బెంగళూరులో స్థానికేతరుల ఆధిపత్యం గురించి లోకల్స్ గొడవ చేయడం ఎప్పట్నుంచో ఉన్న సమస్య. ఈ మధ్య ఈ గొడవ మరింత తీవ్రమవుతోంది. సినిమాల పరంగానూ ఈ విషయంలో వివాదం ఉంది. కన్నడ సినిమాలకు థియేటర్లు తగిన ప్రాధాన్యం ఇవ్వవని.. తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు పెద్ద పీట వేస్తాయని.. వీటి వల్ల తమ సినిమాలు దెబ్బ తింటున్నాయని కన్నడ సినీ జనాలు తరచుగా విమర్శలు చేస్తుంటారు.
ఆందోళనలూ చేపడుతుంటారు. పర భాషా చిత్రాలకు థియేటర్ల కేటాయింపు విషయంలో కొన్ని నిబంధనలు ఉండాలని, అలాగే మల్టీప్లెక్సుల్లో కన్నడ సినిమాలకు పర్టికులర్ స్క్రీన్లు, షోలు ఇచ్చేలా కూడా రూల్స్ తేవాలని డిమాండ్ కూడా చేస్తుంటారు. కానీ ఇలాంటి రూల్స్ పెట్టడం ఎలా సమంజసమనే ప్రశ్న తలెత్తుంటుంది. అదే చేస్తే మల్టీప్లెక్సులు మూసుకోవాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంటుంది. తాజాగా కన్నడ సినిమాకు వేరే భాషా చిత్రం వల్ల జరుగుతున్న అన్యాయం మీద మరోసారి చర్చ మొదలైంది.
కన్నడలో తాజాగా ‘ఇబ్బని తబ్బిత ఇల్లెయాలి’ అనే సినిమా రిలీజైంది. కిరిక్ పార్టీ, చార్లి 999, సప్తసాగరాలు దాటి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించిన రక్షిత్ శెట్టి ప్రొడ్యూస్ చేయడంతో పాటు స్క్రీన్ ప్లే అందించిన చిత్రమిది. చంద్రజీత్ బెల్లప్ప దర్శకత్వంలో విహాన్ గౌడ, అంకిత అమర్ జంటగా రూపొందిన ఈ ప్రేమకథా చిత్రానికి చాలా మంచి టాక్ వచ్చింది. దీన్నో క్లాసిక్ అంటున్నారు.
ఐతే ఈ కన్నడ చిత్రానికి బెంగళూరులో చాలినన్ని థియేటర్లు ఇవ్వలేదు. మెజారిటీ థియేటర్లు, షోలను తమిళ మూవీ ‘గోట్’తో నింపేశారు. విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఏమంత మంచి టాక్ రాలేదు. తొలి రోజు ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ తర్వాతి రోజు సినిమా డల్ అయింది.
కానీ పరభాషా చిత్రం, పైగా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రానికి వందల కోద్దీ షోలు ఇచ్చి.. మంచి టాక్ సంపాదించిన కన్నడ చిత్రానికి పదుల సంఖ్యలో షోలు కేటాయించడాన్ని కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు చిత్రాలకు కేటాయించిన షోలకు సంబంధించి బుక్ మై షో స్క్రీన్ షాట్లు తీసి.. ఎన్నాళ్లీ పరభాషా చిత్రాల ఆధిపత్యం అంటూ సోషల్ మీడియాలో గొడవ చేస్తున్నారు కన్నడిగులు.
This post was last modified on September 7, 2024 11:25 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…