వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడి విడుదలై మూడు నెలలు దాటినా ఒక్క విషయంలో ఎదురీదుతోందని ఇన్ సైడ్ టాక్. ఇప్పటిదాకా ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన శాటిలైట్ ఒప్పందం ఫైనల్ కాలేదని సమాచారం.
పలు ఛానెల్స్ తో సంప్రదింపులు జరిపినప్పటికీ నిర్మాతలు డిమాండ్ చేస్తున్న మొత్తానికి, ఛానల్ యజమాన్యాలు ఇవ్వాలనుకుంటున్న దానికి వ్యత్యాసం భారీగా ఉండటం వల్లే డీల్ ఆలస్యమవుతోందని అంటున్నారు కానీ కారణాలు నిర్ధారణగా తెలియలేదు. స్టార్ మా, జీ గ్రూప్ తో ప్రాధమికంగా జరిగిన డిస్కషన్లు ఇంకా ఫలితం ఇవ్వలేదట.
వాస్తవిక కోణంలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఓటిటిలు పెరిగాక టీవీ ఛానల్స్ లో యాడ్స్ భరిస్తూ కొత్త సినిమాలు చూసే ప్రేక్షకులు గణనీయంగా తగ్గిపోయారు. పైగా నాలుగు వారాల గ్యాప్ లోనే భారీ చిత్రాలు ఓటిటిలో వచ్చేస్తున్నాయి.
చాలా చోట్ల లోకల్ కేబుల్ ఆపరేటర్లు వీటిని తమ ప్రైవేట్ ఛానల్స్ ద్వారా ప్రసారం చేసి చందాదారులను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. లీగల్ గా ఇది సరికాకపోయినా ఎవరూ సీరియస్ గా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో శాటిలైట్ హక్కుల కోసం డిమాండ్ గణనీయంగా తగ్గిపోయింది. ఓటిటిలే నిర్మాతలకు టర్మ్స్ చెబుతున్న నేపథ్యంలో ఈ ట్రెండ్ పడిపోవడం సహజం.
ఈ సమస్య ఒక్క కల్కికే కాదు చాలా ప్యాన్ ఇండియా సినిమాలకు ఎదురవుతోంది. ప్రొడ్యూసర్లు సైతం ఓటిటి నుంచి ఆదాయమే ఆకర్షణీయంగా ఉండటంతో ముందు ఆ డీల్స్ చేసుకుని ఆ తర్వాత ఛానల్స్ తో మాట్లాడుతున్నారు. ఒకవేళ వర్కౌట్ కాకపోయినా పెద్దగా టెన్షన్ పడటం లేదు.
కాకపోతే ఇంతకు ముందు వచ్చేంత డబ్బులు ఇప్పుడు శాటిలైట్స్ ద్వారా బాగా తగ్గిపోవడం ఎంతో కొంత ప్రభావం చూపిస్తోంది. క్రమంగా దీనికి అలవాటు పడక తప్పదు. బుల్లితెరపై టీవీ సీరియల్స్ కు దక్కే ఆదరణ ఇప్పుడు సినిమాలకు లేని తరుణంలో ట్రెండ్ మొత్తం ఓటిటికి సానుకూలంగా మారిపోయింది. ఇప్పట్లో ఇది మారదు.
This post was last modified on October 6, 2024 12:49 pm
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…
ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్డేట్…
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…
భారత్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లోనే కాదు…