రికార్డింగ్ డ్యాన్సుల్లో రకాలు వుంటాయి. కొన్ని మరీ చీప్ గా, ఊరమాస్ గా వుంటాయి. అలాంటి థర్డ్ గ్రేడ్ రికార్డింగ్ డ్యాన్స్ మాదిరిగా వున్న సినిమానే బట్టల రామస్వామి బయోపిక్. జీ ఓటిటిలో విడుదలైన ఈ సినిమా పక్కా థర్డ్ గ్రేడ్ నాటు కామెడీ సినిమా. తల తోక, కర్త కర్మ క్రియ ఏమీ వుండదు. కేవలం నాటు కామెడీ సీన్లు తప్ప.
బట్టలరామస్వామి (ఆల్తాఫ్ హసన్) అనే వాడు మంచివాడైన అమాయకుడి లాంటి వాడు. వాడితో చిత్రమైన క్యారెక్టర్. జనాలకు వాడిని మంచివాడైన అమాయకుడిలా చూపించాలన్నది దర్శకుడు రామనారాయణ ప్రయత్నం. ఆ అమాయకత్వం నుంచి కావాల్సినంత చీప్ శృంగారం రాబట్టాలన్నది వెనుక దాగిన వైనం. ఇతగాడు రకరకాల పర్యవసానాల కారణంగా ముగ్గురిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ ముగ్గురితో ఇతగాడి రాత్రి పడక వైనాలు, అలాగే ఇది చాలదన్నట్లు హీరో మిత్రుడు (భద్రం) నెలకోసారి జరిగే శోభనపు సంగతులు. ఇవే సినిమా నిండా.
ఓ పెళ్లాంతో మొగుడు చేసే శృంగారాన్ని చూసి మరో పెళ్లాం ఆ విద్యను నేర్చుకోవడం. ఓ పెళ్లాంతో జరిపే శోభన వైనాన్ని కాటికి కాలుచాచుకున్న ముగ్గురు వృద్ద మహిళలు పెదవులు చప్పరించుకుంటూ చూస్తూ, సింబాలిక్ చేష్టలు చేస్తూ కూర్చోవడం. ఇాలాంటి చౌకబారు సీన్లు అన్నింటిని కలుపుతూ కథ అనే ఓ ధ్రెడ్. కానీ కర్మ ఏమిటంటే ఈ సీన్ల సంగతి ఎలా వున్నా, వీటిని కలుపుతూ రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ, హీరో ప్రెండ్ స్వామీజీ ఎపిసోడ్ కానీ అస్సలు రంజింపచేయదు. పైగా మధ్య మధ్యలో పంటికింద రాళ్లలా అవసరం లేని పాటలు కూడానూ.
సినిమా సబ్జెక్ట్ ఎంత చౌకబారుగా వుంటుందో హీరోయిన్ల వ్యవహారం కూడా అలాగే వుంటుంది. లావణ్య రెడ్డి కొంత వరకు ఓకె. మిగిలిన ఇద్దరు సాత్విక, శాంతి రావు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాటకరంగం నుంచి వచ్చిన హీరో ఆల్తాఫ్ హసన్ ఆ పాత్ర వరకు బాగానేచేసాడు.
సినిమాను ఒకే చిన్న ఊరిలో, మేకప్ లు కూడా అవసరం లేకుండా తీసేసారు. సినిమా సబ్జెక్ట్ మాత్రమే కాదు, నిర్మాణ విలువలు కూడా నేలబారుగానే వున్నాయి. జీ 5 లాంటి ఓటిటి ప్లాట్ ఫారమ్ మరీ ఇలాంటి చౌకబారు సినిమాను తీసుకోవడం, దాని గురించి హడావుడి చేయడం మరీ చిత్రంగా వుంది. చిత్రమేమింటే సినిమాలో శృంగారం, డబుల్ మీనింగ్ లు అలరింపచేయవు. నవ్వు పుట్టించవు. అలా అని సినిమా సబ్జెక్ట్ ఆకర్షణీయం కాదు.
అంటే సింపుల్ గా చెప్పాలంటే వ్రతమూ చెడింది ఫలితమూ దక్కలేదు.
ఫినిషింగ్ టచ్: బయోపిక్ కాదు బూతుబుక్
-సూర్య
This post was last modified on May 14, 2021 11:28 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…