పెళ్లి ఓ నమ్మకం…కాపురం ఓ సర్దుబాటు. ఇదే పెళ్లి మీద ఎంత డిస్కస్ చేసినా చివరకు తేలే పాయింట్. కానీ బొమ్మరిల్లు భాస్కర్ వ్యవహారం వేరు. ఆయన మందలో నడవడు..అందుకు భిన్నంగా ఆలోచిస్తాడు. బొమ్మరిల్లు సినిమాలో ఆలోచిస్తే తండ్రీ కరెక్టే అనిపిస్తుంది. కొడుకూ కరెక్టే అనిపిస్తుంది. ఒంగోలు గిత్త లాంటి ఫ్లాపు సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ ఆలోచనా విధానం ఆకట్టుకుంటుంది. ఆరెంజ్ సినిమా ఫ్లాపు అయినా, అడ్వాన్స్ గా తీసేసాడు కదా అంటారు కానీ కాదని వాదించరు. ఇప్పుడు బ్యాచులర్ సినిమాలో తన దృష్టిని పెళ్లి మీద కాపురాల మీద పెట్టాడు దర్శకుడు భాస్కర్. మరి ఈ సారి ఏం చేసాడో చూద్దాం.
పెళ్లి చేసుకోవాలంటే సరైన ఉద్యోగం, ఇల్లు, ఫర్నిచర్ ఇలా అన్నీ వుంటే చాలు అనే ఫుల్ క్లారిటీ తో ఇండియాలో అడుగు పెడతాడు హర్ష (అఖిల్). అంతలోనే పరిచయం అవుతుంది విభ ( పూజా హెగ్డే). ఓ స్టాండప్ కమెడియన్. చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా పెళ్లి మీద తనకంటూ ఒక కాన్సెప్ట్ తయారు చేసుకంటుంది. ఆమెను తొలి చూపులోనే ఇష్టపడతాడు కానీ జాతకాలు కలవలేదని అనడంతో వేరే సంబంధాలు చూస్తుంటాడు. విభ చెప్పే కొత్త ఐడియాలిజీ కి సంబంధించిన ప్రశ్నలు తన పెళ్లి చూపుల్లో ప్రయోగిస్తూ అభాసు అవుతుంటాడు. ఇవన్నీ ఒక స్టేజ్ లో కోర్టు వరకు వెళ్లిపోతాయి. దాంతో పెళ్లి అయిడియా మానుకుని వెనక్కు వెళ్తాడు. కానీ అంతలోనే మళ్లీ విభానే కరెక్ట్ అని తెలుసుకుని, ఇండియా వచ్చి, ఆమెను తన దాన్ని చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన కథ.
సినిమా హీరో నెరేషన్ తో ప్రారంభం అవుతుంది. అసలు హీరోయిన్ స్టాండప్ కమెడియన్ గా చూపించడం అన్నదే కత్తి మీద సాము. ఎందుకంటే ఇది ఇంకా మన జనాల్లోకి పూర్తిగా ఇంకని వ్యవహారం. కొత్త జోకులు చెప్పాలి. అవి పండాలి. జనం నవ్వాలి. లేదూ అంటే ప్రూవ్ అయిన జోక్ లు చెప్పాలి. అలా చేస్తే పాతవే అంటారు. ఇక్కడ ఆ సమస్య వుంది. ఆ మధ్య వచ్చిన షాదీ ముబారక్ ఛాయలు లైట్ గా టచ్ అయినా, వ్యవహారం వేరే.
పూజా హెగ్గే కథానాయిక కాకుండా వుంటే తొలిసగం బకెట్ తన్నేసేది,. కేవలం ఆమె కావడం వల్ల తొలిసగం పక్కాగా పాస్ అయిపోతుంతి. పెద్దగా అసంతృప్తి ఏమీ వుండదు. కలర్ ఫుల్ గా, స్టార్ కాస్ట్ తో, సరదాగా సాగిపోతుంది తొలిసగం. ప్రేక్షకులు అక్కడి తమ డబ్బులు చాలా వరకు కిట్టుబాటు అయిపోయాయి అనుకుంటారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కు లీడ్ చేసే కోర్టు సీన్ దగ్గర సినిమాకు మైనస్ మార్కులు పడడం ప్రారంభం అవుతుంది. ఆ కోర్టు సీన్ మరీ అతి అనిపిస్తుంది. అలా కాకుండా మరే విధంగానైనా బ్రేకప్ సీన్ రాసుకోవాల్సింది.
మొత్తం మీద తొలిసగం ఓకె అనిపించుకుని, మలిసగం ప్రారంభమయ్యాక అసలు వ్యవహారం మొదలవుతుంది. పెళ్లికి ఏం కావాలి అనే ప్రశ్న సంధించడం వరకు ఓకె. ఇప్పటి వరకు వున్న సమాధానాలు కాదని, జనాలకు తట్టని సమాధానం చెప్పడం, దానికి లాజిక్ చూపించడం అన్నది అంత వీజీ కాదు. ఏం కావాలో అన్నది వెదకడం వేరు. ఏం కావాలో తెలియకుండా వెదుకులాట వేరు. అదే ఈ సినిమా సెకండాఫ్ కు సమస్య.
