ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన లక్కీ భాస్కర్ మరోసారి కొత్త డేట్ వెతుక్కుంది. తొలుత ప్రకటించిన సెప్టెంబర్ కాకుండా ఏకంగా నెలన్నర ఆలస్యంగా అక్టోబర్ 31 విడుదల చేయబోతున్నట్టు సితార సంస్థ అధికారికంగా ప్రకటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మనీ క్రైమ్ థ్రిల్లర్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్. ధనుష్ తో సార్ రూపంలో బ్లాక్ బస్టర్ సాధించాక తిరిగి అదే దర్శకుడితో నిర్మాత నాగవంశీ ప్రాజెక్టు లాక్ చేసుకున్నారు. టాలీవుడ్ లో బలమైన ముద్ర వేయాలని చూస్తున్న దుల్కర్ సల్మాన్ దీన్నో మంచి అవకాశంగా భావించి అనుకున్న దానికన్నా ఎక్కువ డేట్లే ఇచ్చారట.
దీని సంగతలా ఉంచితే అక్టోబర్ 31 వస్తున్నట్టు గతంలోనే విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ ప్రకటించింది. ఆ మధ్య ప్రమోషన్లు మొదలుపెట్టి ఒక లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తన కెరీర్ లోనే బెస్ట్ ఆల్బమ్ అవుతుందని, స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంటుందని విశ్వక్ ఊరించడం అభిమానుల్లో అంచనాలు పెంచింది. మంచి డేట్ కావడంతో ఓపెనింగ్స్ తో పాటు రన్ దక్కుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు లక్కీ భాస్కర్ రావడం వల్ల పోటీ అనివార్యమైపోయింది. కథ ఇక్కడితో అయిపోలేదు. ముందు ముందు ఏదైనా ప్యాన్ ఇండియా మూవీ వచ్చినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి కాంపిటీషన్ తప్పడం లేదు కానీ సోలో డేట్ల కోసం ప్రయత్నిస్తున్న హీరోలకు అది సాధ్యపడటం లేదు. విశ్వక్ సేన్ కు ముందైతే అడ్డు లేదు. కానీ ఇప్పుడు లక్కీ భాస్కర్ తో పాటు కార్తీ అరవింద్ స్వామిల సినిమాతోనూ తలపడాల్సి ఉంటుంది. అన్నీ మల్టీ లాంగ్వేజ్ చిత్రాలు కావడం వల్ల థియేటర్ల పంపకాల్లో రాజీ ఉంటుంది. కింగ్ అఫ్ కోత తర్వాత దుల్కర్ సల్మాన్ కు బాగా గ్యాప్ వచ్చింది. మలయాళం దర్శకులకు కమిట్ మెంట్స్ ఇవ్వడం లేదు. ఒప్పుకున్నవి కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇదంతా లక్కీ భాస్కర్ మీద బలమైన నమ్మకం వల్లేనేమో.
This post was last modified on August 20, 2024 7:39 pm
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…