ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్నాక ప్రభాస్ అభిమానుల్లో మెదిలిన ఒకే ప్రశ్న సలార్ 2 శౌర్యంగపర్వం ఉంటుందా లేదాని. ఎందుకంటే నీల్ పూర్తిగా ఒక ఏడాది కాలం తారక్ ప్రాజెక్టు మీదే ఉంటాడు. 2026 సంక్రాంతి విడుదలని చెప్పేశారు కాబట్టి ఖచ్చితంగా ఆరేడు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలి. ఆపైన పోస్ట్ ప్రొడక్షన్ కి నెలల తరబడి సమయం అవసరం ఉంటుంది. సో సంక్రాంతికి ఖచ్చితంగా ఈ ప్యాన్ ఇండియా మూవీ వస్తుందన్న గ్యారెంటీ లేదు. ప్రస్తుతానికి లాక్ చేసుకున్నారు కానీ ఇదంత సులభం కాదు.
ఒకవేళ ఆలస్యమయ్యే పక్షంలో సలార్ 2 ఇంకా లేట్ అవుతుంది. నిజానికి ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూలలో జగపతిబాబు, బాబీ సింహ లాంటి ఆర్టిస్టులు మాట్లాడుతూ త్వరలోనే సీక్వెల్ ఉంటుందన్న రీతిలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కానీ జరగలేదు. ఇప్పుడు తారక్ తో కమిట్ మెంట్ మొదలైపోయింది కాబట్టి సలార్ 2 మీద ఇప్పుడప్పుడే ఆశలు పెట్టుకోవడం కష్టం. నిజానికీ సీక్వెల్ మీద ప్రశాంత్ నీల్ సీరియస్ గా ఉన్నాడానే డౌట్ రావడం సహజం. హోంబాలే ఫిలిమ్స్ కి ప్రభాస్ రేంజ్ తెలుసు కాబట్టి అవకాశాన్ని వదలుకోవడానికి సిద్ధం లేరు కానీ సలార్ 1కి కెజిఎఫ్ స్థాయి స్పందన దక్కలేదన్నది నిజం.
వందల కోట్లు వసూళ్ల ప్రాతిపదిక మీద బ్లాక్ బస్టర్ ముద్ర వేయడం తప్పించి కెజిఎఫ్ ని మించి సలార్ హిట్టు కొట్టాలన్న లక్ష్యం నెరవేరలేదు. ఈ సస్పెన్స్ ఇంకొంత కాలం భరించక తప్పదు. ప్రశాంత్ నీల్ తానుగా మీడియా ముందుకు వచ్చే దాకా ఈ డౌట్ అలాగే ఉండిపోతుంది. ఇంకోవైపు ప్రభాస్ ది రాజా సాబ్ పూర్తి చేశాక హను రాఘవపూడి, స్పిరిట్ షూట్లలో ఒకేసారి పాల్గొనే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా అసలైన కల్కి 2898 ఏడి పార్ట్ టూ ఉంది. ఈ లెక్కన సలార్ 2 ఎదురుచూపులు చాలా టైం పట్టేలా ఉంది. మరీ లేట్ అయితే అంత ఆసక్తి ఉంటుందంటారా.
This post was last modified on August 9, 2024 5:26 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…