Movie News

శనివారం మీదే ఆగస్ట్ భారం

టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా కీలకంగా భావించిన జెండా పండగ నీరుగారిపోయింది. భారీ అంచనాలు మోసుకొచ్చిన పెద్ద హీరోల సినిమాలు నిరాశ పరచడం బయ్యర్లకు శరాఘాతంగా మారింది. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ రెండూ ఒకదాన్ని మించి మరొకటి ప్రేక్షకులను భయపెట్టడంతో సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు. ఆయ్, కమిటీ కుర్రోళ్ళు పెర్ఫార్మన్స్ చాలా బాగున్నప్పటికీ అధిక శాతం థియేటర్లను ఫీడ్ చేయడానికి ఇవి సరిపోవు. స్టార్ హీరోలకు ఆకర్షితులైనంతగా మాస్ జనాలు వీటిని చూడరు. అందుకే నెంబర్లు మహా అయితే పది ఇరవై కోట్ల మధ్యలో ఉంటాయి.

వచ్చే ఆగస్ట్ 23 సైతం చిన్న చిత్రాలే ఉండటంతో అందరి కన్ను ఆగస్ట్ 29 వైపు వెళ్తోంది. నాని దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద నిర్మాత డివివి దానయ్య బృందం బలమైన నమ్మకంతో ఉంది. ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. దసరా, హాయ్ నాన్న సూపర్ హిట్స్ తర్వాత నాని చేసిన మూవీ కావడంతో బిజినెస్ పరంగానూ క్రేజీ ఆఫర్స్ సొంతం చేసుకుంది. ప్రమోషన్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు. నాని ప్రత్యేకంగా ప్రక్క రాష్ట్రాలకు వెళ్లి మీడియా, అభిమానులను కలుస్తున్నాడు. హిట్ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

సో సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం. ఎలాగూ సరిపడా థియేటర్లు దొరుకుతాయి. కాంపిటీషన్ లేదు. ఆపై వారం టెన్షన్ అక్కరలేదు. టాక్ అందుకుంటే చాలు థియేటర్లు నిండిపోతాయి. కథ మొత్తం అరటిపండు వలిచినట్టు చెప్పేస్తున్న నాని టీమ్ దాన్ని బట్టే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఎస్జె సూర్య విలనిజం ప్రధాన ఆకర్షణ కాబోతోంది. జెక్స్ బెజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైప్ పెంచేసింది. ఆగస్ట్ నెల భారాన్ని చేతుల్లోకి తీసుకున్న శనివారం ఆ బాధ్యతను నెరవేర్చాలనేదే అందరి కోరిక.

This post was last modified on August 18, 2024 10:41 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago