ఆగస్టు 25 అనగానే ఐదేళ్ల ముందు వరకు విజయ్ దేవరకొండ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేసేవి. 2017లో అదే రోజు అర్జున్ రెడ్డి అనే కల్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ రిలీజై పెను సంచలనం రేపింది. ఓ కొత్త దర్శకుడు, అప్ కమింగ్ హీరో కలిసి చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన వసూళ్లు.. ఇతర భాషల ప్రేక్షకుల నుంచి కూడా తెచ్చుకున్న స్పందన అసామాన్యం.
అప్పటికి అలా ప్రకంపనలు రేపడమే కాక.. తర్వాత కూడా తెలుగు సినిమాను ఎంతగానో ప్రభావం చేసిన చిత్రమిది. 2017 తర్వాత ప్రతి ఏడాదీ ఆగస్టు 25 వస్తే విజయ్‌తో పాటు తన అభిమానులు ఆ తేదీని బాగా సెలబ్రేట్ చేసేవాళ్లు. ఆ సినిమా జ్ఞాపకాలత మైమరిచిపోయేవారు.
కానీ 2022 ఆగస్టు 25 మాత్రం వాళ్లకు పీడకలను మిగిల్చింది. అర్జున్ రెడ్డి డేట్‌కే ఇంకో బ్లాక్‌బస్టర్ కొట్టాలని ఆ ఏడాది విజయ్ చేసిన ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అతను చేసిన లైగర్ భారీ డిజాస్టర్‌గా మిగిలింది. అర్జున్ రెడ్డి అమితానందాన్నిచ్చిన అదే రోజు విజయ్‌కే మరపురాని చేదు జ్ఞాపకాన్నిచ్చింది లైగర్.
గత ఏడాది, ఇప్పుడు ఆగస్టు 25 అంటే అర్జున్ రెడ్డి ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కంటే లైగర్ తాలూకు జ్ఞాపకాలతో బాధ పడడమే ఎక్కువగా కనిపిస్తోంది విజయ్ అభిమానుల్లో. ఆదివారం నాడు విజయ్ అర్జున్ రెడ్డి ఏడో వార్షికోత్సవం నేపథ్యంలో ఒక పోస్ట్ పెట్టాడు. అర్జున్ రెడ్డి డైరెక్టర్స్ కట్ (అన్ ఎడిటెడ్)ను పదో వార్షికోత్సవం నాడు అభిమానుల కోసం రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డిని కోరాడు. ఈ పోస్ట్ బాగానే వైరల్ అయింది కానీ.. మరోవైపు లైగర్ సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. అర్జున్ రెడ్డి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోలేని విధంగా లైగర్ చేదు అనుభవాన్ని మిగిల్చిందంటూ.. ఆ రోజు తాము ఎదుర్కొన్న వేదనను విజయ్ అభిమానులు పంచుకుంటున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసిన ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ లైగర్ రెండో వార్షికోత్సవం సందర్భంగా పోస్ట్ పెడితే కింద కామెంట్లన్నీ బూతులతో నిండిపోయాయి. ఇక ఎప్పటికీ అర్జున్ రెడ్డి వార్షికోత్సవాన్ని మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేయలేని విధంగా లైగర్ చేసిందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on August 26, 2024 1:21 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…