సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా కోసం ఎన్నో ఏళ్ల నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘మగధీర’ కంటే ముందే వీరి కలయికలో సినిమా రావాల్సింది. కానీ రకరకాల కారణాల వల్ల అది సాధ్య పడలేదు. ఐతే ఆలస్యమైతే అయింది కానీ.. రాజమ ౌళి భారత నంబర్ వన్ దర్శకుడిగా, ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించిన సమయంలో మహేష్‌తో సినిమా చేయబోతుండటం అభిమానులకు ఒకింత ఆనందమే కలిగిస్తోంది.
వీరి సినిమా కోసం కేవలం భారతీయ ప్రేక్షకులే కాక వరల్డ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మామూలుగానే రాజమౌళి సినిమా అంటే కథ తయారీ, ప్రి ప్రొడక్షన్ పనులకు చాలా టైం పడుతుంది. మహేష్‌తో ఆయన చేసే సినిమా మీద అంచనాలు మరీ ఎక్కువగా ఉండడంతో మరింత టైం తీసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజైన రెండున్నరేళ్లకు కూడా ఈ సినిమా మొదలు కాలేదు.
ఐతే ఎట్టకేలకు మహేష్-రాజమౌళి సినిమా చిత్రీకరణకు ముహూర్తం కుదిరింది. ఈ చిత్రం 2025 జనవరిలో సెట్స్ మీదికి వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. తాజాగా ఆయన ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా.. మహేష్-రాజమౌళి సినిమా గురించి అభిమానులు అడుగుతుంటే.. జనవరిలో చిత్రీకరణ మొదలువుతుందని చెప్పారు.
ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా కోసం వర్క్ షాప్స్‌లో పాల్గొంటుండగా.. రాజమ ౌళి డమ్మీ షూట్స్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సెట్స్ నిర్మాణం జరుగుతోంది. ప్రి ప్రొడక్షన్ పనులు డిసెంబరు నెలకు పూర్తవుతాయట. జనవరిలో సినిమాను లాంఛనంగా మొదలుపెట్టి దాంతో పాటే రెగ్యులర్ షూటింగ్ కూడా ఆరంభిస్తారట. ఈ సినిమా కనీసం రెండేళ్ల పాటు చిత్రీకరణ దశలో ఉంటుందని అంచనా. 2027లో కానీ రిలీజ్ ఉండకపోవచ్చు.
This post was last modified on October 10, 2024 11:09 am
ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…