తమిళ హీరో ధనుష్ కేవలం ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే.. తనలో మంచి అభిరుచి ఉన్న దర్శకుడు, కథా రచయిత, లిరిసిస్ట్, సింగర్ కూడా ఉన్నారు. ఈ విభాగాలన్నింట్లో అతను టాలెంట్ చూపించాడు. ‘పవర్ పాండి’ అనే సినిమాతో దర్శకుడిగా శుభారంభం చేసిన అతను.. ఇటీవలే ‘రాయన్’ మూవీతో పెద్ద హిట్ కొట్టాడు.
ఈ ఊపులో ధనుష్ దర్శకుడిగా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరు.. ఇడ్లి కడై (ఇడ్లి కొట్టు) కావడం విశేషం. ఇందులోనూ ధనుషే హీరో. తన సొంత స్క్రిప్టుతో డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రి లుక్ పొయెటిగ్గా కనిపిస్తోంది. ఆర్టిస్టులు ఎవరినీ చూపించకుండా తెల్లవారుజామున ఓ ఇడ్లి కొట్టును చూపించారు. ఇది చూస్తే ఈసారి ధనుష్ ఏదో ప్రయోగం చేయబోతున్నట్లే కనిపిస్తోంది.
డాన్ ఫిలిమ్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. దర్శకుడిగా ధనుష్ తొలి సినిమా ‘పవర్ పాండి’ అందరినీ ఆశ్చర్యపరిచింది. మిడిలేజ్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన రాజ్ కిరణ్‌ను ప్రధాన పెట్టి హృద్యమైన సినిమా తీశాడు ధనుష్. అందులో ఆ పాత్రను యుక్త వయసులో ఉన్నపుడు తనే కనిపించాడు. రెండో సినిమాలో తనే హీరోగా నటిస్తూ ఫుల్ మాస్ చూపించాడు. ఈ సినిమా తమిళంలో కమర్షియల్‌గా కూడా పెద్ద సక్సెస్ అయింది.
ఇప్పుడు ధనుష్ దర్శకుడిగా పూర్తి భిన్నమైన దారిలో పయనించేట్లే కనిపిస్తున్నాడు. పేరు, ప్రి లుక్ చూస్తే అతను ‘కాకా ముట్టై’ తరహా అవార్డ్ మూవీ ఏమైనా ట్రై చేస్తున్నాడా అనిపిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలవుతుంది. ప్రస్తుతం ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
This post was last modified on September 20, 2024 4:09 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…