Movie Reviews

సమీక్ష – శాకుంతలం

మాములుగా స్టార్ హీరోలకు ఓపెనింగ్స్ రావడం సహజం కానీ కేవలం హీరోయిన్ ఇమేజ్ మీద ఒక సినిమాను మార్కెట్ చేయడం చాలా కష్టం. విజయశాంతి, అనుష్క లాంటి అతి కొందరికి మాత్రమే ఆ స్థాయి ఫాలోయింగ్ దక్కింది. సమంతా అదే దారిలో వెళ్తూ ఫిమేల్ ఓరియెంటెడ్ కథలకు ప్రాధాన్యం ఇస్తూ ఓ బేబీ, యశోద లాంటి మంచి హిట్లు ఖాతాలో వేసుకుంది. అందుకే శాకుంతలం మీద ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. త్రీడి సాంకేతికతతో దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన ఈ వింటేజ్ డ్రామా మెప్పించేలా ఉందా

కథ

విశ్వామిత్రుడి తపోభంగం చేయడానికి వచ్చిన మేనక(మధుబాల)కు కలిగిన సంతానం శకుంతల(సమంత). అనాథగా పుట్టి కణ్వ(సచిన్ కెడ్కర్) ఆశ్రమంలో పెరిగి పెద్దవుతుంది. యజ్ఞ రక్షణకు వచ్చిన దుశ్యంతుడు(దేవ్ మోహన్) ఈమెను చూడగానే మనసు పారేసుకుని గాంధర్వ వివాహం చేసుకుని తిరిగి వస్తానని రాజ్యానికి వెళ్ళిపోతాడు. దుర్వాసుడి(మోహన్ బాబు)శాపానికి గురైన శకుంతలను తన దగ్గరకు వచ్చినప్పటికీ దుశ్యంతుడు గుర్తుపట్టడు. గర్భవతిగా ఉన్న శకుంతల ప్రజల చేత ఛీత్కారాలు అందుకుని అడవికి వెళ్ళిపోతుంది. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఈ జంట ఎలాంటి మలుపుల మధ్య తిరిగి కలుసుకున్నారనేదే తెరమీద చూడాలి

విశ్లేషణ

ఇతిహాసాలకు కాల్పనికతను జోడించలేం. అలా చేస్తే మనోభావాలు దెబ్బ తిని లేనిపోని వివాదాలు చవి చూడాల్సి వస్తుంది. రుద్రమదేవి సమయంలో గుణశేఖర్ కు ఇది అనుభవమయ్యింది. అలా అని పాఠాలు నేర్చుకోలేదు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంని యథాతథంగా తీసే ప్రయత్నం చేసినా సరైన మోతాదులో డ్రామా ఉందో లేదో చెక్ చేసుకోకుండా కేవలం స్థార్ క్యాస్టింగ్ తో గ్రాండియర్ గా తీస్తే చాలు ఆడేస్తుందనే గుడ్డి నమ్మకంతో ముందుకెళ్లిపోయారు. బాహుబలి చూసి ఈర్ష్యతో అలాంటివి తానెందుకు తీయకూడదని కొన్నేళ్ల క్రితం అనుకున్నానని ఇంటర్వ్యూలలో చెప్పిన గుణశేఖర్ ఆ రాజమౌళి సక్సెస్ కు కారణమేంటో కూడా విశ్లేషించుకుని ఉంటే బాగుండేది

శాకుంతలం ఒక్క గొప్ప గాథ. అందులో సందేహం లేదు. కానీ బాహుబలిలాగా రోమాలు నిక్కపొడుచుకొనే యుద్దాలు ఎత్తుగడలు ఉండవు. రామాయణంలా పాత్రల మధ్య విధి సృష్టించిన అద్భుత నాటకీయత ఉండదు. మహాభారతంలా ఎత్తులు పైఎత్తులు వేసుకునే దాయాదుల కుట్రలు కుతంత్రాలు ఉండవు. ఉన్నదల్లా శకుంతల మానసిక సంఘర్షణ ఒకటే. కోరి మనువాడిన వాడు వస్తాడనుకుంటే ఏకంగా నువ్వెవరో తెలియదని ఛీకొట్టి పొమ్మనప్పుడు పడిన వేదన తాలూకు భావోద్వేగ కావ్యం. చదివిన వాళ్ళకు ఆ అనుభూతి కలుగుతుంది. కానీ అదే తెరపైకి వచ్చినప్పుడు డ్రామా కావాలి. ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలా పాత్రల మధ్య సంబంధాలుండాలి.

గుణశేఖర్ ఇవేవీ పట్టించుకోలేదు. విజువల్స్ ఉంటే చాలు, సబ్జెక్టు డిమాండ్ చేయకపోయినా త్రీడి టెక్నాలజీ పెట్టేస్తే చాలనుకునే లెక్క పూర్తిగా తప్పింది. పేపర్ మీద భావుకత్వం తెరమీద పండకపోతే అది ముమ్మాటికీ దర్శకుడి తప్పే. తీయగా ఉంటుందని అన్నం లేకుండా ఉట్టి పెరుగుని కిలోల కొద్దీ తినలేం.ఈ కథలోనూ ఆ సమస్య ఉంది. ప్రేమ జంట విడిపోయే క్రమం, దుశ్యంతుడి కోసం శకుంతల రాజ్యానికి రావడం వీటిలో ఎక్కడా గూస్ బంప్స్ అనిపించే మూమెంట్స్ ఉండవు. అందుకే కాలనేమి శత్రువులతో యుద్ధం ఎపిసోడ్లను సృష్టించి పిల్లలను, మాస్ ని ఆకట్టుకునే ఎత్తుగడ పెట్టినా అవి దారుణమైన విఎఫ్ఎక్స్ లోపాల వల్ల పూర్తిగా తేలిపోయాయి