దీని వల్ల సినిమా అక్కడిక్కడే తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. తొలి సగంలో పెళ్లి మీద అమ్మాయికి కొత్త తరహా క్లారిటీ వుందనుకుంటే, ద్వితీయార్థంలో అది కొత్త తరహా క్లారిటీ కాదు. కన్ఫ్యూజన్ అని అర్థం అవుతుంది. పోనీ ఇంత కన్ఫ్యూజన్ వున్నా, చివరకు ప్రేక్షకులకు నప్పే, ఒప్పించే కొత్త కాన్సెప్ట్ ను చెప్పగలిగారా అంటే అదీ లేదు. పెళ్లికి ప్రేమ ఒక్కటే చాలదు..రొమాన్స్ కావాలి.రొమాన్స్ అంటే పడకగదిలో తలుపులు వేసుకుని పది నిమషాలు చేసే పని కాదు, అది బూతు కాదు…వేరే లెవెల్ అన్నట్లు చెబుతాడు హీరో. మొత్తం మీద ప్రాక్టికల్ గా సాధ్యంకాని థియరీ ఒకటి కనిపెట్టి వివరిస్తాడు.
ఇది జనాలను కాస్త నీరసింపచేస్తుంది. అప్పటి వరకు తమకు తెలియనిది, తమ బుర్రకు తట్టనిది ఏదో చెబుతాడు దర్శకుడు అనుకుంటే రొమాన్స్ అనే రొటీన్ పదం అక్కడ పడేసి తుస్సుమనిపించేస్తాడు. పైగా దానికి కూడా బోలెడు సేపు ఎమోషనల్ లెక్చర్. నిజానికి సెకండాఫ్ ప్రారంభమయ్యాక కూడా కొంత వరకు ఓకె అనిపిస్తుంది. కానీ హీరో ఇండియా తిరిగి వచ్చిన దగ్గర నుంచి గ్రాఫ్ డౌన్ కావడం మొదలవుతుంది. ఆ డౌన్ అలా క్లయిమాక్స్ వరకు సాగతుంది కానీ మరి లేవదు.
అయితే సినిమాకు అదృష్టం ఇంకా సేవింగ్ ఫ్యాక్టర్ ఏమిటంటే తొలిసగం ఎక్కడా విసుగు అనిపించక పోవడం, మలి సగంలో కూడా అక్కడక్కడ ఫరవాలేదు అనుకుంటూ చాలా మంది జంటలు వాళ్ల జీవితాలతో కాస్త కనెక్ట్ అయ్యే అవకాశం వుండడం. అందువల్లనే ద్వితీయార్థంలోని ద్వితీయార్థంలో వున్న సోది అంతా భరిస్తారు.
సినిమాకు పూజా హెగ్గే అసలు సిసలు ప్లస్ పాయింట్. ఆమె కాక మరెవరు అయినా తొలిసగం ఇలా వుండదు. అఖిల్ బాగానే చేసాడు కానీ పూజా మాత్రం స్టీల్ ది షో. మలిసగం అంతా పూజాను తగ్గించి, అఖిల్ మీద రన్ చేయడం అన్నది కూడా ఆ పార్ట్ గ్రాఫ్ తగ్గడానికి మరో కారణం.
బ్యాచులర్ సినిమా ఫెయిల్యూర్ సినిమా కాదు. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ , ఇంకా క్లయిమాక్స్, ప్రీ క్లయిమాక్స్ సీన్లు మాత్రం ఫెయిల్యూర్. అక్కడ జాగ్రత్త పడాలి అంటే స్క్రిప్ట్ మొత్తం మార్చుకోవాలి. అందుకే ఆ దిశగా ఆలోచించి వుండరు. సినిమా చూసి బయటకు వచ్చిన యంగ్ బ్యాచ్ కు సెకండాఫ్ అంతగా నచ్చదు. అప్పటికే పెళ్లయిన కపుల్స్ కు సెకండాఫ్ లో చెప్పింది కరెక్టే కదా అనిపిస్తుంది.
ఇలా మిక్స్ డ్ ఫీలింగ్ ఇచ్చే ఈ సినిమాకు గోపీసుందర్ అందించిన సంగీతం కూడా ప్లస్ అయింది. పాటలు బాగున్నాయి. నేపథ్యసంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం కలర్ ఫుల్ గావుంది. సినిమా నిండా ఫ్యామిలీలు, జనాలు అంతా గీత గోవిందం ప్రభావం కావచ్చు.
మొత్తం మీద బ్యాచులర్ లైఫ్ కొంత బాగుంటుుంది. కొంత బోర్ వుంటుంది అన్నట్లుగానే వుంటుందీ సినిమా కూడా.
ప్లస్ పాయింట్లు
తొలిసగం
పాటలు
పూజా హెగ్డే
మైనస్ పాయింట్లు
దితీయార్థంలో మలిసగం
క్లయిమాక్స్
ఫినిషింగ్ టచ్ : పెళ్లి..కాపురం..మధ్యలో రొమాన్స్
Rating: 2.75/5
This post was last modified on October 15, 2021 4:34 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…