ఒక తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ మాట్లాడుకునేలా చేయడంలో రాజమౌళి తర్వాత అంతగా సక్సెస్ అయ్యింది ప్రశాంత్ నీల్ ఒక్కడే. అందుకే ప్రభాస్ కాంబినేషన్ అనగానే షూటింగ్ ముందే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఇక రిలీజ్ దగ్గర పడ్డప్పుడు ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ హోరెత్తిపోయి ఏకంగా యాప్స్ క్రాష్ అయ్యే దాకా వెళ్ళింది. వందల కోట్ల బడ్జెట్, బాహుబలి తరహాలో రెండు భాగాల ప్లాన్, కెజిఎఫ్ కు పని చేసిన సాంకేతిక బృందం ఇలా ఎన్నో ఆకర్షణలు హైప్ ని అమాంతం పెంచాయి. విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టిన సలార్ దానికి తగ్గట్టే గెలిచిందా
కథ
దేశపటంలో కనిపించని ఖాన్సార్ నగరం రాజమన్నార్ (జగపతి బాబు) చెప్పు చేతల్లో ఉంటుంది. వేరే పని మీద బయటికి వెళ్తూ వారసుడు వరదరాజ(పృథ్విరాజ్ సుకుమారన్)కు పట్టం కట్టేందుకు వ్యూహం రచిస్తాడు. అయితే అంతర్గతంగా ఉన్న శత్రువుల వల్ల పాతికేళ్ల క్రితం విడిపోయిన స్నేహితుడు దేవా(ప్రభాస్)ని ఇంటికి తీసుకొస్తాడు వరదా. దుర్మార్గాలకు నెలవుగా మారిన ఖన్సార్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే కాక విదేశాల నుంచి వచ్చిన ఆద్యా(శృతి హాసన్)తో పాటు తల్లి(ఈశ్వరి రావు)ని కాపాడుకునే బాధ్యత దేవా మీద పడుతుంది. అనూహ్యంగా జరిగే సంఘటనలు దేవ, వరదాల మధ్య ఎలాంటి పరిణామాలకు దారి తీశాయో తెరమీద చూడాలి.
విశ్లేషణ
దర్శకుడు ప్రశాంత్ నీల్ సృష్టించే ప్రపంచాలు ప్రేక్షకులు అబ్బురపడేలా ఉంటాయి. వాటిని ఆమోదించబట్టే రాఖీ భాయ్ అంత ఘాడంగా వాళ్ళ మనసులోకి చొచ్చుకువెళ్ళాడు. దాని హ్యాంగోవర్ నెలల తరబడి వెంటాడింది. సలార్ సైతం అదే బాపతులో కెజిఎఫ్ ఎక్స్ టెన్షన్ అనిపించే చీకటి నేరాలను చూపించే ప్రయాణం చేయిస్తుంది. కాకపోతే ఈసారి స్నేహం అనే బలమైన భావోద్వేగాన్ని తీసుకున్న నీల్ కంటెంట్ లోని గ్రాండియర్ తో పాటు ఎమోషన్ ని అంతే స్థాయిలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఎలివేషన్లను కొనసాగిస్తూనే డ్రామాతో మెప్పించాలనే ఆలోచనను అమలు పరచడంలో జాగ్రత్తలు తీసుకున్న విషయం స్పష్టమవుతుంది.
దేవా, వరదరాజలను బంధాన్ని త్వరగా రిజిస్టర్ చేసి చైల్డ్ ఎపిసోడ్ కి తక్కువ సమయం కేటాయించడంతో ప్రభాస్ ఎంట్రీ ఆలస్యమైన ఫీలింగ్ కలగదు. ఖన్సార్ లోకి అడుగు పెట్టాక అసలు అట మొదలవుతుంది. అయితే శృతి హాసన్ ని తానుండే చోటికి ప్రభాస్ తీసుకొచ్చాక బొగ్గు గనుల్లో ఫైట్ వచ్చే దాకా కథనం పెద్దగా పరుగులు పెట్టదు. పైగా ప్రభాస్ తో ఎక్కువ మాట్లాడించకుండా కేవలం పక్క పాత్రలతో అతన్ని వర్ణిస్తూ సాగే వైనం ల్యాగయ్యింది. ఇది కొంత లోపంగా ఫీలవుతున్న టైంలోనే గూస్ బంప్స్ అనిపించే ఎపిసోడ్ తో ఒక్కసారిగా కదలిక తెస్తాడు. అక్కడి నుంచి విశ్రాంతి దాకా అభిమానులకు ఫుల్ మీల్స్ అనిపించే రేంజ్ లో వేగం పెరుగుతుంది.
