లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్స్ నెమ్మదిగా మొదలు పెట్టారు కానీ అవుట్ డోర్ వెళ్లి చేయడానికి నిర్మాతలు సంకోచిస్తున్నారు. విదేశాల్లో షూటింగ్స్ పెట్టుకున్న వాళ్ళైతే అంత త్వరగా ముందుకు కదలడం లేదు. అలా విదేశాలలో షూటింగ్ ప్లాన్ చేసుకున్న సినిమాలు అన్నిటికీ ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ మార్గదర్శిగా మారింది.
ఈ చిత్రం బృందం ఇప్పటికే ఇటలీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ముందుగా పద్నాలుగు రోజుల క్వారంటైన్ లో వుండి, అనంతరం షూటింగ్ మొదలు పెడతారు. అక్కడ షూటింగ్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బందులుంటాయా, దానికి చేయాల్సిన ప్రాసెస్ ఏమిటి వగైరా అన్నీ రాధే శ్యామ్ బృందం నుంచి తెలుసుకుని వచ్చే నెలలో అక్కడకు వెళ్లాలని చాలా మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.
రాధే శ్యామ్ షూట్ కనుక ఏ సమస్య లేకుండా జరిగిపోతే యూరప్ లో షూట్ ప్లాన్ చేసిన సినిమాలు ఒక్కోటిగా ఫ్లైట్ ఎక్కుతాయి. ఒకవేళ ఈ సినిమా షూటింగ్ కి ఇబ్బందులు వచ్చాయని తెలిస్తే మాత్రం అవన్నీ డ్రాప్ అవుతాయి. అందుకే ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పుడు యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ ఎదురు చూస్తోందంటే అతిశయోక్తి కాదు.
This post was last modified on October 1, 2020 10:38 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…