ఎంత గొప్ప గాథలైనా సరే శాకుంతలం, నల దమయంతి, సత్య హరిశ్చంద్ర లాంటివి సినిమాగా మలచడంలో రిస్క్ ఉంటుంది. కష్టాలు, కన్నీళ్లు ఎక్కువ. ఇప్పటి జనరేషన్ వేగాన్ని కోరుకుంటుంది. అది వీటిలో సాధ్యపడదు. అలా అని క్రియేటివిటీ జోడించి మన ఇష్టం వచ్చినట్టు ఇతర అంశాలు జొప్పించలేం. అందుకే శకుంతల శాపానికి గురైన తర్వాత చాలా సేపు కథ ముందుకెళ్లని ఫీలింగ్ కలుగుతుంది. ఆ గ్యాప్ ని పాటలతో నింపారు కానీ వావ్ అనిపించకపోగా ఇంకా దెబ్బకొట్టాయి. పైగా ట్యూన్లు కూడా అంతంత మాత్రంగా ఉండటంతో విపరీతమైన ల్యాగ్ వచ్చేసింది. క్లైమాక్స్ లో అర్హ ఎంట్రీ దాకా ఈ ఇబ్బంది క్రమం తప్పకుండా వెంటాడుతుంది

ఇలాంటి నేపధ్యానికి సహజత్వం చాలా అవసరం. ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు కానీ వాటిలో కృత్రిమత్వం కనిపిస్తుంది. యుద్ధ సన్నివేశాల్లో నాణ్యత లేని బిల్డప్ తప్ప ఇంకేమీ లేదు. సెకండ్ హాఫ్ లో శకుంతల పడే బాధతో సహా అన్నీ కృత్రిమంగా ఉన్నాయి. దీంతో రెండున్నర గంటల్లో సానుకూలంగా అనిపించేవి వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. ఇంటర్నేషనల్ కంటెంట్ ని ఇంట్లోనే చూస్తున్న ఇప్పటి ప్రేక్షకుల అంచనాలు అందుకోవాలంటే ఆషామాషీగా ఆలోచిస్తే సరిపోదు. ఇంత అనుభవమున్న గుణశేఖర్ మారిపోతున్న ఆడియన్స్ పల్స్ ని పసిగట్టకుండా తన మానాన తాను ఇలాంటివి తీస్తే ఫలితాలు కూడా రిపీటవుతూనే ఉంటాయి

నటీనటులు

సమంతా శకుంతలగా ఏమాత్రం నప్పలేదు. దానికి తోడు స్వంత డబ్బింగ్ పెద్ద మైనస్ అయ్యింది. దేవ్ మోహన్ అందంగా ఉన్నాడు తప్పించి అంతగా ఆకట్టుకోలేదు. మోహన్ బాబు, అనన్య నాగళ్ళ, ,మధుబాల, తదితరులు చిన్న పాత్రల్లోనే అయినా ఒదిగిపోయారు. సుబ్బరాజు, శత్రులు వృధా అయ్యారు. సచిన్ కెడ్కర్, జిస్సు సేన్ గుప్తా, కబీర్ దుల్హన్ ఇలా నాన్ తెలుగు బ్యాచ్ ని పెద్దగానే పెట్టుకున్నారు కానీ వాళ్ళ వల్ల ఒరిజినాలిటీ తగ్గిపోయింది. అల్లు అర్హ క్యూట్ గా కనిపించడమే కాదు క్లిష్టమైన సంభాషణలు సైతం చక్కగా పలికి శభాష్ అనిపించుకుంది. ఊరట కలిగించే ఎపిసోడ్ ఏదైనా ఉందంటే ఇదొక్కటే అని చెప్పాలి

సాంకేతిక వర్గం

మణిశర్మ పాటలు రెండు పర్వాలేదనిపించినా మొత్తంగా చూస్తే ఆల్బమ్ చాలా వీక్. ఏ పాటా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా లేదు. నేపధ్య సంగీతంలోనూ తనదైన ప్రత్యేక ముద్ర వేయలేకపోయారు. శేఖర్ వి జోసెఫ్ ఛాయాగ్రహణంలో ఎంత అనుభవమున్న పరిమితులున్న దర్శకుడి ఆలోచన వల్ల ఆయనా నిస్సహాయుడిగా మిగిలిపోయారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పాటల ట్రిమ్మింగ్ కి రికమండ్ చేసి ఉంటే కొంత లెన్త్ కొంచెమైనా తగ్గేది. సాయిమాధవ్ బుర్రా సంభాషణల్లో గ్రాంథికం ఎక్కువై అంత సహజంగా అనిపించవు. దిల్ రాజు – గుణశేఖర్ ప్రొడక్షన్ వేల్యూస్ ఖర్చయితే పెట్టారు కానీ రాజీపడిన ధోరణి కూడా కనిపిస్తుంది

ప్లస్ పాయింట్స్

అర్హ నటన

మైనస్ పాయింట్స్

చిన్న కథ
సాగదీసిన నెరేషన్
సంగీతం
గూస్ బంప్స్ మూమెంట్స్ లేకపోవడం

ఫినిషింగ్ టచ్ : భరించలేం

రేటింగ్ : 2 / 5

This post was last modified on April 15, 2023 10:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

45 minutes ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

50 minutes ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

2 hours ago

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

2 hours ago

ఏమిటీ ‘అనుచితాల’.. ఆపండి: బీజేపీపై ఆర్ ఎస్ ఎస్ ఆగ్ర‌హం!

బీజేపీ మాతృ సంస్థ‌.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ ఎస్ ఎస్‌).. తాజాగా క‌మ‌ల నాథుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు…

3 hours ago

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

4 hours ago