మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. ఇలా వరుసగా తొలి నాలుగు చిత్రాలతో బ్లాక్‌బస్టర్లు అందుకున్నాడు కొరటాల శివ. దీంతో మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘ఆచార్య’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ చిత్రంతో కొరటాల తీవ్ర నిరాశకు గురి చేశాడు. అయినా తన మీద జూనియర్ ఎన్టీఆర్ నమ్మకం పెట్టాడు. భారీ బడ్జెట్లో ‘దేవర’ తెరకెక్కింది. ఈ చిత్రం వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇప్పుడు విడుదల కాబోయేది ‘దేవర పార్ట్-1’ మాత్రమే. దీనికి కొనసాగింపుగా ఇంకో సినిమా ఉంది. దాని స్టేటస్ ఏంటో తెలియదు. ‘దేవర-1’ తేడా కొడితే తప్ప పార్ట్-2 కచ్చితంగా ఉంటుంది. కాబట్టి ‘దేవర-1’ తర్వాత కొరటాల సెకండ్ పార్ట్ మీదే దృష్టిపెట్టబోతున్నాడని అందరికీ తెలుసు. ఇలాంటి టైంలో కొరటాల కొత్త సినిమా గురించి వేరే కబురు ఒకటి బయటికి వచ్చింది. అతను ప్రభాస్ సినిమా కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాడన్నది ఆ కబురు.
ఓ పెద్ద సినిమా విడుదల కాబోతుంటే దాని దర్శకుడి తర్వాతి సినిమా గురించి కూడా చర్చ జరగడం మామూలే. కానీ కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మొన్నటిదాకా చర్చ లేదు. కానీ ఇప్పుడు ప్రభాస్ కోసం అతను ఓ కథ రెడీ చేస్తున్నాడని.. ఓ పెద్ద నిర్మాణ సంస్థే ఆ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుందని ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
తనకు ‘మిర్చి’ మరపు రాని హిట్ ఇచ్చిన కొరటాలతో మరో సినిమా చేయడానికి ప్రభాస్ సుముఖంగానే ఉండొచ్చు. కానీ అతడికి కొన్నేళ్ల పాటు ఖాళీ లేదు. రాజాసాబ్, హను రాఘవపూడి సినిమా, సలార్-2, కల్కి-2, స్పిరిట్.. ఇలా తను పెద్ద లైనప్పే ఉంది. కాబట్టి కొరటాల కథ రెడీ చేసినా వచ్చే రెండు మూడేళ్లలో తనకు డేట్లు ఇచ్చే అవకాశం లేదు. మరోవైపు కొరటాల కూడా ‘దేవర-2’ను వదిలేసి ఇంకో సినిమా మీదికి వెళ్తాడా అన్నది డౌటే. ఐతే ‘దేవర’కు కొంచెం హైప్ పెంచడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ లీక్స్ ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో.
This post was last modified on September 22, 2024 11:29 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…