డిసెంబర్ 6 పుష్ప 2 ది రూల్ వచ్చేస్తుందనే ధీమా అభిమానుల్లో బలంగా ఉంది. ఆగస్ట్ 15 లాంటి మంచి డేట్ వదులుకోవడం పట్ల నిర్మాతలు కలవరపడుతున్నా పరిస్థితులు దానికి ప్రేరేపించాయి కాబట్టి ఎవరూ ఏం చేయలేరు. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ షూటింగ్ ని రీ స్టార్ట్ చేశారు. త్వరలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ కు సంబంధించిన ముఖ్యమైన ఎపిసోడ్స్ ని ప్లాన్ చేశారని తెలిసింది. నిజానికి రిలీజ్ డేట్ మిస్ కావడంలో ప్రధాన పాత్ర పోషించిన కారణాల్లో ఫహద్ డేట్లు దొరక్కపోవడం కూడా ఉంది. సరే అంతా సవ్యంగా ఉంది కదా కొత్త ప్రచారాలు ఏంటనుకుంటున్నారా.
కొన్ని ముంబై వర్గాలు పుష్ప 2 డిసెంబర్ లో వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయని, 2025 వేసవికి వాయిదా పడొచ్చనే రీతిలో కథనాలు వెలువరించడంతో బన్నీ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళ వెర్షన్ కు బలం చేరకూర్చేలా డిసెంబర్ 6నే బాలీవుడ్ మూవీ చావాని విడుదల చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే సమాచారం కొత్తగా తోడయ్యింది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ హిస్టారికల్ డ్రామాలో హీరోయిన్ రష్మిక మందన్నే కావడం కాకతాళీయం. పుష్ప 2తో క్లాష్ అయ్యేందుకు రోహిత్ శెట్టి లాంటి స్టార్ డైరెక్టరే వెనుకడుగు వేసినప్పుడు చావాకు అంత ధైర్యం ఎక్కడిదనే డౌట్ సహజం.
ఇదంతా ఇప్పుడప్పుడే తేలే యవ్వారం కాదు. పుష్ప చేతిలో కేవలం 4 నెలల సమయం మాత్రమే ఉంది. బ్యాలన్స్ టాకీ పార్ట్ తో పాటు స్పెషల్ సాంగ్ పూర్తి చేయాలి. ప్రమోషన్లు, పోస్ట్ ప్రొడక్షన్, ఈవెంట్లు, సాంగ్స్ లాంచులు, వివిధ రాష్ట్రాల పర్యటనలు, మీడియా ఇంటర్వ్యూలు ఇలా బోలెడు పనులు పీకల మీద ఉంటాయి. పైగా సెన్సార్ ప్రివ్యూకు ముందు రోజు వరకూ ఎడిటింగ్ రూంలో ఉంటాడనే పేరున్న సుకుమార్ ఈసారి అడ్వాన్స్ గా ఫస్ట్ కాపీ సిద్ధం చేస్తారానేది పెద్ద ప్రశ్న. ఇప్పటికైతే రెండు పాటలు వచ్చేశాయి. అక్టోబర్ లో టీజర్ ప్లాన్ చేస్తున్నారట. పరుగులు పెట్టయినా సరే ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదు.
This post was last modified on July 30, 2024 2:10 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…