అసలే అంచనాలు లేకుండా సైలెంట్ కిల్లర్ గా వచ్చి సూపర్ హిట్ సాధించిన మహారాజా తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించింది. విజయ్ సేతుపతి సోలో హీరోగా టాలీవుడ్ లో అందుకున్న మొదటి డబ్బింగ్ సక్సెస్ ఇదేనని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి వంద కోట్ల గ్రాస్ దాటేసిన ఈ క్రైమ్ కం సస్పెన్స్ థ్రిల్లర్ దర్శకుడు నితిలన్ స్వామినాథన్ తర్వాతి సినిమాకు రంగం సిద్ధమైనట్టుగా చెన్నై టాక్. టైటిల్ మహారాణిగా పెట్టినట్టు సమాచారం. జానర్ మార్చకుండా ఈసారి అంతకు మించి థ్రిల్స్, కట్టిపడేసే కథనంలో స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు వినికిడి.
టైటిల్ రోల్ కోసం నయనతారను సంప్రదిస్తే సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఫ్యాషన్ స్టూడియోస్ లోనే నిర్మాణం జరగొచ్చని వినికిడి. అయినా మహారాజా హిట్టయ్యిందని మహారాణి అని పెట్టడం కొంచెం వెరైటీగా అనిపిస్తున్నా హిట్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ అలా పెడుతున్నారేమో. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా తమిళ సీమని డామినేట్ చేస్తున్న నయనతార గతంలో ఇలాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు డోరా, నేత్రికన్ లాంటివి చాలానే చేసింది కానీ అవేవి ఆశించిన స్థాయిలో విజయం అందించలేదు.
ఇప్పుడిది ప్యాన్ ఇండియా నిర్మాణం కాబట్టి తప్పులు జరగకపోవచ్చు. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ ప్రాధమికంగా చర్చలు జరిగినట్టు తెలిసింది. మహారాజా అటు నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో వచ్చాక వారాల తరబడి ట్రెండింగ్ లో ఉంది. నెల రోజుల తర్వాత కూడా వరల్డ్ వైడ్ టాప్ 10 లో కొనసాగడం విశేషం. అంతకు ముందు చేసిన సినిమా సరిగా ఆడకపోవడంతో మహారాజా స్క్రిప్ట్ కోసం చాలా సమయం వెచ్చించిన స్వామినాథన్ అనుకున్న దానికన్నా మెరుగైన ఫలితాన్ని అందుకున్నాడు. కేవలం ఇరవై కోట్ల లోపే చిత్రాన్ని పూర్తి చేసి దానికి అయిదింతలు రాబడి వచ్చే అవుట్ ఫుట్ ఇచ్చాడు.
This post was last modified on August 14, 2024 10:05 pm
వ్యక్తిగత జీవితంలో నువ్వా నేనా అంటూ వివాదాలు, గొడవల్లో ఉంటున్న మంచు సోదరులు విష్ణు, మనోజ్ బాక్సాఫీస్ వద్ద కూడా…
రజనీకాంత్ లాంటి పెద్ద సూపర్ స్టార్. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ అగ్ర హీరో నాగార్జున ప్రత్యేక పాత్ర. కన్నడలోనే బిజీగా…
మాములుగా ఏదైనా పెద్ద సినిమాకు పాటల రికార్డింగ్ జరిగిపోయాక వాటిని ఎప్పుడు షూట్ చేస్తారు, ఎంత టైంలో విడుదలవుతుందనేది మ్యూజిక్…
ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంబాజి మహరాజ్ సీన్స్ చాలామందిని కదిలించాయి. ముఖ్యంగా ఔరంగజేబు క్యారెక్టర్ శంబాజిని అతి క్రూరంగా…
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…