Movie News

పోలీస్ మసాలా సినిమాలో రామాయణం వాడేశారు

మాస్ పోలీస్ గా సింగంని పరిచయం చేసింది కోలీవుడ్ హీరో సూర్య, దర్శకుడు హరినే అయినప్పటికీ దాన్ని విజయవంతంగా సీక్వెల్స్ రూపంలో ముందుకు తీసుకెళ్తున్నది మాత్రం బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టినే. ఈ ఫ్రాంచైజ్ లో వస్తున్న కొత్త మూవీ సింగం అగైన్ ఈ నెలాఖరు దీపావళి పండగ సందర్భంగా విడుదల కాబోతోంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే మొదటిసారి అయిదు నిమిషాలకు అతి దగ్గరగా ఉన్న ట్రైలర్ గా ముంబై మీడియా అభివర్ణిస్తోంది. అంతేకాదు హిందీలోనే అతి పెద్ద మల్టీస్టారర్స్ లో ఒకటిగా దీని స్థానం ప్రత్యేకంగా ఉంటుందని భారీ అంచనాలు రేపుతున్నారు.

మాములుగా పోలీస్ స్టోరీలు ఒకే టెంప్లేట్ లో వెళ్తాయి. చిన్న చిన్న మార్పులు తప్పించి అంకుశం నుంచి సింగం దాకా అన్నింటిలో ఇదే వరస. అందుకే రోహిత్ శెట్టి ఈసారి తెలివిగా రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకుని కథను రాసుకున్నాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన సింగం ఇందులో రాముడు. భార్య కరీనా కపూర్ సీతాదేవి. ఎక్కడో శ్రీలంకలో ఉండే విలన్ అర్జున్ కపూర్ రావణుడు. ఓసారి ఆమెను ఎత్తుకెళ్లిపోతాడు. మధ్యలో సాయం కోసం హనుమంతుడు అలియాస్ రణ్వీర్ సింగ్ ఎంట్రీ ఇస్తాడు. లక్ష్మణుడిగా టైగర్ శ్రోఫ్, గరుత్మంతుడి షేడ్ లో అక్షయ్ కుమార్ తో పాటు బోనస్ గా లేడీ సింగం దీపికా పదుకునే ఉంటుంది.

వీళ్ళందరూ కలిసి సీతను కాపాడుకోవడంతో పాటు శత్రు సంహారం ఎలా చేశారనే పాయింట్ మీద సింగం నడుస్తుంది. ఎప్పటిలాగే నమ్మశక్యం కానీ యాక్షన్ ఎపిసోడ్లు, ఛేజింగులు, బాంబ్ బ్లాస్టులు, వాహనాల హంగామా ఒకటా రెండా ఈసారి రోహిత్ శెట్టి మాములు మసాలా దట్టించలేదు. నార్త్ ట్రేడ్ విశ్లేషణ ప్రకారం స్త్రీ 2కి మూడింతల ఎక్కువ ఓపెనింగ్ తో పాటు జవాన్, పఠాన్ రికార్డులను సులభంగా బద్దలు కొట్టే స్థాయిలో సింగం అగైన్ అరాచకం సృష్టించడం ఖాయమంటున్నారు. కంటెంట్ అయితే సాలిడ్ గా అనిపిస్తోంది. మాస్ కి కనక కనెక్ట్ అయితే మాత్రం సింగల్ స్క్రీన్లలో రికార్డుల పాతరే.

This post was last modified on October 7, 2024 6:05 pm

Share

Recent Posts

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

35 minutes ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

2 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

3 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

5 hours ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

5 hours ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

7 hours ago