ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్.. ఇలా ఇప్పటికే చాలామంది టాప్ స్టార్లతో సినిమాలు చేశాడు కొరటాల శివ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కూడా ఇప్పటికే సినిమా చేయాల్సింది. కానీ వీళ్లిద్దరి కాంబినేషన్లో అనౌన్స్ అయిన సినిమా ఎందుకో ఆగిపోయింది. కాన్సెప్ట్ పోస్టర్ కూడా లాంచ్ చేసిన సినిమా ముందుకు కదలకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆ చిత్రం స్థానంలోనే ‘దేవర’ వచ్చింది.
ఐతే బన్నీతో ఇప్పుడు క్యాన్సిల్ అయిన సినిమా సంగతెలా ఉన్నప్పటికీ.. తమ కలయికలో ఒక సినిమా కచ్చితంగా వస్తుందని అంటున్నాడు కొరటాల శివ. తన తొలి చిత్రం ‘మిర్చి’ని బన్నీ కుటుంబ సమేతంగా చూసి చాలా ఎంజాయ్ చేశాడని.. అప్పట్నుంచి తనతో సినిమా చేయాలని అనుకుంటున్నాడని.. తాను కూడా ఆసక్తిగానే ఉన్నానని.. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా కుదరలేదని.. కానీ త్వరలో తమ కలయికలో సినిమా ఉంటుందని చెప్పాడు కొరటాల.
ఇక ‘దేవర’ మూవీని బయటి వ్యక్తులు చాలామంది చూశారని.. సినిమా గురించి అలా అన్నారని, ఇలా అన్నారని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను కొరటాల ఖండించాడు. బయటి వ్యక్తులు ఎవ్వరూ సినిమా చూడలేదని ఆయన స్పష్టం చేశారు. తాను, ఎన్టీఆర్ కలిసి మూడుసార్లు సినిమా చూశామన్నారు. అలాగే తాను విడిగా రెండుసార్లు, తారక్ ప్రత్యేకంగా ఇంకోసారి సినిమా చూశామన్నారు. ఆయా సందర్భాల్లో తమతో పాటు కుటుంబ సభ్యులు, యూనిట్ సభ్యులు మాత్రమే ఉన్నారని.. తమ అందరికీ సినిమా నచ్చిందని.. అక్కడ సినిమా చూసిన వాళ్లు అందరూ ఓపెన్‌గా తమ అభిప్రాయం చెప్పేవాళ్లే అని కొరటాల తెలిపాడు.
తారక్‌కు కూడా సినిమా ఎంతో నచ్చిందని.. ఆయనకు ఏదైనా నచ్చకపోతే మొహంలోనే తెలిసిపోతుందని.. ఏదీ దాచుకునే మనస్తత్వం తనది కాదని కొరటాల అన్నాడు. తమకు నచ్చినట్లే ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on September 26, 2024 7:39 pm
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…
మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…
తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…
21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…