మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా చిరును అభిమానించే కోట్లాదిమంది.. తన సినిమాల ద్వారా తమకిచ్చిన ఆనందం గురించి గుర్తు చేసుకుంటూ ఆయన్ని కొనియాడుతున్నారు. ఐతే అదే సమయంలో చిరు ద్వారా సినీ పరిశ్రమలో ఎదిగిన.. ఆయన ద్వారా సాయం పొందిన వాళ్లు ఆయనకు చేతులెక్కి మొక్కుతున్నారు. తమిళ నటుడు పొన్నాంబళం అయితే.. తాను ఇప్పుడు బతుకుతున్న జీవితం చిరుదే అంటూ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.
చిరు పుట్టిన రోజు వేడుకల కోసమే చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన పొన్నాంబళం.. తనకు చిరు ఎలా పునర్జన్మనిచ్చాడో వివరించారు. పొన్నాంబళం కొన్నేళ్ల కిందట కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ చిక్కి శల్యమైపోయిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయనకు కిడ్నీ మార్పిడి చేయించుకునే పరిస్థితి కూడా లేకపోయింది. తన దుస్థితి తెలుసుకుని చిరునే సాయం చేసిన సంగతి గతంలోనే వెల్లడైంది.
ఐతే చిరు పొన్నాంబళంకు సాయం చేసింది లక్షో రెండు లక్షలో లేదంటే ఐదు లక్షలో కాదు. చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం తనే పెట్టుకుంటానని చెప్పి ఏకంగా రూ.58 లక్షలు సాయం చేసి పొన్నాంబళంకు కిడ్నీ మార్పిడి చేయించారట. తన సినిమాల్లో ఫైటర్ పాత్రలు చేసిన ఓ పరభాషా నటుడికి చిరు ఇంత సాయం చేయడం ఎంత గొప్ప విషయం. తన దగ్గరివాళ్లే పట్టించుకోని పరిస్థితిలో చిరు తనకు సాయం చేసి మళ్లీ జన్మనిచ్చాడని.. తన దృష్టిలో ఆయన ఒక దేవుడని పొన్నాంబళం చెప్పాడు.
చిరుది మొదట్నుంచి గొప్ప మనసే అని.. ‘ఘరానామొగుడు’ షూటింగ్ టైంలో తనకు భోజనం రావడం ఆలస్యం అయిందని.. ఐతే తాను భోంచేసే వరకు షూటింగ్ ఆపించి మరీ చిరు చిన్న స్థాయి నటుల పట్ల తన ఆపేక్షను చాటుకున్నాడని పొన్నాంబళం చెప్పాడు. 80వ దశకంలో ఫైటర్లకు రోజుకు రూ.350 ఇచ్చేవారని.. కానీ చిరు సినిమాకు పని చేస్తే మాత్రం సొంతడబ్బులు పెట్టి మరీ ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇచ్చేవాడని గుర్తు చేసుకుని పొన్నాంబళం భావోద్వేగానికి గురయ్యాడు.
This post was last modified on August 22, 2024 9:57 am
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…