Movie Reviews

సమీక్ష – కేజిఎఫ్ 2

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఆ రేంజ్ లో బజ్ తెచ్చుకున్న నికార్సయినా పాన్ ఇండియా సినిమా కేజిఎఫ్ 2. కేజిఎఫ్ తొలిభాగం ఏ అంచనాలు లేకుండా విడుదలై జనాలను ఆకట్టుకుంది. కానీ మలి భాగం అలా కాదు. విపరీతమైన అంచనాలు పెంచి, పెంచుకుంటూ, పెంచుకుని మరీ వచ్చింది. అన్ని అంచనాలు అందుకునే సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. పైగా ముగిసిపోయిన కథను కొనసాగిస్తూ సీక్వెల్ రాసుకోవడమూ చిన్న విషయం కాదు.

వీటన్నింటి నడుమ విడుదలయింది కేజిఎఫ్ 2 . తొలిభాగం కొనసాగింపుగా రాసుకున్న మలి భాగం కధేంటీ అంటే, కేజిఎఫ్ ను రాకీ (యశ్) స్వంతం చేసుకున్న తరువాత అక్కడి వారందరికీ దేవుడిగా మారిపోతాడు. అలాంటి టైమ్ లో అతని నుంచి మళ్లీ కేజిఎఫ్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యర్ధులు వ్యహాలు పన్నడం ప్రారంభిస్తారు. అందులో భాగంగా అధీరా(సంజయ్ దత్) రంగంలోకి దిగుతాడు. మరోపక్కన ప్రభుత్వం రాకీ సామ్రాజ్యాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి మొదలుపెడుతుంది. ఇలా అన్ని వైపుల నుంచి వచ్చిన దాడులతో రాకీ ఎలా పోరాడాడు అన్నది మిగిలిన సినిమా.

కేజిఎఫ్ 2 సినిమా ఓ మ్యాజిక్. ఏం వుంది అనుకోవాలని అనిపిస్తుందీ…కానీ అంతలోనే ఏం వుందీ? అన్న ప్రశ్న ఎదురవుతుంది. దీనికి రెండు కారణాలు. ఒకటి రాసుకున్న స్క్రిప్ట్…అమలు పరిచిన టిపికల్ స్క్రీన్ ప్లే. నిజానికి కథ చాలా థిన్ లైన్. అందువల్ల కొంత సమస్య. ఆ కథను పెద్దగా చెప్పాలనే ప్రయత్నంతో రెండు మూడు సీన్లకు ఓసారి ప్రకాష్ రాజ్ (పార్ట్ వన్ లో అనంతనాగ్) నెరేషన్ ను జోడించారు. అక్కడ కూడా డ్రామా బోలెడంత యాడ్ చేసారు. దాని వల్ల ఎఫెక్ట్ ఏ మేరకు వచ్చింది అనేకన్నా, ఫ్లో కు ఎంత ఆటకం కలిగింది అన్నది పాయింట్.

అదే విధంగా సినిమాలో బలమైన ఎమోషన్లను తగ్గించి, ఎలివేషన్లు పెంచారు. వీలయినంత వరకు హీరోను ఎలివేట్ చేయాలని చూసారు. సీన్ ను ఎలివేట్ చేస్తూ హీరోను కూడా పెంచాలి తప్ప, కేవలం సీన్లలో సత్తా లేకుండా హీరోను ఎలివేట్ చేయాలని చూస్తే అది కాస్త ఆర్టిఫిషియల్ గా వుంటుంది. కేజిఎఫ్ 2 లో స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే తరువాత లోపం అదే.

కానీ వీటిని పక్కన పెడితే ‘లార్జర్ దాన్ లైఫ్’ పిక్చరైజేషన్ అనే మాటకు కేజిఎఫ్ 2 ఓ ఉదాహరణ. ఇన్నాళ్లు ఇలాంటివి రాజమౌళి మాత్రమే ఊహిస్తాడు. చిత్రీకరిస్తాడు. అని టాక్. కానీ కొన్ని సీన్లు చూస్తుంటే రాజమౌళిని దాటి ఎక్కడికో వెళ్లాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. స్టోరీ బోర్డ్ చూస్తుంటే కళ్లు కాస్త పెద్దవి చేసుకోవాల్సిందే. ప్రతి సీన్ కు ఓ థీమ్, ఓ ఐఢియా, కొత్తగా చూపించాలనే తపన్ బాగా కనిపిస్తాయి. పైగా సినిమా మొదలుపెట్టింది మొదలు ముగించే వరకు ఓకే డార్క్ థీమ్ ను మెయింటెయిన్ చేయడం కూడా భిన్నమైన ప్రక్రియ. కేజిఎఫ్ 2 సినిమాకు ఇదే బలం, బలగం.

కేజిఎఫ్ 2 సినిమా ఇంకో బలం ఏమిటంటే స్క్రీన్ కు కళ్లు అప్పగించి చూస్తూ వుంటాడు తప్ప, తల పక్కకు తిప్పేసుకున్నా ఫరవాలేదు అనే సీన్లు పెద్దగా వుండవు. సినిమా ఎత్తుగడ దగ్గర నుంచి విశ్రాంతి వరకు మరీ గొప్ప సినిమా అనిపించుకోదు కానీ ఓకె అనేంత రేంజ్ కు వెళ్తుంది. కానీ మలి సగం ప్రారంభమయ్యాక కాస్త స్పీడందుకుంటుంది. కానీ సినిమాలోకి ప్రభుత్వం, రాజకీయాలు ఇవన్నీ చేరుకున్నాక కాస్త బోర్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా ఆ భారీ పిక్చరైజేషన్ నే కాపాడుతుంది సినిమాను. ఓ క్రిమినల్ నేరుగా ప్రధాని ముందు కూర్చుని మాట్లాడడం, పార్లమెంట్ లోకి వెళ్లి ఓ నాయకుడిని చంపడం వంటి సీన్లు మరీ ఓవర్ దీ బోర్డ్ అని లేదా లాజిక్ లెస్ అని అనిపిస్తాయి.

డార్క్ థీమ్ తో, సీరియస్ నోట్ తో ఆది నుంచి అంతం వరకు నడిచే సినిమాలో క్లయిమాక్స్ ను బాగా రాసుకున్నారు. అక్కడ మాత్రం హీరో తల్లి మీద చిత్రీకరించిన సీన్ శహభాష్ అనిపించుకుంటుంది. సినిమాలో ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధారణంగా ఇలాంటి భారీ సినిమాల్లో డైలాగులు భారీగా వుంటాయి కానీ డెప్త్ గా వుండవు. కానీ ఈ సినిమా దానికి మినహాయింపు. సంభాషణలు చాలా బాగున్నాయి. చాలా సంభాషణలు కోట్ చేయదగ్గవిగా వున్నాయి.

బ్యాక్ గ్రవుండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, విజువల్ వర్క్స్ అన్నీ ఓ లెవెల్ లో వున్నాయి. మొత్తం మీద సౌత్ సినిమా కూడా హాలీవుడ్ సినిమా రేంజ్ కు చేరింది అనడానికి మరో ఉదాహరణ దొరికింది..అదే కేజిఎఫ్ 2.

ప్లస్ పాయింట్లు
విజువల్స్
ఎలివేషన్లు
సంభాషణలు

మైనస్ పాయింట్లు
స్క్రిప్ట్
స్రీన్ ప్లే

ఫినిషింగ్ టచ్: లార్జర్ దాన్ లైఫ్

Rating: 2.75/5

This post was last modified on April 14, 2022 1:55 pm

Share
Show comments
Published by
Satya
Tags: FeatureKGF 2

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

35 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago