Movie News

దేవర ముంగిట ఉన్నది 55 రోజులే

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న దేవర విడుదలకు ఇంకొక్క 55 రోజులు మాత్రమే ఉందనే సంగతి అభిమానులకు టెన్షన్ కలిగిస్తోంది. ఇప్పటిదాకా వచ్చింది ఒక ఆడియో సింగల్ మాత్రమే. రెండోది వచ్చే వారం రిలీజ్ కావొచ్చని ఇన్ సైడ్ టాక్. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన సాంగ్ సిద్ధంగా ఉందని, ఫైనల్ మిక్సింగ్ ఆలస్యం కావడం తప్పించి వేరే కారణం లేదని అంటున్నారు. ఇంకా ఎన్ని పాటలు ఉన్నాయో బయటికి చెప్పడం లేదు. మొత్తం నాలుగని వినికిడి. వాటిలో ఒక భారీ డాన్స్ నెంబర్ ఉంది. మరొకటి జాన్వీ కపూర్ తో ఆడిపాడిన డ్యూయెట్ మెలోడీ.

ఇకపై దేవరకు ప్రతిరోజు పరుగు పందెమే. భారీ పబ్లిసిటీకి రంగం సిద్ధం చేసుకోవాలి. ఇంకా షూటింగ్ చివరి దశలోనే ఉన్న దేవరకు ఎప్పుడు గుమ్మడికాయ కొడతారాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా రావాలంటే అతనికి తగిన సమయం ఇవ్వాలి. అది కూడా చెన్నైలోనే జరగాలి. మరి ఫస్ట్ కాపీ వీలైనంత త్వరగా రెడీ చేస్తే తప్ప ఈ ముందడుగు పడదు. పైగా అనిరుధ్ డేట్స్ ముందే లాక్ చేసుకోవాలి. చివరి నిమిషంలో కనక ఒత్తిడి చేస్తే ఇండియన్ 2 లాగా సగం ఉడికిన అవుట్ ఫుట్ వస్తుంది.

సెప్టెంబర్ 27 విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనే లక్ష్యంతో కొరటాల శివ బృందం కష్టపడుతోంది. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలు వగైరాలు చాలా ప్లాన్ చేసుకోవాలి. బయ్యర్లు లాక్ చేసుకుంటున్న డీల్స్ వింటుంటే మతులు పోతున్నాయి. అవి రికవర్ కావాలంటే ఓపెనింగ్స్ ఆర్ఆర్ఆర్, కల్కి రేంజ్ లో రావాలి. దానికి తగ్గట్టే దేవర రూపొందిందని ఇన్ సైడ్ టాక్. ఇదింకా మొదటి భాగమే అయినా బాహుబలి తరహాలో సీక్వెల్ మీద విపరీతమైన ఆసక్తి పుట్టించేలా కంటెంట్ వచ్చిందని, ఖచ్చితంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తుందని టీమ్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on August 2, 2024 2:37 pm

Share

Recent Posts

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

19 minutes ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

23 minutes ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

1 hour ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

1 hour ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

2 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

3 hours ago