జయం రవి తమిళంలో చెప్పుకోదగ్గ స్టారే అయినప్పటికీ తెలుగులో మార్కెట్ లేదు. పొన్నియిన్ సెల్వన్ లో టైటిల్ రోల్ పోషించాక మనకు కాస్త దగ్గరయ్యాడు. నిన్న తన భార్య ఆర్తితో విడిపోతున్నానని చెబుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
18 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న జీవిత భాగస్వామితో తప్పనిసరి పరిస్థితుల్లో విడాకులు తీసుకోక తప్పడం లేదని చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే కోలీవుడ్ లో ఈ జంటకు మంచి పేరుంది. క్యూట్ కపుల్ గా పలు సందర్భాల్లో మీడియాలో హైలైట్ అవుతూ వచ్చింది.
ఇప్పుడో కొత్త ట్విస్టు వచ్చింది. జయం రవి భార్య ఆర్తి అసలు తనకు ఈ విషయమే తెలియదని, తనకు, పిల్లలకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధ కలిగించిందని, భర్తతో మాట్లాడేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నా సాధ్యపడటం లేదని పేర్కొంటూ ఒక సుదీర్ఘమైన మెసేజ్ పోస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
నన్ను తప్పుగా చూపించడం అన్యాయమంటూ కొన్ని మీడియా సంస్థలు, ఫ్యాన్స్ అసోసియేషన్లు ట్విట్టర్ లో బురద జల్లడాన్ని ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించింది. మీ ప్రేమ చూపించండి తప్ప మా గోప్యతని బజారుకీడ్చవద్దంటూ విజ్ఞప్తి చేసింది.
దీనికి జయం రవి ఎలా స్పందిస్తాడో కానీ ఆర్తి ఇలా చేయడం మాత్రం పెద్ద షాకే. జయం రవి పేరుకి తమిళ హీరో అయినా అతని కుటుంబానికి టాలీవుడ్ తో చాలా బంధం ఉంది. తండ్రి ఎడిటర్ మోహన్ ఒకప్పుడు హిట్లర్, మామగారు, బావ బావమరిది లాంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించాడు.
అన్నయ్య మోహన్ రాజా డైరెక్టర్ గా డెబ్యూ చేసింది హనుమాన్ జంక్షన్ తో. మొన్న ఏడాది చిరంజీవి గాడ్ ఫాదర్ తో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు. రామ్ చరణ్ ధృవ ఒరిజినల్ వెర్షన్ తీసింది కూడా ఈయనే. మొత్తానికి పొన్నియిన్ సెల్వన్ గా తెరమీద చెలరేగిన జయం రవికి రియల్ లైఫ్ లో మాత్రం మలుపులు ఎదురవుతున్నాయి.
This post was last modified on September 11, 2024 12:21 pm
తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి ఎందరో హీరోయిన్లు తమలకు ట్రై చేసుకొని బాగా సక్సెస్ అయ్యారు. బాలీవుడ్లో మున్నా…
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీకి ఓ బ్రాండ్ గా మారిన…
చెన్నైలో డ్రగ్స్ కేసులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. విలన్ గా పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న…
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు మెగా అభిమానుల ఫేవరెట్‌గా మారిపోయాడు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా సందర్భం వచ్చినపుడల్లా ఆయన మీద…
బాహుబలి అప్పటిదాకా ఇండియన్ బాక్సాఫీస్‌కు పరిచయం లేని ఫీట్లు ఎన్నో సాధించింది. ఒక్క రోజులో వంద కోట్లు.. ఓవరాల్‌గా వెయ్యి…
సిక్కు మత పెద్దలు విధించిన శిక్షను శిరసావహిస్తూ.. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం ప్రధాన ద్వారం వద్ద.. ద్వారపాలకుడిగా కూర్చున్న మాజీ…