దేవా, వరదాలు ఖాన్సార్ లో అడుగుపెట్టాక సలార్ నెమ్మదిస్తుంది. పార్ట్ 2లో ఏం చెప్పాలో ముందే నిర్ణయించుకోవడం వల్ల సెకండ్ హాఫ్ లో ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ఛాన్స్ లేకపోయింది. దీంతో పోరాటాలు సుదీర్ఘంగా నడిపించారు నీల్. వీటిని హ్యాండిల్ చేయడంలో తన ఇంటెలిజెన్స్ ని చూపించారు. తండాకు చెందిన పాపను కాపాడే ఎపిసోడ్ లో లెన్త్ ఎక్కువైనా బోర్ కొట్టకపోవడానికి కారణం ఇదే. అయితే ఇదే ఫ్లో తుదికంటా ఉండదు. క్యారెక్టర్లు ఎక్కువైపోవడంతో పూర్తిగా లీనమైతే తప్ప కామన్ ఆడియన్స్ కి వాటి మధ్య సంబంధాలు కొంత కన్ఫ్యూజ్ చేసే అవకాశముంది. ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చిన తల్లిని ఖాన్సార్ కు తీసుకురాకపోవడం వెనుక ఏదో ఎత్తుగడ ఉంది.
స్టోరీ పరంగా చూసుకుంటే సలార్ కనివిని ఎరుగని కథ కాదు. ఆ మాటకొస్తే కెరీర్ ప్రారంభంలోనే ప్రభాస్ రాఘవేంద్రలో ఇదే తరహా క్యారెక్టరైజేషన్ తో కనిపించాడు. సగం సినిమా కోపాన్ని అణుచుకోవడం, తర్వాత లావా విస్ఫోటనంలా విరుచుకుపడటం అందులో ఉంది. సలార్ లో వ్యత్యాసం ఏంటంటే నీల్ హీరో లార్జర్ థాన్ లైఫ్ అనిపిస్తాడు. నమ్మశక్యం కాకపోయినా రోమాలు నిక్కబొడుచుకునేలా హీరోయిజం పండిస్తాడు. ఒకేసారి పది మెషీన్ గన్లు పేల్చినా, వందలాదిని మందిని దూది పింజెల్లా విసిరి కొట్టినా ఏ మాత్రం లాజిక్స్ గుర్తుకురానంత మేజిక్ చేస్తాడు. ఈ అంశం మీదే ఎక్కువ దృష్టి పెట్టిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ నుంచి దాన్ని పూర్తిగా రాబట్టుకున్నాడు.
హీరోకి పట్టుమని రెండు పేజీలు లేని డైలాగులతో ప్రభాస్ తో ఇంత పెద్ద కాన్వాస్ మీద ప్రశాంత్ నీల్ ఆవిష్కరించిన సలార్ ఒకరకంగా చెప్పాలంటే మసాలా ఎక్కువైన హైదరాబాద్ బిర్యానీ. ఘాటుగా ఉన్నా రుచితో ఆకలి తీర్చడంతో టార్గెట్ చేసుకున్న ఆడియన్స్ సంతృప్తి చెందుతారు. తల్లి, స్నేహితుడు ఈ ఇద్దరితో సలార్ కున్న డ్రామాని ఎక్కువ పండించానని ఇంటర్వ్యూలలో చెప్పిన నీల్ దాన్ని మాత్రం సంపూర్ణంగా నెరవేర్చలేదు. వెరైటీ కోసం క్లైమాక్స్ లో జాంబీల లాంటి గుంపుతో ఫైట్ పెట్టించడం, గేమ్ అఫ్ థ్రోన్స్ తరహాలో ఖాన్సార్ నేపధ్యాన్ని రాసుకోవడం డిఫరెంట్ గా అనిపించాయి. లోపాలు చాలామటుకు భారీతనంలో కొట్టుకుపోయాయి.
