చిరంజీవి, బాలకృష్ణల మధ్య బాక్సాఫీస్ పరంగా ఎలాంటి పోటీ ఉన్నప్పటికీ ఇద్దరికి మంచి స్నేహం ఉందన్న విషయం ఇండస్ట్రీ జనాలకు బాగా తెలుసు. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి ప్రమోషన్లలో ఖైదీ నెంబర్ 150 పోటీ గురించి మాట్లాడుతూ తనకు పరిశ్రమలో ఉన్న ఫ్రెండ్స్ లో చిరు ముందు వరసలో ఉంటారని, ఆయనతో చాలా విషయాలు షేర్ చేసుకుంటానని బాలయ్య అన్నారు. లాంచ్ ఈవెంట్ కు మెగాస్టార్ గెస్టుగా వచ్చారు. అయితే సంక్రాంతికి జరిగే వీళిద్దరి క్లాష్ జరిగితే అభిమానులలో విపరీతమైన ఎగ్జైట్ మెంట్ వచ్చేస్తుంది. ఎవరిది పై చేయి అవుతుందనే దాని మీద రకరకాల డిబేట్లు పెట్టుకుంటారు.
మరోసారి ఈ యుద్ధాన్ని చూసే అవకాశం దక్కబోతోంది. విశ్వంభర జనవరి 10 విడుదల చేయబోతున్నట్టు యువి సంస్థ షూటింగ్ మొదలైన టైంలోనే చెప్పేసింది. దానికి అనుగుణంగానే వేగంగా చిత్రీకరణ చేసి చివరి దశకు వచ్చేశారు. వాయిదా పడే ఛాన్స్ ఒక్క శాతం కూడా లేదని మెగా వర్గాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. దర్శకుడు వశిష్ట మేకింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఊరిస్తున్నారు. బాబీ డైరెక్షన్ లో సితార సంస్థ రూపొందిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ఎన్బికె 109 సైతం జనవరి రేసులోనే పాల్గొనబోతోంది. గత ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు ఇద్దరూ తలపడి హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే.
గతంలో ఎన్నోసార్లు ఈ పోటీ జరిగింది కానీ ప్రజారాజ్యం కోసం బ్రేక్ తీసుకుని తిరిగి చిరంజీవి కంబ్యాక్ ఇచ్చాక బాలయ్యతో పోటీ పడింది రెండు సార్లే. ఇద్దరూ గెలిచారు.ఇప్పుడు మూడోసారి రిపీట్ కావాలన్నది ఫ్యాన్స్ కోరిక. అయితే సంక్రాంతి వేడి ఇక్కడితో అయిపోలేదు. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ పండగకే రెడీ అవుతోంది. రవితేజ, భాను బోగవరపు కలయిక వచ్చే చిత్రం పోటీకి సై అంటోంది. ఇది ఎన్బికె 109 నిర్మిస్తున్న సితార బ్యానర్ దే కావడం ట్విస్టు. నాగార్జున బరిలో లేరు కానీ ఒకవేళ కుబేర ఆలస్యమైన పక్షంలో తన సెంటిమెంట్ ఫాలో అయితే ఇది కూడా పందెంలో ఉంటుంది. చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…