మామూలుగా యాంకర్లంటే అమ్మాయిలే. వారికే క్రేజ్, ఫాలోయింగ్ ఉంటాయి. మేల్ యాంకర్లను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వారికి ఫాలోయింగ్ అంతంతమాత్రమే. చేసే ప్రోగ్రాంలు కూడా తక్కువే. మెజారిటీ ప్రోగ్రాంలను నడిపించేది లేడీ యాంకర్లే. ఐతే వాళ్లకు నిలిచి.. తెలుగు మేల్ యాంకర్లలో ఎవరూ అందుకోని స్థాయిని చేరుకున్న వ్యక్తి ప్రదీప్. గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాంతో మొదలుపెట్టి.. తన వాక్చాతుర్యంతో, హాస్య చతురతతో, చలాకీతనంతో ఎన్నో ప్రోగ్రాంలను సూపర్ సక్సెస్ చేసిన ఘనత ప్రదీప్‌ది. కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను, ఢీ లాంటి ప్రోగ్రాంలతో అతడి పాపులారిటీ మరింత పెరిగింది. ఈ పాపులారిటీని ఉపయోగించుకుని ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగానూ అరంగేట్రం చేశాడు ప్రదీప్. అది విడుదలకు కూడా సిద్ధమైంది.
యాంకరింగ్‌ను పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ప్రదీప్ గురించి ఎప్పుడూ చర్చల్లో ఉండే అంశం.. అతడి పెళ్లి. ఫలానా అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట.. ఈ అమ్మాయితో పెళ్లట అని తరచుగా రూమర్లు పుడుతుంటాయి. హీరోయిన్ల ఎఫైర్ల గురించి మాట్లాడుకున్నట్లు ప్రదీప్ పెళ్లి గురించి కూడా నెటిజన్లు తరచుగా చర్చిస్తుంటారు. ఐతే ఇప్పటిదాకా ఆ వార్తలేవీ నిజం కాలేదు. ఇప్పుడు మాత్రం ప్రదీప్ పెళ్లి ఫిక్సయినట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. రాయలసీమకు చెందిన ఒక రాజకీయ నేత కూతురితో ప్రదీప్‌కు పెళ్లి నిశ్చయం అయినట్లు చెబుతున్నారు. ఆ అమ్మాయి కూడా రాజకీయాల్లో ఉందని.. ఆమెకు ప్రదీప్ అంటే ఇష్టమని.. అటు నుంచే ప్రపోజల్ రావడంతో ప్రదీప్ ఫ్యామిలీ ఈ పెళ్లికి ఒప్పేసుకుందని అంటున్నారు. అతి త్వరలోనే ప్రదీప్ పెళ్లి గురించి అధికారిక ప్రకటన వస్తుందని.. కొన్ని నెలల్లోనే పెళ్లి కూడా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్త ఎంత వరకు నిజమో?
This post was last modified on September 29, 2020 9:38 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…