నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ప్రకటన రానే వచ్చింది. నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయుడు మోక్షజ్ఞ అరంగేట్ర సినిమా ఎట్టకేలకు ఖరారైంది. శుక్రవారం మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా సరికొత్త పోస్టర్‌తో ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్‌లో భాగంగా విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నారు. మోక్షజ్ఞ సోదరి తేజస్విని ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామి కావడం.. బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘లెజెండ్’ పేరుతోనే నిర్మాణ సంస్థను నెలకొల్పడం విశేషం. ఐతే శుక్రవారం కేవలం పోస్టర్‌తోనే సరిపెట్టారు. ఈ రోజుకు అనౌన్స్‌మెంట్ మాత్రమే. మోక్ష తొలి చిత్రం లాంచింగ్ వ్యవహారం వేరుగా ఉండబోతోంది.
బాలయ్య ప్రత్యేకంగా ముహూర్తం పెట్టించి మోక్షు తొలి సినిమా ముహూర్త వేడుకను అంగరంగ వైభవంగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ నుంచి అతిరథ మహారథులను పిలిచి.. అభిమానులను కూడా ఆహ్వానించి ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి చూస్తున్నారట.
అభిమానులు ఎన్నో ఏళ్ల పాటు ఎదురు చూసిన అరంగేట్రం కావడం.. ఈ సినిమాకు ఆరంభం నుంచే భారీ హైప్ తీసుకురావడం అవసరమని భావించి లాంచింగ్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా చేయాలని అనుకుంటున్నారట.
అక్టోబరులో మంచి ముహూర్తం చూసి ఈ వేడుక చేస్తారని.. వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోతుందని.. వచ్చే ఏడాది సినిమా రిలీజవుతుందని నందమూరి కుటుంబ వర్గాల సమాచారం.
This post was last modified on September 7, 2024 10:39 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…