హిందీ బెల్టులోనూ భారీ రికార్డులను సాధించిన కల్కి 2898 ఏడిని లక్ష్యంగా పెట్టుకుంది లేటెస్ట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్త్రీ 2. ఇప్పటిదాకా 2024లో జరిగిన బాలీవుడ్ రిలీజుల్లో కల్కినే సుమారు 295 కోట్లతో అగ్ర స్థానంలో ఉంది. డబ్బింగ్ మూవీ అయినప్పటికీ కంటెంట్ కి ఫిదా అయిన ఉత్తరాది ప్రేక్షకులు ప్రభాస్ మూవీకి బ్రహ్మరథం పట్టారు. అయితే స్త్రీ 2 ఇంకా రెండో వారంలోకి అడుగు పెట్టకుండానే 242 కోట్లను దాటేయడం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. పెద్ద మార్జిన్ తో కల్కిని సులభంగా దాటేస్తుందని ముంబై విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూస్తుంటే ఇదేమి అసాధ్యం కాదనిపిస్తోంది.
ఎందుకంటే ఫైనల్ రన్ ఇంకా చాలా దూరంలో ఉంది. ఇప్పుడప్పుడే పెద్ద రిలీజులు లేవు. సరిపోదా శనివారం హిందీ వెర్షన్ ఆగస్ట్ 29 వస్తుంది కానీ స్త్రీ 2ని తీవ్రంగా ప్రభావితం చేయకపోవచ్చని అనుకుంటున్నారు. తెలుగులో బాగా ఆడిన దసరా, హాయ్ నాన్నలు అక్కడ ఆశించిన మేజిక్ చేయలేకపోయాయి. కానీ ఈసారి ఈ సెంటిమెంట్ మార్చాలనే పట్టుదలతో నాని ఉన్నాడు. ఇక స్త్రీ 2 సంగతి చూస్తే వీక్ డేస్ లోనూ మంచి జోరు చూపించడంతో బయ్యర్ల సంతోషం అంతా ఇంతా కాదు. యానిమల్ తర్వాత మళ్ళీ రోజుల తరబడి థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు దీనికే చూస్తున్నామని అంటున్నారు.
స్టార్ లేకుండా రాజ్ కుమార్ రావు లాంటి చిన్న సైజు హీరోతో శ్రద్ధా కపూర్ ని టైటిల్ రోల్ లో పెట్టి ఇంత ఫలితం అందుకోవడం ఎవరూ ఊహించనిది. అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్ లాంటి ప్రముఖులు ఈ విజయాన్ని చూసి మహదానంద పడుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లలో కల్కిని స్త్రీ 2ని పూర్తిగా అందుకోవడం జరగని పని.
మూడు నుంచి నాలుగు వందల కోట్ల దగ్గర క్లోజ్ అవ్వొచ్చని ఒక ప్రిడిక్షన్. ఏది ఏమైనా ఈ మధ్య కామెడీ హారర్ జానర్ కు మళ్ళీ ఊపొచ్చింది. ఆ మధ్య ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ముంజ్యా సర్ప్రైజ్ హిట్టు కొట్టింది.
This post was last modified on August 20, 2024 5:16 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…