విక్రమ్, జైలర్, కెజిఎఫ్ టైపు ఓవర్ ది టాప్ హీరోయిజం ట్రెండ్ గా మారిపోయిన జెనరేషన్ లో న్యూ ఏజ్ డైరెక్టర్లు నెరేషన్ కంటే ప్రెజెంటేషన్ మీదే ఎక్కుడ ఆధారపడి బ్లాక్ బస్టర్లు సాధిస్తున్నారు. సలార్ ఇదే కోవలోకి చేరొచ్చు. అయితే నీల్ తనలో క్రియేటివ్ బ్లాక్స్ ని మరింత విస్తరించాల్సిన అవసరమైతే చాలా ఉంది. ఈ పంథా ఒక స్టేజి దాటాక రొటీన్ అయిపోవచ్చు. అది ముందే గుర్తించి అడ్వాన్స్ అయిపోతే రాజమౌళి లాగా ఒకే జానర్ ఒకే బ్యాక్ డ్రాప్ కి కట్టుబడకుండా సరికొత్త ప్రయోగాలతో చరిత్రలు రాయొచ్చు. నీల్ లో గొప్ప టెక్నీషియన్ అనిపించుకునే మాస్టర్ మైండ్ ఉంది. రైటర్ కూడా అదే స్థాయిలో మెరుగుపడితే భవిష్యత్తులో చూసేవి అద్భుతాలే.
నటీనటులు
దేవాగా ప్రభాస్ ఆరడుగుల కండలు తిరిగిన విగ్రహం, గొంతు వింటేనే శత్రువు వణికిపోయే గంభీరం రెండూ అభిమానులు కోరుకున్న డ్యూటీని సంపూర్ణంగా చేశాయి. వేరొకరిని ఊహించుకోవడం కష్టం. పృథ్విరాజ్ సుకుమారన్ ఎంత పర్ఫెక్ట్ ఛాయసో అతనున్న ప్రతి సీన్లో అర్థమైపోతుంది. జగపతి బాబుకి తక్కువ నిడివి దొరికింది. శృతి హాసన్ ని రెగ్యులర్ హీరోయిన్ గా చూపించకుండా మెయిన్ ప్లాట్ కు ముడిపెట్టడం బాగుంది. బాబీ సింహ, శ్రేయ రెడ్డిలకు మంచి స్కోప్ దొరికింది. టినూ ఆనంద్ ఓకే. ఈశ్వరి రావు కుదిరారు కానీ కొంత సింక్ తగ్గినట్టు అనిపించింది. ఝాన్సీ అంతగా నప్పలేదు. జాన్ విజయ్, గరుడ రామ్, మైమ్ గోపి తదితరులు క్యారెక్టర్లకు తగ్గట్టు బాగున్నారు
సాంకేతిక వర్గం
రవి బస్రూర్ నేపధ్య సంగీతం యాక్షన్ ఎపిసోడ్స్ కి బాగానే కుదిరింది. అయితే మిగిలిన భాగాల్లో బీజీఎమ్ గతంలో విన్నట్టు రిపీట్ అనిపించడం మైనస్ అయ్యింది. ఉన్న రెండు ఎమోషనల్ పాటలు ఆకట్టుకుంటాయి. భువన్ గౌడ ఛాయాగ్రహణం ప్రశాంత్ నీల్ టేకింగ్ తో పోటీ పడింది. ముఖ్యంగా క్లిష్టమైన సెటప్ ని ఖరీదుగా చూపించడంలో సక్సెసయ్యాడు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ లో నిడివినే సమస్యగా కనిపించింది. అవసరం లేని కొంత భాగం ట్రిమ్ చేయాల్సింది. అన్బరివు యాక్షన్ కంపోజింగ్ మాస్ తో విజిల్స్ వేయించేలా ఉంది. హోంబాలే ఫిలిమ్స్ నిర్మాణ విలువలు వంక పెట్టడానికి లేకుండా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా నిలిచాయి.
ప్లస్ పాయింట్స్
ప్రభాస్
యాక్షన్ ఎపిసోడ్స్
ఇంటర్వెల్ బ్లాక్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ నిడివి
తడబడిన ఎమోషన్లు
కెజిఎఫ్ లా అనిపించే సెటప్
ఫినిషింగ్ టచ్ : మాస్ యాక్షన్ ఫైర్
రేటింగ్ : 2.75 / 5
This post was last modified on December 22, 2023 11:48 am
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…