Movie Reviews

సమీక్ష: అరణ్య

సబ్జెక్ట్ మంచిదైతే చాలదు..సినిమా కూడా బాగా రావాలి. సాంకేతిక సహకారం అద్భుతంగా అందితే సరిపోదు. స్క్రిప్ట్ కూడా దానికి తగినట్లు వుండాలి. హీరో ఒక్కడూ శహభాష్ అనేలా నటించేస్తే సరిపోదు, సినిమాలో మిగిలిన పాత్రలు కూడా ఆ రేంజ్ లో కనీసం కనిపించాలి. ఈ సూత్రాలు అన్నింటికీ విరుద్దంగా తయారైన సినిమా ఈవారం విడుదలయిన అరణ్య. రానా దగ్గుబాటి హీరోగా గజరాజు ఫేమ్ ప్రభు సోలమన్ రూపొందించిన సినిమా ఇది. అన్నీ వున్నా అంగట్లో శని అన్న నానుడికి పక్కాగా సరిపోయేలా తయారైందీ సినిమా.

ఇంతకీ కథేంటీ అంటే…తరతరాల ఆస్తిని అడవుల పెంపకం కోసం, ఏనుగుల సంక్షేమం కోసం రాసి ఇచ్చేస్తారు అరణ్య అలియాస్ భూపతి (రానా) పూర్వీకులు. భూపతి కూడా ఒంటి చేత్తో లక్ష మొక్కలు నాటి పెంచుతాడు. అడవిలోనే వుంటూ, పక్షులు, జంతువుల భాషను ఒడిసిపెట్టి, వాటితో మమేకం అవుతూ వాటికోసమే బతికేస్తూ వుంటాడు. అదే అడవిలో నక్సలైట్లు వుంటారు. అదే అరణ్యంలో గిరిజనులు వుంటారు. అలాంటి అడవి మధ్యలో ఓ భారీ టౌన్ షిప్ కట్టాలన్నది అటవీ శాఖ మంత్రి, బిల్డర్ కనకమేడల రాజగోపాలం (అనంత్ మహదేవన్) కల. అలా టౌన్ షిప్ కడితే అడవి నాశనం అయపోతుంది. అందులో వున్న ఏనుగులు అన్యాయం అయిపోతాయి. వాటికి నీటి వసతి వుండదు. ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది. అందుకే ఆ ప్రాజెక్టుకు అడ్డం పడతాడు అరణ్య . దాంతో అరణ్యను కేసులు బనాయించి, పిచ్చివాడని ముద్రవేసి నానా హింస పెడతారు. అయినా వెనక్కు తగ్గడు. అలా అరణ్య సాగించిన ఉద్యమం ఎలా ముగిసింది అన్నది మిగిలిన సినిమా.

అరణ్య సినిమాకు ముందే చెప్పుకున్నట్లు అన్నీ వున్నాయి. సరైన స్క్రిప్ట్ తప్ప. బోలెడు ఖర్చు. ఆ ఖర్చుకు తగినట్లు సాంకేతిక నిపుణులు. వారి నుంచి రాబట్టిన మంచి పనితనం. అలాగే అడవి..దాని కోసం పాటుపడే హీరో, మరో పక్కన నక్సలైట్లు, ఇంకో పక్క రాజకీయ నాయకులు, వీరి మధ్యలో గ్రామీణ ప్రజలు. ఇలా కథకు కావాల్సిన మంచి సెటప్ వుంది. కానీ ఇవన్నీ వాడుకుని మంచి స్క్రిప్ట్ తయారుచేసుకోవడం కానీ, మంచి అవుట్ పుట్ రాబట్టడం కానీ దర్శకుడు ప్రభు చేయలేకపోయాడు.

