Movie News

తెలుగు డబ్బింగ్ పేర్లకు కరువొచ్చింది

ఈ మధ్య కాలంలో తమిళ టైటిల్స్ ని యధాతథంగా ఉంచేసి తెలుగులో డబ్బింగ్ చేయడం పరిపాటిగా మారింది. తలైవి, వలిమైతో మొదలుపెట్టి నిన్నటి తంగలాన్ వరకు ఇదే వరస. ప్యాన్ ఇండియా బాషల కోసం ఒకే పేరు ఉండాలనేది కేవలం సమర్ధించుకోవడానికి వాడుకునే ఆయుధం. నాని సరిపోదా శనివారంని తమిళ, మలయాళ, హిందీ ఆడియన్స్ కోసం సూర్యాస్ సాటర్డే అని పెట్టారు. గతంలో అన్నాతేని టాలీవుడ్ కి పెద్దన్నగా మార్చారు. జైలర్ లాంటి యునానిమస్ ఇంగ్లీష్ టైటిల్ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు వేట్టయన్ కి కనీసం వేటగాడులాంటి పేరైనా పెట్టొచ్చుగా.

మాస్ ఆడియన్స్ సంగతి పక్కనపెడితే ఉన్నత చదువులున్న ప్రేక్షకుల్లో తమిళ బాష రాని వాళ్ళు లక్షలు, కోట్లలో ఉంటారు. వాళ్ళకే అర్థం కానప్పుడు ఇక సగటు జనాల గురించి చెప్పేది ఏముంది. క్యాప్షన్ గా ఒక ఇంగ్లీష్ లైన్ పెట్టి చేతులు దులిపేసుకుంటే సరిపోదుగా. బాలీవుడ్ ఈ ట్రెండ్ పాటించడం లేదు. వరుణ్ ధావన్ భేడియాని తోడేలుగా అనువదించారు. ఆడినా ఆడకపోయినా భాషకిచ్చే గౌరవం అది. కానీ తమిళ డబ్బింగులు మాత్రం మరీ అన్యాయంగా ప్రవర్తిస్తూ టైటిల్ చివర ‘న్’ ఉంటే చాలు అదే పెట్టేస్తున్నారు.

ఏది ఏమైనా ఇది ఎంత మాత్రం సమర్ధనీయమైన పోకడ కాదు. ఒకవేళ అన్ని లాంగ్వేజెస్ లో ఒకే పేరు ఉండాలనుకున్నప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటివి పెట్టుకోవడం ఉత్తమం. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతేతప్ప అర్థం కానీ ఒరిజినల్ వెర్షన్ టైటిల్ నే కొనసాగించడం సబబు కాదు. క్రమంగా ఈ పోకడని అలవాటు చేయడం వల్ల తెలుగు బాషా ప్రేమికులు సైతం ఇదో సమస్యే కాదన్నట్టు ఊరుకుంటున్నారు. ఎక్కడిదాకో ఎందుకు ఇండియన్ 2ని మన దగ్గర భారతీయుడు 2 అని ఎందుకు అన్నారు. ఏతావాతా తేలేదేమంటే నిజంగా మార్చాలని ఉంటే అవకాశం ఉంది కానీ కావాలనే వాడుకోవడం లేదు.

This post was last modified on September 17, 2024 3:14 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

37 minutes ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

44 minutes ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

3 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago