వెటరన్ దర్శకుల్లో కంబ్యాక్ కావాలని అభిమానులు కోరుకుంటున్న వాళ్ళలో శ్రీను వైట్ల పేరు ముందుంది. ఒకప్పడు దూకుడు, వెంకీ, ఆనందం లాంటి బ్లాక్ బస్టర్స్ తో రికార్డులు బద్దలు కొట్టిన ఈ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ గత కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. మహేష్ బాబు ఆగడు నుంచి మొదలైన డౌన్ ఫాల్ అమర్ అక్బర్ ఆంటోనీ వరకు కొనసాగింది. కానీ ఈసారి లెక్క మారేలా కనిపిస్తోంది. గోపిచంద్ హీరోగా రూపొందుతున్న విశ్వం వచ్చే నెల అక్టోబర్ 11 విడుదల కానుంది. రెండు నిమిషాల టీజర్ లో వినోదాన్ని ఎక్కువగా జొప్పించి శీను వైట్ల ఉద్దేశాన్ని స్పష్టం చేశారు.
ముఖ్యంగా ట్రెండ్ ఫాలో అవుతూ పెట్టిన జోకులు యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. మా టైం వచ్చినప్పుడు కొడతాం, నాకు గీత ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మార్షల్ ఆర్ట్స్ తెలియదు లాంటి డైలాగులు హిలేరియస్ గా ఉన్నాయి. నరేష్, ప్రగతి, వెన్నెల కిషోర్ పాత్రలను తీర్చిదిద్దిన విధానం, వెంకీ స్టైల్ లో డిజైన్ చేసిన ట్రైన్ ఎపిసోడ్ అంచనాలు రేపెలా ఉన్నాయి. యాక్షన్ టచ్ ఉంది కానీ ఆ కథకు సంబంధించిన కీలకమైన క్లూస్ ఇందులో ఇవ్వలేదు. ఇటీవలే డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ తో షాక్ తిన్న హీరోయిన్ కావ్య థాపర్ కు సైతం దీని సక్సెస్ చాలా కీలకం.
గోపీచంద్ కు బలమైన బ్లాక్ బస్టర్ పడి ఏళ్ళు గడిచిపోయాయి. ఫ్యాన్స్ తగ్గలేదు కానీ తన స్టామినాని సరిగా వాడుకునే కాంబోలు, దర్శకులు పడటం లేదు. విశ్వం ఆ లోటు తీరిస్తే సరి. రజనీకాంత్ వెట్టయన్ తప్ప దసరా బరిలో పెద్దగా చెప్పుకునే సినిమాలేవీ లేకపోవడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దొరికిన గ్యాప్ ని కనక విశ్వం వాడుకుంటే హిట్టు ఖాతాలో వేసుకోవచ్చు. ముందు ప్రకటించిన ప్రకారం ఆ టైంలో రావాల్సిన దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27కి షిఫ్ట్ అయిపోవడంతో పండగ స్లాట్ ఖాళీ అయ్యింది. ఎవరు వాడుకుంటారా అని చూస్తే విశ్వం తెలివిగా మంచి డేట్ పట్టేశాడు.
This post was last modified on September 3, 2024 6:09 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…