. నాజర్, రావు రమేష్ లవి ఎప్పుడు చూసే పాత్రలే. సైకో విలన్ గా మలయాళం నటుడు షబ్బీర్ కల్లరక్కల్ అంత బెస్ట్ ఛాయస్ అనిపించుకోలేదు.

సాంకేతిక వర్గం

ఎంఎం కీరవాణి నేపధ్య సంగీతం నా సామిరంగకు కావాల్సిన మూడ్ ని చక్కగా క్యారీ చేసింది. ముఖ్యంగా ఫైట్లకు అదరగొట్టారు. ఒక్కటి మినహాయించి పాటల్లో ఆయన ముద్ర కనిపించలేదు. హుషారుగా ఉండే క్యాచీ ట్యూన్స్ అయితే సినిమా స్థాయి పెరిగేది. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం అధిక భాగం ఇన్ డోర్ అయినా సరే పల్లె అందాలను న్యాచురల్ గా చూపించింది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వీలైనంత నిడివిని కంట్రోల్ లోనే ఉంచింది. బెజవాడ ప్రసన్నకుమార్ రచనలో మాటలు బానే ఉన్నాయి కానీ మెరుపులు తక్కువే. ఫైట్స్ బాగా కంపోజ్ చేసుకున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ – అన్నపూర్ణ నిర్మాణ విలువలు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాయి.

ప్లస్ పాయింట్స్

నాగార్జున ఎనర్జీ
అల్లరి నరేష్
ఇంటర్వెల్ ఎపిసోడ్
నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్

ఫ్లాష్ బ్యాక్ ప్రేమకథ
కామెడీ లేకపోవడం
కొంత నెమ్మదితనం
విలన్ నటుడి ఛాయస్

ఫినిషింగ్ టచ్ : పాసైన మాస్ కిష్టయ్య

రేటింగ్ : 2.75 / 5

This post was last modified on January 14, 2024 2:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

5 minutes ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

47 minutes ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

58 minutes ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

2 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

2 hours ago

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

2 hours ago