టాలీవుడ్లో ఎక్కువగా పర భాషా కథానాయికలదే హవా. స్టార్ హీరోయిన్లందరూ వాళ్లే. ఐతే పది పదిహేనేళ్లుగా నటిస్తున్న కొందరు హీరోయిన్లు కూడా ఇప్పటికీ తెలుగులో మాట్లాడలేని పరిస్థితి. డబ్బింగ్ మీదే ఆధారపడుతుంటారు. వాయిస్ బాలేక డబ్బింగ్‌కు వెళ్తే ఓకే కానీ.. ఎన్నేళ్లు ఇక్కడ ఉన్నా భాష నేర్చుకోకపోవడం అంటే వాళ్ల కమిట్మెంట్ మీద సందేహాలు కలుగుతాయి. ఐతే ఇప్పుడో హీరోయిన్ తెలుగులో తాను చేస్తున్న తొలి చిత్రంతోనే సొంత గొంతు వినిపించబోతోంది.
టాలీవుడ్లో ఇప్పటికే సెన్సేషన్‌గా మారిన ఆ అమ్మాయే.. భాగ్యశ్రీ బోర్సే. ఈ మాజీ మోడల్.. మాస్ రాజా రవితేజ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ససంబంధించి పాటలు, ఇతర ప్రోమోల్లో భాగ్యశ్రీ ఎంతగా హైలైట్ అయిందో తెలిసిందే. తన అందచందాలు, హావభావాల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఆమె స్టార్ స్టేటస్ సంపాదించేసింది.
ఇప్పుడు భాగ్యశ్రీ అభిమానులతో మరిన్ని మంచి మార్కులు వేయించుకునే పని చేసింది. ‘మిస్టర్ బచ్చన్’లో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. దీనికి సంబంధించి మిస్టర్ బచ్చన్ టీం అఫీషియల్ అప్‌డేట్ కూడా ఇచ్చింది. ఒకప్పటి హీరోయిన్లతో పోలిస్తే ప్రస్తుత కథానాయికలు డబ్బింగ్ చెప్పుకోవడానికి మంచి ప్రయత్నమే చేస్తున్నారు. ఐతే రెండు మూడు సినిమాలు చేశాకే డబ్బింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ తెలుగులో చేస్తున్న తొలి చిత్రానికే ఇలా వాయిస్ ఇచ్చేవాళ్లు మాత్రం అరుదు.
ఇది భాగ్యశ్రీ కమిట్మెంట్‌ను సూచిస్తుంది. అందుకే ఆమె మీద సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే భాగ్యశ్రీ ‘మిస్టర్ బచ్చన్’ ప్రోమోల్లో తన అందచందాలతో ఆకట్టుకుని రెండు సినిమాల్లో ఛాన్సులు కూడా పట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ టాలెంట్ కూడా చూపిస్తే ఆమెను ఆపడం కష్టమేనేమో. త్వరలోనే ఆమెను పెద్ద స్టార్‌గా చూడబోతున్నామన్నమాట.
This post was last modified on July 31, 2024 2:55 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…