కంగువ.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రానున్న చిత్రాల్లో పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక అంచనాలున్న చిత్రాల్లో ఇదొకటి. విలక్షణ కథానాయకుడు సూర్య కెరీర్లో ఇది గేమ్ చేంజర్ అవుతుందనే అంచనాలున్నాయి. ఇప్పటిదాకా సూర్య ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో పాటు కమర్షియల్ చిత్రాలు కూడా చేశాడు కానీ.. వైవిధ్యం, కమర్షియల్ అంశాలు జోడించి ఒక భారీ ఈవెంట్ ఫిలింగా దీన్ని తీర్చిదిద్దినట్లు కనిపిస్తున్నాడు దర్శకుడు శివ.
ఇప్పటిదాకా రొటీన్ మాస్ మూవీసే తీసిన శివ.. ఈసారి మాత్రం ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లి విహరింపజేసేలా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన రెండు టీజర్లు.. పాట వావ్ అనిపించాయి. ఇక అందరూ ఎదురు చూస్తున్నది ట్రైలర్ కోసమే. ఐతే ‘కంగువ’ రిలీజ్ అక్టోబరు 10న రాబట్టి అంతకు రెండు మూడు వారాల ముందు ట్రైలర్ వస్తుందనే అంచనాతో ఉన్నారు ఫ్యాన్స్. కానీ వాళ్లందరికీ పెద్ద షాకే ఇవ్వబోతోంది ‘కంగువ’ టీం.
విడుదలకు రెండు నెలల ముందే ‘కంగువ’ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారట. ఇందుకోసం ఆగస్టు 12న ముహూర్తం కూడా కుదిరిందట. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ దాదాపుగా పూర్తి కావచ్చాయని.. ఫస్ట్ కాపీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందని.. ఈ నేపథ్యంలో ట్రైలర్ ముందుగానే వదిలేసి ముందు నుంచే హైప్ ఇంకా పెంచాలని చూస్తున్నారట. ట్రైలర్ వదిలాక అందరిలోనూ ఆసక్తి ఇంకా పెరుగుతుందని.. ఆ తర్వాత ప్రమోషన్లు కూడా గట్టిగా చేసి సినిమాకు రీచ్ పెంచాలని అనుకుంటున్నారట.
‘బాహుబలి’ తరహాలో అద్భుతాలు చేయగల సత్తా ఉన్న సినిమా ఇదని టీం నమ్ముతోంది. అందుకే దేశవ్యాప్తంగా సినిమాకు హైప్ పెంచడం ద్వారా ఓపెనింగ్స్ భారీగా రాబట్టడానికి ప్లాన్ చేేస్తున్నారు. సూర్య సరసన దిశా పటాని నటించిన ఈ చిత్రంలో ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేశాడు.
This post was last modified on August 11, 2024 3:23 pm
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…