రియల్ లైఫ్ ఆధారంగా సినిమా తీయడం అన్నదాంట్లో ఓ సమస్య వుంటుంది. కొన్ని పరిథుల మధ్య, పరిమితుల మధ్య పని చేయాల్సి వుంటుంది. హీరోయిజం వరకు ఓకె కానీ కమర్షియల్ సినిమాకు కావాల్సిన ఫార్మాట్ ను సెట్ చేయడం కష్టం అవుతుంది. అరణ్య సినిమాకు మాత్రం ఈ ఫార్ములా సెట్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ దర్శకుడు ఎందుకో అటు వెళ్లకుండా, పక్కా రియలిస్టిక్ ఫిల్మ్ లా, ఓ జంగిల్ బుక్ మాదిరిగా హీరో వెర్షన్ ను ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాడు. ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కానీ అదే హీరో చుట్టూ కథ అల్లుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు. లేదా దర్శకుడు తాను అనుకున్న స్క్రిప్ట్ ఒకటి, తెరకు ఎక్కించింది మరొకటి కావచ్చు. ప్రతి యాంగిల్ ను అలా అలా టచ్ చేసి వదిలేసాడు తప్ప, పూర్తిగా దాంట్లో నిమగ్నమై, ఆ దిశగా ఆలోచించి, బలమైన కథను తయారు చేసుకోలేకపోయాడు. గజరాజు హీరో క్యారెక్టర్ ను, అతని మామ క్యారెక్టర్ ను ఈ సినిమాలోకి తీసుకువచ్చే ఐడియా, ఆ హీరోకు నక్సల్ యువతితో ముడిపెట్టే ఆలోచన బాగుంది. కానీ దాన్ని మరీ అరకొరగా ముగించాడు, అలాగే జర్నలిస్ట్ అమ్మాయి క్యారెక్టర్ కూడా. ఉద్యోగం వదులుకుని, అడవుల్లో హీరో వెంట తిరుగుతూ కెమేరాకు పని చెప్పడం తప్ప, దానివల్ల ప్రయోజనం ఏమిటో, దాని లక్ష్యం ఏమిటో అర్థం కాదు. హీరోను, ఉద్యమాన్ని అణిచేయడం కోసం భారీ కసరత్తు చూపించి, చివర్న క్లయిమాక్స్ మాత్రం యూ ట్యూబ్ లైవ్ సాయంతో చటుక్కున తేల్చేసారు.

కథే అసంబద్దంగా వుందీ అనుకుంటే దానికి ఓ లాజిక్కూ లేదు. అడవి కాస్సేపు సిటీ కి పక్కన వున్నట్లు చూపిస్తారు. కాస్సేపు భీకర అడవి, ఎక్కడో లోయల్లో టౌన్ షిప్ అన్నట్లు చూపిస్తారు. ఓ ప్రయివేట్ టౌన్ షిప్ ఓపెనింగ్ కు ప్రధానమంత్రి రావడం, కాస్సెపు హెలికాప్టర్ లాండింగ్ అని, మరి కాస్సేపు రోడ్ వే లో అని, చిన్న ఆర్టికల్ న్యూస్ లో వస్తే రిపోర్టర్ ఉద్యోగం తీయించడం, కానీ నేషనల్ వైడ్ గా కలకలం వచ్చినా ఏమీ కాదు. అయితే క్లయిమాక్స్ మాత్రం పక్కాగా సినిమాటిక్ గా దీనికి రివర్స్ గా వుంటుంది.

సినిమాలో సందడి, హడావుడి ఎక్కువ. విషయం తక్కువ. భారీ సిజి పనితనం, అద్భుతమైన అడియోగ్రఫీ ఇవన్నీ చాలా బాగుంటాయి. రానా కోసం ఢిల్లీలో అలాగే అడవిలోని భారీ చెట్టు మీద పెట్టిన రెండు ఫైట్లు మరీ అసహజంగా వున్నాయి. దాంతో ప్రేక్షకులు వాటితో కనెక్ట్ కారు.

ఇలాంటి సినిమాలో ఎంతో మంది వున్నా, ఒక్క రానా కు మాత్రం బాగా చేసాడు అనే పేరు వస్తుంది. అంతకు మించి ఎవరికీ పేరూ రాదు, సినిమాకు అంతకన్నా రాదు. టోటల్ గా సినిమా మొత్తం ఓ కర్త, కర్మ, క్రియ వున్న స్క్రిప్ట్ లా కాకుండా డాక్యుమెంటరీగా వుండడంతో ఫ్రేక్షకులు తలనొప్పితో బయటకు వస్తారు.

ప్లస్ పాయింట్లు
రానా
సిజి వర్క్

మైనస్ పాయింట్లు
స్క్రిప్ట్

ఫినిషింగ్ టచ్: అరణ్య రోదన

-సూర్య

This post was last modified on March 26, 2021 10:13 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

బుజ్జి తల్లి పాస్… దేవి ఫ్యాన్స్ హ్యాపీ

నాగచైతన్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తండేల్ నుంచి నిన్న మొదటి ఆడియో సింగల్ రిలీజయ్యింది. అక్కినేని…

47 mins ago

వీర్ వారసుడొచ్చాడు..

క్రికెట్‌ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేసిన ఈ అగ్రశ్రేణి…

1 hour ago

కంటెంట్ సినిమాల మినీ యుద్ధం

టాలీవుడ్ ప్రేమికుల కోసం కొత్త శుక్రవారం సిద్ధమయ్యింది. ఈ రోజు రిలీజవుతున్న వాటిలో ప్రధానంగా మూడు సినిమాలు ఆడియన్స్ దృష్టిలో…

2 hours ago

చిరంజీవి అంటే అంత ఇష్టం – అల్లు అర్జున్

గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ వేదికగా మెగాభిమానులు వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రగడ చూస్తూనే ఉన్నాం.…

2 hours ago

2024 సంక్రాంతి.. మొత్తం దిల్ రాజే

సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…

4 hours ago